Friday, January 1, 2016

సినిమాల నుంచి తప్పుకోవాల్సి వస్తే..

 చిత్రపరిశ్రమ నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి వస్తే.. అంటున్న సమంత తన మనోభావాల్ని మీడియాతో పంచుకున్నారు. సంమంత క్రేజీ హీరోయిన్ అన్న విషయాన్ని చెప్పనక్కర్లేదు. తమిళ, తెలుగు భాషల్లో ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో అరడజను చిత్రాలున్నాయి. అవన్నీ ప్రముఖ హీరోల సరసన నటిస్తున్న చిత్రాలే కావడం గమనార్హం.
ఈ చెన్నై చిన్నది ఇంత బిజీగా ఉన్నా ఇంకో పక్క సమాజ సేవ చేయడం తన సేవాతత్వానికి నిదర్శనంగా చెప్పవచ్చు. దీనిపై ఆమె మాట్లాడుతూ.. ‘నేను నటిగా మంచి పేరు సంపాదించుకున్నాను. సినిమాల్లో నటిస్తూనే సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నాను. అందువల్ల నాకు విశ్రాంతి లేకుండా పోయింది. ఈ రెండింటినీ ఏక కాలంలో ఎలా చేయగలుగుతున్నారు? శ్రమ అనిపించడం లేదా? అని పలువురు అడుగుతున్నారు. నిజం చెప్పాలంటే పని లేకుంటేనే నాకు ఏమీ తోయదు.
లోకంలో నాకంటే అందగత్తెలు చాలా మంది ఉన్నారు. నా కంటే ప్రతిభావంతురాళ్లు ఎందరో ఉన్నారు. వాళ్లందరి మధ్యలో భగవంతుడు నాకు హీరోయిన్ స్టేటస్ ఇచ్చాడు. కాబట్టి నటనను నేను ప్రాణంగా భావిస్తున్నాను. సినిమాపై నా ప్రేమకు ఎల్లలే లేవు. ఎప్పుడూ షూటింగ్ స్పాట్‌లోనే ఉండాలనిపిస్తోంది. ఇంటికి వెళ్లడానికి కూడా ఇష్టం ఉండటం లేదు.
షూటింగ్‌ల తోనే సంతోషం కలుగుతోంది. సినిమానే నా జీవితంగా మారిపోయింది. ప్రతిభ, పేరు, డబ్బు, హోదా అన్నీ భగవంతుడు నాకు స్థాయికి మించి ఇచ్చాడు. ఆ కృతజ్ఞతతోనే పేదలకు సాయం చేస్తున్నాను. నాకు సినీ అవకాశాలు తగ్గితే, చిత్రపరిశ్రమ నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడితే నా పూర్తి జీవితాన్ని సమాజసేవకు అంకితం చేస్తాను.’ అని చెప్పారు.

నేను శైలజ సినిమా రివ్యూ

క‌థేంటి?
 హరి(రామ్)కి ప్రేమ పిచ్చి. చిన్న‌ప్ప‌టి నుంచీ ప్రేమ‌లో ప‌డ‌డం.. విఫ‌ల‌మ‌వ్వ‌డం హ‌రికి అల‌వాటు.
 

 శైలు (కీర్తి సురేష్‌)ని కూడా అలానే ప్రేమిస్తాడు. కానీ.. హరి కుటుంబం అంతా వైజాగ్ కి బ‌దిలీ అవ్వ‌డం వ‌ల్ల‌... శైలుకి దూరం అవ్వాల్సి వ‌స్తుంది. హ‌రి పెరిగి పెద్ద‌వాడైనా ప్రేమ‌క‌థ‌ల్లో ఎలాంటి మార్పు లేదు. ప్రేమించిన ప్ర‌తి అమ్మాయి త‌న‌కు దూరం అవ్వ‌డం చూసి... ఇక ప్రేమ జోలికి వెళ్లొద్ద‌నుకొంటాడు. కానీ.. త‌న జీవితంలోకి శైలు మ‌ళ్లీ వ‌స్తుంది. ఈసారి శైలును మ‌రింత సిన్సియ‌ర్‌గా ప్రేమిస్తాడు.కానీ.. శైలు మాత్రం హ‌రి ప్రేమ‌కు `నో` చెప్తుంది. దానికి కార‌ణం ఏమిటి?  శైలు ప్రేమ‌ని హ‌రి ఎలా పొందాడు? అన్న‌దే మిగిలిన క‌థ‌.....