Wednesday, February 18, 2015

సిని రంగంలో మరో పూవ్వు నేల రాలింది...



డి.రామానాయుడు కాన్సర్‌ వ్యాధితో బాధపడుతూ ఈరోజు మధ్యాహ్నాం 3 గం|| మరణించారు. సినిమా రంగంలో అతనికి మారు పేరు మూవీ మోఘల్‌. రామానాయుడు 1936 జూన్‌ 6వ తేదిన జన్మించారు. తండ్రి వెంకటేశ్వర్లు. రామానాయుడుకి ఒక అక్క మరియు చెల్లెలు. మూడేళ్ల వయసులోనే తల్లి చనిపోయింది. సినిమా రంగంలో ప్రపంచ రికార్డు సృష్టించిన నిర్మాతగా డి. రామానాయుడు గిన్నిస్‌ బుక్‌ ఒక వేళ ఆ చిత్రం ప్లాప్‌ అయితే మరలా సినీరంగంలోకి అడుగుపెట్టనని సన్నిహితులతో అనేవారు. కానీ సినిమా విడుదలై బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయం సాధించింది. దాంతో వెనక్కు తిరిగి చూసుకోలేదు.




నేడు సినిపరిశ్రమ బంద్‌
                 మూబీ మొఘల్‌ డా|| డి. రామానాయుడు మరణం పట్ల ఫిలిం ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ఆయనకు నివాళి అర్పించేందుకు గురువారం నాడు సినిమా పరిశ్రమ బంద్‌నకు పిలుపునిచ్చింది. అలాగే ఘూటింగులతో పాటు థియేటర్లుకూడా బంద్‌ పాటించాలని ఇదే ఆయనకు అర్పించే గౌరవమైన నివాళి అని ప్రకటనలో పేర్కొన్నారు.

 


పలు అవార్డులు

2009లో దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డులు లభించింది.
2013లో భారత ప్రభుత్వం ఆయనకు పద్మభూషణ్‌తో సత్కరించింది.
అత్యధిక చిత్రాల నిర్మాతగా రామానాయుడు గిన్నిస్‌బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌తో చోటు పొందారు. 





12 మంది హీరోయిన్లు, ఏడుగురు సంగీత దర్శకులను చిత్రరంగానికి పరిచయం చేశారు.
1999లో బాపట్ల నుంచి తెలుగుదేశం తరుపున ఎంపీగా గెలుపొందారు.
2003లో బెస్ట్‌ పార్లమెంటేరియన్‌ పురస్కారం అందుకున్నారు.