Monday, January 30, 2012

పవన్ సరసన్ కాజల్?


DSC55 talangana patrika telangana culture telangana politics telangana cinema‘బిజినెస్‌మేన్’ సక్సెస్‌తో మేఘాల్లో తేలిపోతోంది ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్. గ్లామర్‌తో పాటు చక్కటి అభినయం కలబోసిన పాత్రకు ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు లభిస్తున్నాయని మురిసిపోతోంది ఈ వయ్యారి. అయితే యాక్షన్ సినిమాల కంటే తనకు స్వతహాగా కామెడీ సినిమాలంటే ఇష్టమని, ఫుల్‌పూంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా నటించాలన్నది తన చిరకాల కోరికని సెలవిస్తోంది కాజల్ అగర్వాల్. ‘చిన్నప్పటి నుంచి యాక్షన్ సినిమాలంటే అస్సలు ఇష్టం వుండదు. అంతేందుకు టీవీ చూస్తున్నప్పుడు కూడా యాక్షన్ ఎపిసోడ్స్ వస్తే వెంటనే ఛానల్ మార్చేస్తా. అయితే సినిమాల్లోకి వచ్చాక యాక్షన్ సినిమాలకు తప్పనిసరిగా అలవాటు పడిపోవాల్సి వచ్చింది.
రాబోయే రోజుల్లో కామెడీ సినిమాలపై దృష్టిపెట్టాలనుకుంటున్నాను. హాస్యరస పాత్రల్లో నటించి మెప్పించడం అంత సులువు కాదు..ఎవరికైనా అది పెద్ద ఛాలెంజ్ లాంటిది. ఒకవేళ అలాంటి అవకాశం వస్తే నా సత్తా ఏంటో చూపించడానికి సిద్ధంగా వున్నాను’ అని చెప్పుకొచ్చింది కాజల్ అగర్వాల్. తాజా సమాచారం ప్రకారం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పవన్‌కల్యాణ్ నటించే చిత్రంలో ఈ సుందరిని కథానాయికగా ఎంపికచేయనున్నట్లు తెలుస్తోంది. దాదాపు పన్నెండేళ్ల తర్వాత పూరి-పవన్ కలయికలో వస్తోన్న ఈ చిత్రం మేలో సెట్స్‌పైకి వెళ్లనుంది. తొలుత ఈ చిత్రానికి బాలీవుడ్ భామను కథానాయికగా అనుకున్నా ‘బిజినెస్‌మేన్’ సక్సెస్‌తో పూరి చేత లక్కీగాళ్ అనిపించుకున్న ఈ భామనే హీరోయిన్‌గా ఓకే చేయనున్నట్లు సమాచారం.