Tuesday, May 17, 2016

48 గంటల్లో తుఫానుగా మారే అవకాశం


బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండంబుధవారం ఉదయం చెన్నైకి తూర్పు దిశగా 70 కిలోమీటర్ల దూరంలో ఉందని చెన్నై వాతావరణ కేంద్రం తెలిపింది. గంటకు 11 కిలోమీటర్ల వేగంతో ఉత్తర దిశగా కదులుతోంది. ఈ వాయుగుండం చెన్నై నుంచి ఉత్తర దిశగా ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా వైపు పయనిస్తుందని చెన్నై వాతావరణ కేంద్రం తెలిపింది 48 గంటల్లో తీవ్ర వాయుగుండంగా, తదుపరి తుఫానుగా మారే అవకాశముందని అధికారులు వెల్లడించారు. వాయుగుండం ప్రభావంతో తమిళనాడులోని కోస్తా జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. చెన్నైలో ఈ దురుగాలులతో కూడి వర్షం కురవడంతో రహదారులు జలమయమయ్యాయి. పలు చోట్ల చెట్లు నేలకొరిగాయి. చెన్నై నంగరంలోని చంబరంబాక్కం రిజర్వాయర్‌కు భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. చెన్నై శివారులో రాత్రి వరకు 17.7 సెం.మీ. వర్షపాతం నమోదైంది. నాగపట్నం, పుదుచ్చేరి, రామేశ్వరం ఓడరేవుల్లో మూడో నంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
అప్రమత్తమైన ప్రభుత్వం
గత డిసెంబరులో ముంచెత్తిన భారీ వరదలను దృష్టిలో పెట్టుకుని తమిళనాడు ప్రభుత్వం అధికారులను అప్రమత్తం చేసింది. అరక్కోణం నుంచి 8 బృందాలు ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బందిని సమాయత్తంగా ఉంచింది. లోతట్టు ప్రాంతాలలో నిరంతరం పర్యవేక్షించి అవసరమైతే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించింది. చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాల్లో కంట్రోల్‌ రూం ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు జరగాల్సిన అంబేద్కర్‌ లా యూనివర్సిటీ న్యాయ విద్య సెమిస్టర్‌ పరీక్షలను వాయిదాపడ్డాయి.

సేమ్ టు సేమ్!



బిడ్డలు ఎంత ఎదిగినా అమ్మానాన్నలకు చిన్నపిల్లల్లానే అనిపిస్తారు. అలాగే, ఎదిగాక కూడా అమ్మానాన్నల ముందు చిన్నపిల్లలైపోతారు బిడ్డలు. ఇటీవల అనుష్క అలానే చేశారు. నాన్‌స్టాప్‌గా షూటింగ్స్ చేసిన ఈ బ్యూటీ బెంగళూరు వెళ్లారు. అక్కడ కుటుంబ సభ్యులతో హాయిగా ఎంజాయ్ చేశారు. ఏదో పూజలు కూడా చేశారట. హాలీడే ట్రిప్ చివరి రోజున అమ్మానాన్నతో సరదాగా అనుష్క సెల్ఫీ దిగారు. కూతురు ఎలాంటి ఎక్స్‌ప్రెషన్ పెట్టమంటే అనుష్క తల్లితండ్రులు ప్రఫుల్ల, విఠల్‌లు సరిగ్గా అలానే ఎక్స్‌ప్రెషన్ పెట్టారు. ఎక్స్‌ప్రెషన్స్ అన్నీ దాదాపు సేమ్ టు సేమ్ ఉన్నాయి కదూ.