Friday, December 10, 2010

భారత్‌ 5-0 తేడాతో ఘన విజయం


భారత్‌ - న్యూజిలాండ్‌ మధ్య జరుగుతున్న ఐదో వన్డే మ్యాచ్‌లో భారత్‌ బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌ విభాగంగా రాణించి సిరీస్‌ కైవసం చేసుకుంది. టెస్టు మ్యాచ్‌లో 1-0 తేడాతో, వన్డేలో 5-0 తేడాతో భారత్‌ - న్యూజిలాండ్‌ పై రెండు విభాగాలుగా విజయం సాధించింది. ఆఖరి చివరి వన్డేలో న్యూజిలాండ్‌ 103 పరుగులకే అలౌట్‌ అయ్యింది. న్యూజిలాండ్‌ బ్యాటింగ్‌లో ఫ్రాంక్లింగ్‌ 24 పరుగులు చేసి టాప్‌ స్కోర్‌గా నిలిచాడు. మిగితా బ్యాట్స్‌మైన్‌లు అంతగా రాణించలేకపోయారు. భారత్‌ బౌలింగ్‌లో ఆశ్విన్‌ 3 మూడు వికెట్లు తీసుకోగా యువరాజ్‌, యుసుఫ్‌ పఠాన్‌, నెహ్రా తలో రెండు వికెట్లు తీసుకున్నారు. ప్రవీణ్‌ కుమార్‌ ఒక వికెటు తీసుకున్నారు. 104 పరుగుల లక్ష్యంతో భ్యాటింగ్‌ దిగిన భారత్‌ 10 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది.ే గంభీర్‌ 0, విరాట్‌ కోహ్లీ 2 పరుగులకే అవుట్‌ అయ్యారు. ఓపెనరుగా వచ్చిన పార్థీవ్‌ పటేల్‌ అర్థ సెంచరీ చేశాడు. (56) పార్థీవ్‌ పటేల్‌ అండగా యువరాజ్‌ సింగ్‌ 42 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.