Sunday, February 6, 2011

ఉపేంద్ర సినిమా ఆడియో విడుదల

 ఉపేంద్ర కథానాయకుడిగా నయనతార కథానాయికగా ఉపేంద్ర స్వియ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ఆడియో మార్కెట్‌లోకి విడుదలైంది. సినిమాకు ఎలాంటి పేరు పెట్టకుండా కేవలం సూపర్‌ అనే చేతి గుర్తును మాత్రమే పెట్టారు. ఆడియో విడుదల కార్యక్రమం ప్రసాద్‌ల్యాబ్స్‌లో జరిగింది. ఆడియో తొలిప్రతిని త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ విడుదల చేసి, సురేష్‌బాబుకు అందజేశారు. ఈ సందర్భంగా రచయిత వెన్నలకంటి మాట్లాడుతూ...'ఉపేంద్ర అనగానే వైవిధ్యమైన, ప్రయోగాత్మక చిత్రంగా చెప్పక్కర్లేదు. చాలా ఉద్వేగమైన కథనంతో తెరపైకి రావటం ఆయన శైలి. సినిమాకు పేరు పెట్టకుండా ఒక భంగిమ పెట్టారు. ఎవరికి ఎలా అర్థమయితే అలా అన్వయించుకోవచ్చు. ఇదో అద్భుత ప్రయోగం. భారతదేశ ఔన్నత్యాన్ని కథలో చూపారు. పాటలు ఇష్టపడి రాశాను. హరికృష్ణ మంచి సంగీతాన్ని అందించారు. తెలుగులోనూ విజయవంతమవ్వాలని ఆశిస్తున్నా'నని అన్నారు.
ఆలీ మాట్లాడుతూ...'సినిమా సింబల్‌ చూస్తే అదిరింది. సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ఈయన సినిమాలో నటించాలనుకున్నారు. అంతగా ఆయనకి నచ్చింది. కర్నాటకలో రూ.15 కోట్లు వసూళ్లు చేసింది' అని అన్నారు.
నిర్మాత రాక్‌లైన్‌ వెంకటేష్‌ మాట్లాడుతూ...'గతంలో మజా అనే సినిమా తీశాను. మా బ్యానర్‌లో ఇది 25వ సినిమా. ఉపేంద్ర సినిమాను మూడు భాషల్లో ప్లాన్‌ చేశాం. కన్నడలో 75 రోజులుగా ఆడుతోంది. అక్కడ సూపర్‌ అనే టాక్‌ వచ్చింది. తెలుగువారి స్పందన ఎలా ఉంటుందో చూడాలి' అని అన్నారు.
నిర్మాత డి.సురేషబాబు మాట్లాడుతూ...'రాక్‌లైన్‌ వెంకటేష్‌ మంచి మిత్రుడు. మంచి క్రియేటివిటీతో రూపొందిన చిత్రం. ఉపేంద్ర నిజంగానే సూపర్‌ హీరో కాబట్టి ఆ పేరు సరైందే. ఒక సినిమాకు టైటిల్‌ లేకుండా విడుదల చేసి, విజయవంతమవటం గొప్ప విషయం' అని తెలిపారు.
ఉపేంద్ర మాట్లాడుతూ...'అక్కడ సూపర్‌ అన్నారు. ఒక్కొక్కరు ఒక్కోవిధంగా దీన్ని నిర్వచించుకోవచ్చు. వైవిధ్యమైన చిత్రం చేయడానికి చాలా సంవత్సరాలు పట్టింది. ఇందులో విభిన్నమైన గెటప్స్‌ ఉంటాయి. సినిమా చూసి రజనీకాంత్‌ చాలా ఆనందపడ్డారు. కన్నడలో ఇది పెద్ద బడ్జెట్‌ చిత్రం. తెలుగులో మళ్లీ సినిమాలు చేసే అవకాశం వస్తుందని నమ్ముతున్నా'నని అన్నారు.

ప్రపంచకప్‌ ముందు ఫ్రాక్టిస్‌ మ్యాచ్‌లు ....

ఆస్ట్రేలియా , ఇంగ్లాండ్‌ పై 6-1 తేడాతో ఘన విజయం సాధించింది.
దక్షిణాఫ్రికా , భారత్‌ పై 3-2 తేడాతో సిరీస్‌ కైవసం చేసుకఁంది.
పాకిస్థాన్‌ , న్యూజిలాండ్‌ పై 3-2 తేడాతో ఘన విజయం సాధించింది.
శ్రీలంక , వెస్టిండిస్‌ పై 2-1 తేడాతో విజయం సాధించింది.
 

ఆస్ట్రేలియా - ఇంగ్లాండ్‌ ...
  ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌ మధ్య జరుగుతున్న ఏడు వన్డే సిరీస్‌లో ఆస్ట్రేలియా 6-1 తేడాతో ఘన విజయం సాధించింది. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌ మాధ్య ఫోరు యాషేష్‌ సిరీస్‌తో మొదలు అయ్యింది. అక్కడ ఆరంభమ అయిన టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ 1-0 తేడాతో ఘన విజయం సాధించింది. ఇంకా మిగిలిది వన్డే మ్యాచ్‌లు అన్న రితీలో ఇంగ్లాండ్‌ తేలికగా తీసుకు ంది. వన్డేలో మాత్రం ఆస్ట్రేలియా రెచ్చిపోయి ఏకంగా 6-1 తేడాతో ఘన విజయం సాధించింది. ఇంగ్లాండ్‌కు కోలుకొని దెబ్బతీసింది. టెస్టులో గెలిచిన అనందం వన్డేలో మాత్రం లేదు. వన్డేలో ఏకంగా ఫామ్‌ కోల్పోయిన్నాము. ఆస్ట్రేలియాలో షేన్‌ వాట్సన్‌ , వైట్‌ , మార్ష్‌ , హాస్సీ , క్లార్క్‌ అందరు ఫామ్‌లో రావడంతో ఆస్ట్రేలియా వన్డే మ్యాచ్‌లో ఘన విజయం సాధించింది.
                                 దక్షిణాఫ్రికా - భారత్‌ ...

 భారత్‌ - దక్షిణాఫ్రికా మధ్య జరిగినా ఐదు వన్డే సిరీస్‌ మ్యాచ్‌లో సౌతాఫ్రికా 3-2 తేడాతో ఘన విజయం సాధించింది. మహేద్రసింగ్‌ ధోని సౌతాఫ్రికా మ్యాచ్‌లో టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న సందేహం ఇదే అతను చేసిన తప్పు. బౌలింగ్‌, బదులుగా బ్యాటింగ్‌ ఎందుకు తీసుకోవడం లేదు. 
ఇరు జట్లు 2-2 సమానంగా ఉన్నాయి. భారత్‌ టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్నంది. 50 ఓవర్లలో 250 పరుగులు చేసింది. ఆమ్లా అద్భుతంగా సెంచరీ చేయడంతో ఆ జట్టు 250 పరుగులు చేయగలిగింది. అనంతరం బ్యాటింగ్‌ దిగిన బారత్‌ కళ్లు మూసి కళ్లు తెరిచే సరికి 5 వికెట్లు కోల్పోయింది. ఇంకా అశ నిరాశగా మిగిలింది. ఏమి చేయలేని పరిస్థితి వచ్చింది. అప్పటికి చిగురిప ఆశ ఒక్కటే... రైనా , యూసుఫ్‌ పఠాన్‌ ఇద్దరు ఉన్నారు. ఒక్క సారిగా రైనా ఆవుట్‌ అన్నారు. ఏమి చేయలేము విజయం సౌతాఫ్రికాదే అనుకున్నము యూసుఫ్‌ పఠాన్‌ క్రీజులో ఉన్నాడు. అతనికి తోడు హర్భజన్‌ సింగ్‌ ఉన్నాడు. కొద్ది సేపు తరువాత హర్భజన్‌ సింగ్‌ కూడా పెవిలియమ్‌ చేరుకఁన్నాడు. 98/7 ఇంకా మూడు వికెట్లు ఉన్నాయి. యూసుఫ్‌ పఠాన్‌ ఒక్కసారిగా రెచ్చిపోయి 70 బంతులలో ఎనిమిది సిక్స్‌లు, ఎనిమిది ఫోర్లు చేసి చివరికి మోర్కెల్‌ బౌలింగ్‌లో అవుట్‌ అయ్యాడు. చివరికి జహీర్‌ఖాన్‌ పోరాటం చేసినా విజయం మాత్రము సౌతాఫ్రికా సొంతం అయ్యింది. టెస్టు సిరీస్‌లో 1-1 తేడా సమానంగా నిలిచింది.
పాక్‌ - న్యూజిలండ్‌ ....

 ఇటు టెస్టులో అటు వన్డేలో కూడ రెండు ఫార్మట్‌లో పైచెయి సాధించి విజయపై ధీమా వ్యక్తం చేసింది పాక్‌.
పాకిస్థాన్‌ - న్యూజిలాండ్‌ మద్య జరిగిన టెస్టు మ్యాచ్‌లో పాకిస్థాన్‌ 1-0 తేడాతో విజయం సాధించింది. వన్డేలో కూడా 3-2 తేడాతో ఘనవిజయం సాధించింది. పాకిస్థాన్‌ ఇట్టు టెస్టులో అటు వన్డేలో రెండు ఫార్మట్‌లో పైచెయి సాధించింది. న్యూజిలాండ్‌ వరుస ఘోర పరాజయతో చవి చూస్తుంది. భారత్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో మాత్రం 0-5 తేడాతో ఓడిపోయింది. పాకిస్థాన్‌ క్రికెట్‌ర్లకు
స్పాట్‌ఫిక్సింగ్‌ ముగ్గురు పాల్పడ్డారు. సల్మాన్‌ భట్‌, మహ్మద్‌ ఆసీఫ్‌, మహ్మద్‌ ఆమీర్‌ వీరు ముగ్గురు స్పాట్‌ఫిక్సింగ్‌కు పాల్పడ్డారు. సల్మాన్‌ భట్‌, పదేళ్ల పాటు నిషేదించారు. మహ్మద్‌ ఆసీఫ్‌కు ఏడేళ్ల సస్పెన్షన్‌ విధించారు. మహ్మద్‌ ఆమీర్‌కు ఐదు సంత్సరాల పాటు నిషేదం విధించారు.
శ్రీలంక - వెస్టిండీస్‌ ...
వెస్టిండీస్‌- శ్రీలంక మద్య జరుగుతున్న మూడు వన్డే సిరీస్‌లో ఇప్పటికే 2-0 తేడాతో శ్రీలంక ఘన విజయం సాధించింది. క్రిస్‌ గేల్‌ ఫామ్‌లో లేకపోవడంతో అందోళన చేదుతుంది.

రెండు ఫార్మట్‌లో పాక్‌ పైచేయి

 వరల్డ్‌కప్‌ ముందు న్యూజిలాండ్‌కు చివరివన్డేలో విజయం లభించింది. పాకిస్థాన్‌, న్యూజిలాండ్‌ మధ్య జరుగుతున్న ఆరు వన్డేలలో పాక్‌ 3-2 తేడాతో విజయం సాధించింది. రెండో వన్డే వర్షం కారణంగా రద్దు అయ్యింది. ప్రపంచకప్‌ ముందు విజయం సాధించింనందుకు పాక్‌ జట్టు అత్మవిశ్వాసం పెంచుతుందనడంలో సందేహం లేదు. టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న న్యూజిలాండ్‌ 50 ఓవర్లలో 311 పరుగుల చేసింది. రైడర్‌ అద్బుతంగా సెంచరీ చేశాడు. 312 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్‌ 254 పరుగుల చేసి అలౌట్‌ అయ్యింది. కమ్రాన్‌ అక్మల్‌ 89 , అఫ్రీద్‌ 44 పరుగులు చేశారు. మిగితా బ్యాట్‌మైన్‌లు ఏఒక్కరు రాణించలేకపోయారు. రైడర్‌ మ్యాన్‌ ఆప్‌ ద మ్యాచ్‌ లభించింది. టెస్టు మ్యాచ్‌లో 1-0 తేడాతో వన్డేలో 3-2 తేడాతో పాక్‌ ఘన విజయం సాధించింది. ప్రపంచకప్‌ ముందు ఇది ఒక సవాల్‌గా తీసుకుది. ప్రపంచకప్‌లో పాక్‌ కెప్టెన్‌గా షాహిద్‌ అఫ్రిద్‌ ఎంపికయ్యాడు.