Monday, November 15, 2010

న్యూజిలండ్‌ స్కోరు 273/4


భారత్‌ - న్యూజిలండ్‌ మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్యలో నాల్గొవ రోజు న్యూజిలాండ్‌ నాలుగు వికెట్లు కోల్పోయి 237 పరుగులు చేసింది. మెక్‌కల్లమ్‌ 124, విలియమ్‌సన్‌ 12 పరుగులతో క్రీజులో ఉన్నారు. రెండో టెస్టు మ్యాచ్‌ కూడా డ్రా దిశగా పయనిస్తుంది. నాల్గోవ రోజు ఆట ప్రారంభించిన భారత్‌ మరో 36 పరుగులు చేసి చివరి వికెటు కోల్పోయింది. భజ్జీ 116 బంతులలో ఏడు ఫోర్లు, ఏడు సిక్స్‌ర్‌ల సహయంతో సెంచరీ చేసి నాటౌట్‌గా మిగిలాడు. శ్రీశాంత్‌ 24 పరుగుల ఔట్‌ అయ్యాడు. భారత్‌ 122 పరుగుల అధికత్యం నిలిచింది. న్యూజిలండ్‌ రెండో ఇన్సింగ్‌ ప్రారంభించిన నాలుగు వికెట్లు కోల్పోయి 237 పరుగులు చేసింది. మెకింతోష్‌ 49, గుప్తిల్‌ 18, టైలర్‌ 7, రైడర్‌ 20 పరుగులు చేసి అవుట్‌ అయ్యారు. మెక్‌కల్లమ్‌ 124, విలియమ్‌సన్‌ 12 పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత్‌ బౌలింగ్‌లో ఓజా రెండు వికెట్లు తీసుకున్నాడు. శ్రీశాంత్‌ , రైనా చెరో వికెటు తీసుకున్నారు. న్యూజిలండ్‌ 115 పరుగుల లీడ్‌తో ఉంది.