టీమిండియా వన్డే వరల్డ్ కప్ హీరో, ప్లే బాయ్ యువరాజ్ సింగ్ త్వరలో
పెళ్లికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల యువరాజ్ పెళ్లి కొడుకు
కాబోతున్నాడన్నవార్తలకు దాదాపు ఫుల్ స్టాప్ పడినట్లే కనబడుతోంది. దీపావళి
రోజున యువీ వివాహ శుభవార్త చెబుతాడని అభిమానులు ఎదురు చూపులు నిజం
కాబోతున్నాయి. గత కొంతకాలంగా బ్రిటీష్ నటి హాజల్ కీచ్ తో ప్రేమాయణ సాగిస్తున్నయువీ..
ఆమెతో నిశ్చితార్థం చేసుకున్నట్లు సమాచారం. వీరద్దిరి నిశ్చితార్థం బాలిలో
జరిగినట్లు తెలుస్తోంది. ఈ మేరకు వారి ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు
కొడుతున్నాయి. హజల్ ఓ ఉంగరంతో దర్శనమివ్వడం కూడా దీనికి మరింత బలం
చేకూరుస్తోంది.