Thursday, January 27, 2011

జై బోలో తెలంగాణ మూవీ స్టిల్స్‌ ఎక్స్లూజివ్‌

జై బోలో తెలంగాణ మూవీ స్టిల్స్‌ ఎక్స్లూజివ్‌














సినిమాల సందడి

 గగనం, అమెరికా అల్లుడు, వస్తాడు నా రాజు, అప్పల్రాజు, జై బోలో తెలంగాణ ాలా నాలుగు సినిమాలు వారి అభ్రిపాయాలు.
వివిదాస్పందంగా మారిన చిత్రం ' జై బోలో తెలంగాణ ' కు సెన్సార్‌ బోర్డు అనుమతి లభించింది. ఫిబ్రవరి 4న సినిమా విడుదల కానున్నట్లు దర్శక నిర్మాత ఎస్‌. శంకర్‌ ప్రకటించాడు.
నాగార్జున నటించిన ' గగనం ' చిత్రం ఫిబ్రవరి రెండో వారానికి విడుదల సిద్దమైంది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాతలు దిల్‌రాజ్‌, శిరీష్‌, లక్ష్మణ్‌లు తెలియజేస్తున్నారు.
శ్రీకాంత్‌, కామ్నా జెఠ్మలానీ, జెన్నీఫర్‌ కొత్వాల్‌ ప్రధాన పాత్రల్లో ఓం సాయి ప్రకాష్‌ దర్శకత్వంలో వస్తున్న చిత్రం ' అమెరికా అల్లుడు ' చంద్రశేఖరా మూవీస్‌ పతాకంపై కె. వెంకటరెడ్డి తెలుగులో అందిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఫిబ్రవరి మొదటి వారంలో విడుదలకు సిద్దమైంది. 

సునిల్‌ హీరోగా నటించిన అప్పల్రాజు ఫిబ్రవరి 4న విడుదలకు సిద్దం కానున్నది. అదే రోజు మోహన్‌ బాబు కూమారుడు విష్ణు ' వస్తాడు నారాజు ' చిత్రాన్ని అదే రోజున విడుదల చేస్తూ ఈ స్టార్‌ డైరెక్టర్‌తో సై అంటున్నారు. ' ఢ ' తర్వాత మరో హిట్‌ లేని విష్ణు ' సలీమ్‌' తర్వాత చాలా గ్యాప్‌ తీసుకుని చేసిన ఈ చిత్రంపై అచంచల నమ్మకంతో ఉన్నాడు. ' మర్యాద రామన్న ' తర్వాత సునిల్‌, స్వాతి కాంబినేషనల్‌లో వస్తున్న అప్పల్రాజు ఫిబ్రవరి 4న వచ్చే ఏర్పాటు చేస్తున్నారు.

' జై బోలో తెలంగాణ ' సినిమాకు గ్రీన్‌ సిగ్నల్‌

వివాదాస్పదంగా మారిన చిత్రం ' జైబోలో తెలంగాణ ' కు సెన్సార్‌ బోర్డు అనుమతి లభించింది. ఫిబ్రవరి 4న సినిమా విడుదల కానున్నట్లు దర్శక నిర్మాత ఎస్‌. శంకర్‌ ప్రకటించాడు. సెన్నార్‌ బోర్డ్‌లో కొందరు సీమాంధ్రులు సినిమా విడుదలకు అడ్డుకట్ట వేశారంటూ తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు వెల్లవెత్తడం సంగతి విదితమే. గత కొద్ది రోజులుగా ' జై బోలో తెలంగాణ ' సినిమాకి సెన్సార్‌ ాబ్బందులు ఎదురయిన సంగతి విదితమే. దీంతో ' జై బోలో తెలంగాణ ' సినిమా విడుదలకు మార్గం సుగమమయింది.

మార్చి 6న అల్లు అర్జున్‌ పెళ్లి

 అల్లు అర్జున్‌ రియల్‌ లైఫ్‌లో ' వరుడు ' కాబోతున్నాడు. ఈ మేరకు ముహూర్తం ఖరారైంది. మార్చి 6న అల్లు అర్జన్‌ వివాహానికి పెద్దలు ముహూర్తం నిర్ణయించారు. హైదరాబాద్‌కి చెందిన స్నేహారెడ్డితో అల్లు అర్జున్‌ వివాహం జరగనుంది. అల్లు అర్జున్‌, స్నేహారెడ్డిల మధ్య ప్రేమ గురించి చిగురించి చాన్నాళ్ళే అయినా, పెద్దల అంగీకారం కోసం ఇన్నాళ్ళు పట్టింది. ఇరు కుటుంబాల మేరకు పెద్దలతో కుదిర్చిన సంబంధమే ఖారారైంది. మార్చి 6న హైద్రాబాద్‌లోని హైటెక్స్‌లో వివాహం. మార్చి 9న అల్లు అర్జున్‌ తండ్రి, అల్లు అరవింద్‌ సొంతూరు పాలకొల్లులో వెడ్డింగ్‌ రిసెష్షన్‌ జరగనుంది.