ప్రస్తుతం టాలీవుడ్ సీనియర్ హీరోలకు హీరోయిన్ల కష్టాలు ఎక్కువవుతున్నాయి.
తమ ఇమేజ్ కు, ఏజ్ కు తగ్గ హీరోయిన్లు తక్కువగా ఉండటంతో హీరోయిన్ల కోసం
తిప్పలు తప్పడం లేదు. నయనతార, అనుష్క లాంటి ఒకరిద్దరు మాత్రమే సీనియర్
హీరోలకు సెట్ అవుతారని భావిస్తున్నారు దర్శక నిర్మాతలు. అయితే ఈ హీరోయిన్లు
లేడీ ఓరియంటెడ్ సినిమాల మీద కాన్సన్ ట్రేట్ చేస్తుండటంతో స్టార్ హీరోలకు
ఎదురుచూపులు తప్పటం లేదు.
తాజాగా నందమూరి బాలకృష్ణ వందో సినిమాగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న గౌతమీ పుత్ర శాతకర్ణి సినిమా విషయంలోనూ ఇదే సమస్య ఎదురైంది. ముందుగా ఈ సినిమా కోసం నయనతారను హీరోయిన్ గా తీసుకోవాలని భావించారు. అయితే అదే సమయంలో చిరు 150వ సినిమాతో పాటు తమిళ్ లో కూడా మరికొన్ని సినిమాలు అంగీకరించి ఉండటంతో బాలయ్యకు నో చెప్పింది. ఇక అంజలీ విషయంలోనూ అదే జరిగింది.
తరువాత కాజల్ హీరోయిన్ గా ఫైనల్ చేయాలని భావించినా వర్క్ అవుట్ కాలేదు. చాలా రోజులుగా టాలీవుడ్ లో రీ ఎంట్రీ కోసం ప్రయత్నాలు చేస్తున్న గోవా బ్యూటీ ఇలియానాకు ఛాన్స్ ఇద్దామని భావించినా ఈ అమ్మడు కూడా బాలయ్యకు నో చెప్పేసిందన్న టాక్ వినిపిస్తోంది. సీనియర్ హీరోల సరసన నటిస్తే కెరీర్ త్వరగా ముగిసిపోతుందన్న భయంతోనే ఇలియానా బాలయ్యకు నో చెప్పిందన్న టాక్ వినిపిస్తోంది. అసలే అవకాశాల్లేక కష్టాల్లో ఉన్న సమయంలో బాలయ్య లాంటి స్టార్ హీరో సరసన ఛాన్స్ వస్తే కాదనటం కర్టెక్ట్ కాదంటున్నారు విశ్లేషకులు.