‘బాహుబలి’ ప్రపంచవ్యాప్తంగా
సృష్టించిన అద్భుతం ఇంకా కళ్లముందు కదులుతూనే ఉంది. ఇప్పుడు అందరి
దృష్టీ ‘బాహుబలి 2’పైనే. ‘బాహుబలి - ది కన్‌క్లూజన్’ ఎప్పుడొస్తుందో అని
ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ విషయంపై రాజమౌళి కూడా ఓ క్లారిటీ ఇచ్చేశారు.
‘‘అనుకొన్నది అనుకొన్నట్టు జరిగితే ఈ యేడాది చివర్లో బాహుబలి 2ని విడుదల చేసేస్తాం..’’
అంటూ ఓ శుభవార్త చెవిన వేశారు. ‘‘ప్రస్తుతం 40 శాతం చిత్రీకరణ పూర్తయింది.
ఈ యేడాదే విడుదల చేయాలనుకొంటున్నాం. అంతగా కుదరకపోతే... వచ్చే
యేడాది ప్రధమార్థంలో తీసుకొస్తాం’’ అంటున్నారు జక్కన్న. ‘బాహుబలి’ ప్రభంజనాన్ని
ఇంకా కొనసాగించాలన్నది రాజమౌళి ఆలోచన. అంటే... బాహుబలి 2నే కాదు, 3,4లను
కూడా చూడొచ్చు.