Thursday, March 17, 2011

ఒక్కే ఒక్క చాన్స్‌ .....

 భారత జట్టు పేస్‌ బౌలింగ్‌లో జహీర్‌ ఖాన్‌, మునాఫ్‌ పటేల్‌, నెహ్రా ముగ్గురు ఉన్నారు. కానీ వీళ్లలో జహీర్‌ ఖాన్‌ ఒక్కడే పొదుపుగా బౌలింగ్‌ చేయ్యగలుగుతున్నాడు. మునాఫ్‌ పటేల్‌ , నెహ్రా ఇద్దరు విపరితంగా పరుగులు ఇస్తున్నారు. వికెట్లు తీయడంలో విఫలమవుతున్నారు. అంతక ముందు పపంచకప్‌లో ప్రవీణ్‌ కుమార్‌ ఎంపిక చేశారు. అతని మోచేతి గాయం ఇంకా తగ్గకపోవడంతో బీసీసీఐ అతన్ని ఆడించకూడదని నిర్ణయం తీసుకుంది. అతని స్థానంలో శ్రీశాంత్‌ ఎంపిక చేశారు. అతను కూడా వికెట్లు తీయడంలో విఫలమవుతున్నాడు. భారత జట్టులో మునాఫ్‌ పఠాన్‌, నెహ్రా,శ్రీశాంత్‌ పేస్‌ బౌలింగ్‌ ఉన్నారు.
ఒక్కే ఒక్క ఛాన్స్‌ ....
ఒక్కే ఒక్క ఛాన్స్‌ అంటున్నా ఇర్ఫాన్‌ పఠాన్‌. మరి ఇర్పాన్‌ పఠాన్‌ ఎంపిక విషయంలో చర్చలు జరగలేదు ఎందుకని. అతను అటు బ్యాటింగ్‌లో ఇటు బౌలింగ్‌ జట్టు సహయంపడుతాడు. అతని బీసీసీఐ ఎందుకు అతని వైపు మెగ్గు చూపడం లేదు.

క్రికెట్‌కు అక్తర్‌ గుడ్‌బై

 వన్డే ప్రపంచ కప్‌ పోటీల అనంతరం అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి రిటైర్‌ అవుతున్నట్లు పాకిస్థాన్‌ స్పీడ్‌ బౌలర్‌, రావల్పిండి ఎక్స్‌ప్రెస్‌ షోయబ్‌ అక్తర్‌ చెప్పాడు. ఈ ఉదయం ప్రేమదాస స్టేడియంలో సహచరులనుద్దేశించి తన నిర్ణయాన్ని తెలిపాడు. ఇదే తన వీడ్కోలు మాటలుగా ఉద్వేగపూరితంగా చెప్పాడు. 35 ఏళ్ల అక్తర్‌ పాకిస్థాన్‌లో టీంలో ఎన్నో వివాదాలను కేంద్ర బిందువుగా ఉన్నాడు. బౌలింగ్‌ యాక్షన్‌పై కూడా ఎన్నో ఆరోపణలు ఎదురయ్యాయి. అందుకే పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డుతో సత్సంబంధాలు లేవు. తాజాగా ప్రపంచ కప్‌లో జింబాబ్వేతో అతన్ని మేనేజ్‌మెంట్‌ ఆడనివ్వలేదు. 1997లో వెస్టిండీస్‌ జరిగిన పోరులో క్రికెట్‌లోకి అక్తర్‌ ప్రవేశించారు. 46 టెస్ట్‌ మ్యాచ్‌ల్లో 178, 63 వన్డే 247 వికెట్లు తీసాడు.