టాటీవుడ్‌లో పెళ్లి వయసు దాటిపోతున్న కూడా పెళ్లి చేసుకోకుండా ఉన్న హీరోల్లో గోపీచంద్ మొదటి స్థానంలో ఉంటాడు. అయితే ప్రస్తుతం కృష్ణవంశీ దర్శకత్తంలో తెరకెక్కుతున్న ' మొగుడు ' చిత్రంలో నటిస్తు, తాప్పీని తన భార్యగా ఊహించుకుంటున్న ఈ హీరో, తర్వలోనే నిజమైన పెళ్లి పీటలు ఎక్కనున్నాడు. ' లక్ష్యం' అనే చిత్రంలో గోపీచంద్, ప్రముఖ హీరో జగపతిబాబులు కలిసి అన్నదమ్ములుగా నటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రం ద్వారా వీరిద్దరి మధ్య ఉన్న స్నేహం మరింత బలపడింది. అయితే తాజాగా జగపతిబాబు, తన కూతురుని గోపిచంద్‌కు ఇచ్చి వివాహం చేయనున్నాడని తెలిసింది.
Tuesday, September 20, 2011
తండ్రి కాబోతున్న వరుడు
' వరుడు' చిత్రం తర్వాత నిజమైన వరుడుగా మారి, తన ప్రియురాలు స్నేహారెడ్డిని వివాహం చేసుకున్న స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ త్వరతలోనే తండ్రి కాబోతున్నట్లు సమాచారం. ఇటీవలే బన్నీ తన భూజానికి గాయం కోసం ఆస్ట్రేలియా వెళ్లిన విషయం తెలిసిందే. అయితే బన్నికి తన భార్య స్నేహ గర్భవతి అని విషయం తెలిసింది. ఈ విషయాన్ని వెంటనే తన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి తెలిపాడంట. అయితే ఈ విషయాన్ని బయట తెలియనివ్వకుండా చాలా జాగ్రత్త పడాలనుకున్పప్పటికి ఫలితం లేకుండా పోయింది. ఈ వార్త తెలియడంతో మెగా అభిమానుల్లో ఒక పండగ వాతావరణం నెలకొంది. ప్రసుత్తం స్నేహారెడ్డికి మూడో నెల అని తెలిసింది. స్నేహా తల్లి కాబోతున్న విషయం తెలుసుకున్న తరువాత నుంచి బన్ని స్నేహారెడ్డిని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాడంట. ఈ విషయం తెలిసిన బందువులు, ప్రెండ్స్ అందరూ కూడా బన్నికి శుబాకాంక్షలు తెలియజేస్తున్నారట.
Subscribe to:
Posts (Atom)