మహేశ్‌బాబు హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమాలో
దర్శకుడు కమ్ హీరో అయిన ఎస్.జె. సూర్య విలన్‌గా నటిస్తున్న సంగతి
తెలిసిందే. ఇప్పుడీ సినిమాలో విలన్‌గా నటిస్తున్నట్లు మరో హీరో కూడా
ప్రకటించారు. అతను ఎవరో కాదు... ‘ప్రేమిస్తే’ చిత్ర ఫేమ్ భరత్.
ఇప్పటివరకూ భరత్ నెగిటివ్ రోల్ చేయలేదు. మహేశ్ సినిమాతో విలన్‌గా
ఎంట్రీ ఇస్తున్నారు. అహ్మదాబాద్‌లో జరుగుతోన్న సినిమా షూటింగ్‌లో భరత్
కొన్ని రోజులు పాల్గొన్నారు.
ఈ షెడ్యూల్ తర్వాత బ్యాంకాక్, హైదరాబాద్, పుణేలలో జరగబోయే
షెడ్యూల్స్‌లోనూ పాల్గొననున్నారు. ‘‘మహేశ్ ఫ్రెండ్లీ కో–స్టార్. ఈ
సినిమాలో ఛాన్స్ రావడం సంతోషంగా ఉంది. దర్శకుడు నా పాత్రను ఆసక్తికరంగా
రాశారు’’ అని భరత్ తెలిపారు. ‘ఠాగూర్’ మధు, ఎన్వీ ప్రసాద్ సంయుక్తంగా
నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘సంభవామి’ అనే టైటిల్ ఖరారు చేసినట్టు
సమాచారం.