Sunday, March 4, 2012

11న రచ్చ ఆడియో


మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ హీరోగా ఎన్నో సూపర్‌డూపర్‌ హిట్‌ చిత్రాల్ని అందించిన మెగా సూపర్‌గుడ్‌ ఫిలింస్‌ ప్రై.లిమిటెడ్‌ సంస్థ లేటెస్ట్‌గా ‘రచ్చ’ నిర్మిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. సుప్రసిద్ధ నిర్మాత ఆర్‌.బి.చౌదరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి పారస్‌జైన్‌, ఎన్‌.వి.ప్రసాద్‌లు నిర్మాతలు. కాగా ‘రచ్చ’ ఆడియో వివరాలను చిత్ర నిర్మాతలలో ఒకరైన ఎస్‌.వి.ప్రసాద్‌ చెబుతూ ‘రామ్‌చరణ్‌ హీరోగా నటిస్తున్న రచ్చ చిత్రం ఆడియోను చలన చిత్ర ప్రముఖుల సమక్షంలో 11వ తేదీన హైదరాబాద్‌లోని పీపుల్స్‌ ప్లాజాలో విడుదల చేస్తు న్నాం. ఈ చిత్రాన్ని సమ్మర్‌ కానుకగా విడుదల చేస్తున్నాం’ అన్నారు. మణిశర్మ సంగీత దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం సంపత్‌నంది.