తెలుగు సినిమా పరిశ్రమలో మల్టీస్టారర్ చిత్రాల హవా మొదలైనట్లు కనిపిస్తోంది. ' సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్లు' చిత్రంలో వెంకటేష్, మహేష్‌బాబు నటిస్తుండగా రామ్‌చరణ్ హీరోగా నిర్మిస్తున్న ' ఎవడు ' చిత్రంలో అల్లు అర్జున్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నా విషయం తెలిసిందే. వెంకటేష్ కథానాయకుడుగా మెహర్ రమేష్ దర్శకత్వంలో యునైటెడ్ మూవీస్ పతాకంపై పరుచూరి కిరీటి ఓ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ చిత్రంలో ఓ ప్రధాన పాత్రలో నటించడానికి జగపతిబాబు అంగీకరించనట్లు సమాచారం. జనవరిలో ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది. గతంలో ' హనుమాన్ జంక్షన్ ' , మనసులో మాట ' లాంటి మల్టీస్టారర్ చిత్రాల్లో జగపతిబాబు నటించారు.