‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్
సంస్థ 150 కోట్ల భారీ బడ్జెట్‌తో సినిమా నిర్మించనున్న సంగతి తెలిసిందే.
ఇది భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ. యాక్షన్ సీక్వెన్స్ ఓ రేంజ్‌లో ఉంటాయట.
విశేషం ఏంటంటే... 150 కోట్లలో 30 కోట్లను గాల్లో తీయబోయే ఫైట్‌కి ఖర్చు
పెట్టనున్నారట.
హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్లతో దుబాయ్‌లో ఈ స్కై ఫైట్‌ను చిత్రీకరించనున్నారని సమాచారం. ఈ రిస్కీ ఫైట్స్ సినిమాకి అదనపు ఆకర్షణగా నిలుస్తాయని తెలుస్తోంది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌తో యాక్షన్ థ్రిల్లర్‌గా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ సినిమా తెరకెక్కనుంది. ‘రన్ రాజా రన్’తో దర్శకుడిగా పరిచయమైన సుజీత్, ఆ సినిమా తర్వాత రెండేళ్ల నుంచి ఈ సినిమా స్క్రిప్ట్‌పైనే వర్క్ చేస్తున్నారు.
త్వరలో హీరోయిన్, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపికపై దృష్టి సారించనున్నారు. ‘బాహుబలి: ద కంక్లూజన్’ షూటింగ్ డిసెంబర్‌కి పూర్తి కానుంది. ఆ తర్వాత సుజీత్ సినిమా ప్రారంభమవుతుందని చిత్రబృందం చెబుతోంది.