కోల్‌కతాలోని
భారత్-దక్షిణాఫ్రికా మధ్య గురువారం రాత్రి జరగాల్సిన మూడో టీ20 మ్యాచ్
వర్షం కారణంగా రద్దెంది. సాయంత్రం కురిసిన వర్షానికి మైదానం చిత్తడిగా
మారడంతో అంపైర్లు మూడు సార్లు మైదానాన్ని పరిశీలించారు. క్యూరేటరు
నేతృత్వంలోని స్టేడియం సిబ్బంది ఎంత ప్రయత్నించినా ఆటకు మైదానం సిద్దం
కాలేదు. దీంతో అంపైర్లు ఇరు జట్ల కెప్టెన్లతో మాట్లాడి మ్యాచ్‌ను రద్దు
చేస్తున్నట్లు ప్రకటించారు. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ 2-0తో
దక్షిణాఫ్రికా సొంతం చేసుకుంది.