వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్
రెడ్డికి బెయిల్ మంజూరైంది. కంపెనీల విషయంలో ఎలాంటి క్విడ్ ప్రోకో జరగలేదని
సిబిఐ పేర్కొంది. జగన్ 485 రోజుల పాటు చంచల్ గూడ జైల్లో ఉన్నారు. సోమవారం
నాంపల్లి సిబిఐ కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. దీంతో జగన్ అభిమానులు
ఆనందోత్సాహాల్లో మునిగారు.