బాలీవుడ్ డైరక్టర్ యశ్‌చోప్రా (80)
కన్నుమూశారు. డెంగ్యూ జ్వరంతో లీలావతి ఆస్పత్రిలో గత వారం రోజులుగా చికిత్స
పొందుతూ ఈ సాయంత్రం మృతి చెందారు. యాశ్‌చోప్రా 1932 సంవత్సరంలో లాహోర్‌లో
జన్మించారు. 1973లో యశ్‌రాజ్ ఫిల్మ్ సంస్థను స్థాపించారు. ఈ సంస్థ
ఆధ్వర్యంలోనే దాదాపు 50 చిత్రాలకు దర్శకత్వం వహించారు. 2001 సంవత్సరంలో
దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్నారు. 2005లో భారత ప్రభుత్వం చలన చిత్ర
రంగానికి చేసిన సేవకు గుర్తింపుగా చోప్రాను పద్మభూషణ్ అవార్డుతో
సత్కరించింది.