Friday, December 23, 2011

సిక్స్‌ప్యాక్‌తో అదరగొడుతున్న సునీల్‌


బిజినెస్‌ మేన్‌ ఆడియో విడుదల మూడు బాషల్లో

మహేష్‌బాబు, కాజల్‌ అగర్వాల్‌ జంటగా ఆర్‌.ఆర్‌. మూవీ మేకర్స్‌ పతాకంపై వెంకట్‌ నిర్మిస్తున్న ' బిజినెస్‌ మేన్‌' ఆడియో వేడుక హైదరాబాదులో జరిగింది. మూడు బాషల్లో ఆడియోను విడుదల చేశారు. తమిళ వర్షన్‌ ఆడియోను కృష్ణ, విజయనిర్మల ఆవిష్కరించారు. మలయాళం ఆడియోను డి. రామానాయుడు, రాజమౌళి విడుదల చేయగా, తెలుగు వెర్షన్‌ పాటలను మహేష్‌, శ్రీను వైట్ల ఆవిష్కరించారు.

2011తెలుగు సినిమా పరిశ్రమలో వివాదాలు ...

టాలీవుడ్‌ వివాదాపై ఓసారి లుక్కేద్దాం. రామ్‌ గోపాల్‌ వర్మ తీసిన రక్త చరిత్ర సినిమా తెలుగు సినిమా పరిశ్రమలో ఓసంచలనం సృష్టించింది. సీమ ఫ్యాక్షన్‌ గొడవల యదార్ధ ఘటనల ఆధారంగా రూపొందిన ఈ సినిమాలో..నిజ జీవితంలో వ్యక్తులమధ్య జరిగిన రియల్‌ ఇన్సిడెంట్‌ను సినిమా రూపంలో తెరకెక్కించారు. ఈ సినిమా విడుదలై కొన్ని రోజులకే సూరి హైదరాబాద్‌ నడి ఒడ్డున జనవరి 3న హత్యకు గురయ్యాడు. ఆ తర్వాత చెప్పకోదగ్గది టాలీవుడ్‌ డ్రగ్‌ రాకెట్‌! పలువురు నిర్మాతలకు, నటులకు మాదక ద్రవ్యాల కేసులో సంబంధం ఉన్నట్లు పోలీసులు గుర్తించడమే కాదు, పలువురిని రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు కూడా. రవితేజ సోదరుడు రఘుబాబు, భరత్‌ డ్రగ్స్‌ కొంటూ పట్టబడగా, ఇద్దరు నిర్మాతలు డ్రగ్స్‌ అమ్ముతూ పట్టబడ్డారు.
నటి జీవిత సోదరుడు కూడా ఈకేసులో పోలీసులకు చిక్కాడు. ఇక హీరో వరుణ్‌ సందే్‌శకు డ్రగ్స్‌ కేసులో సంబంధం ఉన్నట్లు వచ్చిన వార్తలు సర్వత్రా చర్చనీయాంశం అయింది.మగధీర చిత్రం ద్వారా టాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్‌ గా ఎదిగిన కాజల్‌ అగర్వాల్‌ ఎఫ్‌ హెచ్‌ఎం పురుషుల మ్యాగజైన్‌ పై టాప్‌లెస్‌ గా దర్శనం ఇచ్చింది. కాజల్‌ చర్యపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. అయితే కాజల్‌ మాత్రం అది నాఫోటోకాదు మార్ఫింగ్‌ అంటూ ఓ ప్రకటన చేసి ఈ వ్యవహారం నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసింది.
ఇక... వాన, బంగారం చిత్రాల్లో హీరోయిన్‌ గా నటించిన మీరా చోప్రా హత్య కేసులో ఇరుక్కుంది ఇటీవల మరణించిన ప్రముఖ నిర్మాత, రచయిత ఎంఎస్‌ రెడ్డి రాసిన తన ఆత్మకథ పుస్త్తకం ాఇది నా కథ్ణ... ఈ పుస్త్తకంలో సీనియర్‌ ఎన్టీఆర్‌ నుంచి జూనియర్‌ ఎన్టీఆర్‌, చిరంజీవి, గుణశేఖర్‌, రాజశేఖర్‌ తదితరుల మీద ఆయన రాసిన ఆరోపణలు చర్చనీయాంశమయ్యాయి. ఆ మధ్య రామ్‌చరణ్‌ తేజ్‌ దాసరిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కూడా కలకలం సృష్టించాయి.
నిర్మాతలకు, కార్మికులకు మధ్య ఏర్పడ్డ విబేధాలతో కొంత కాలం సినిమా షూటింగులు ఆగిపోయాయి. తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో పలు సినిమా షూటింగులపై దాడులు జరిగాయి. ఎన్నడూలేని విధంగా ఈ సంవత్సరం నందమూరి, మెగా కుటుంబ హీరోల అభిమానుల వివాదాలు రచ్చకెక్కాయి. రామ్‌చరణ్‌, మహేష్‌బాబుల సినిమాల రికార్డుల విషయంలో కూడా రచ్చజరిగాయి.హీరో నాగార్జున తన పట్ల అమానుషంగా ప్రవర్తించాడని ఓ మహిళా జర్నలిస్ట్‌ కోర్టులో పిటీషన్‌ దాఖలు చేయగా వివరణ ఇమ్మంటూ నాగార్జునకు కోర్టు కోరింది.