Tuesday, March 15, 2016

అమితాబ్‌, రజనీల షికార్లు!

 తారల పాట్లు తారలవి. సరదాగా ఏ రోడ్డు మీదనో షికారుగా నడవాలంటే కుదరదు. అభిమానులు గుర్తుపట్టి మూగిపోతారు. అయినా అప్పుడప్పుడు ఏ మారువేషంలోనే సరదాలు తీర్చుకుంటారు. అలాగే చేశారు అమితాబ్‌ బచ్చన్‌.
నిర్మాత సూజిత్‌ సర్కార్‌ అమితాబ్‌ బచన్‌తో ుఆగ్రా కా దాబ్రా’ సినిమా తీస్తున్నారు. దిల్లీ నేపథ్యంలో సాగే ఈ సినిమా అనిరుద్ద రాయ్‌ చౌదరి దర్శకత్వంలో రూపు దిద్దుకుంటోంది. సినిమా షూటింగు కోసం దిల్లీ వెళ్లిన అమితాబ్‌ ఒక ఖాకీ ప్యాంటు, బాగా వదులుగా వుండే చొక్కా ధరించి ముఖాన్ని కవర్‌ చేసే టోపీ ధరించి క్రిక్కిరిసి వుండే దిల్లీ ప్రధాన వీధిలో ఒంటరిగా నడుచుకుంటూ వెళ్లారు. అయితే ఎవరూ ఆయనను గుర్తుపట్టలేదు. ునాకు తోడుగా ఒక వీధి కుక్క మాత్రం నడిచింద’ని అమితాబ్‌ ట్వీట్‌ చేసారు.

 తనను గుర్తుపట్టని విధంగా మేకప్‌ చేసిన వ్యక్తిని అభినందించుకుంటూ తాను బాలీవుడ్‌కు రాకముందు తిరిగిన వీధిని చుట్టబెట్టేశారు. అమితాబ్‌ లాగే మరో సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ కూడా బెంగళూరులో తన స్నేహితుల్ని, తను నిత్యం ఆరాధించే దేవాలయాన్ని చూడాలనిపిస్తే మారువేషంలో వెళుతుంటారు. ుుఈ స్టార్‌ డమ్‌ రావడం వల్ల కానీ, లేకపోతేనా... బెంగళూరు వీధుల్లో డ్యాన్స్‌ చేస్తూ తిరిగేవాడిని’’ అంటూ చెబుతుంటారు రజనీకాంత్‌.

No comments:

Post a Comment