టి20 సిరీస్‌ను కోల్పోయి, తొలి వన్డేలోనూ ఓటమిపాలైన భారత జట్టు కీలక పోరుకు
సన్నద్ధమైంది. ఇక్కడి హోల్కర్ స్టేడియంలో నేడు (బుధవారం) జరిగే రెండో
వన్డేలో దక్షిణాఫ్రికాతో ధోని సేన తలపడుతుంది. ఈ మ్యాచ్ గనక చేజారితే
సిరీస్‌లోని చివరి మూడు వన్డేలూ నెగ్గాల్సిన సవాల్ భారత్‌కు ఎదురవుతుంది.
ప్రస్తుతం జట్టు ఫామ్‌తో అది అంత సులభం కాదు. కాబట్టి ఈ మ్యాచ్‌లో గెలిస్తే
తర్వాతి దశలో సిరీస్ విజయంపై దృష్టి పెట్టవచ్చు. మరో వైపు దక్షిణాఫ్రికా
తమ జోరును కొనసాగించాలని పట్టుదలగా ఉంది.
హర్భజన్‌కు చాన్స్!
ఈ పర్యటనలో దక్షిణాఫ్రికాను ఇబ్బంది పెట్టిన ఏకైక బౌలర్ అశ్విన్. పక్కటెముకల గాయంతో గత మ్యాచ్‌లోంచి మధ్యలోనే తప్పుకున్న అశ్విన్ ఈ మ్యాచ్‌లోగా కోలుకోనే అవకాశం కనిపించడం లేదు. దీనిపై అధికారికంగా మేనేజ్‌మెంట్‌నుంచి ప్రకటన లేకపోయినా...అతను ఆడకపోతే హర్భజన్‌కు తుది జట్టులో స్థానం లభిస్తుంది. టి20ల్లాగే గత వన్డేలోనూ పేసర్ల వైఫల్యం జట్టును దెబ్బ తీసింది. ఉమేశ్, భువీ ఇద్దరూ సమష్టిగా విఫలమయ్యారు. భువీ స్థానంలో మోహిత్‌కు అవకాశం దక్కవచ్చు. బ్యాటింగ్ విషయంలో భారత్ ఎప్పుడూ పటిష్టంగానే కనిపిస్తుంది. కానీ గత మ్యాచ్‌లో కీలక సమయంలో మిడిలార్డర్ రాణించలేకపోయింది.
రోహిత్ శర్మ తిరుగులేని ఫామ్‌లో ఉండగా, మరో ఓపెనర్ ధావన్ మాత్రం ఆకట్టుకోలేకపోతున్నాడు. రహానే మళ్లీ మూడో స్థానంలో ఆడటం ఖాయం. కానీ కోహ్లి, రైనాలు ఇంకా స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేదు. గత మ్యాచ్‌లో అనూహ్యంగా కోహ్లి తడబడ్డాడు. ఆల్‌రౌండర్‌గా రెండు రంగాల్లోనూ విఫలమైన స్టువర్ట్ బిన్నీ ఇక్కడైనా రాణిస్తాడా చూడాలి. అయితే అన్నింటికంటే మరోసారి అందరి దృష్టి కెప్టెన్ ధోనిపైనే ఉంది. విమర్శకులు మళ్లీ తమ కత్తికి పదును పెడుతుండటంతో అటు బ్యాట్స్‌మన్‌గా, ఇటు కెప్టెన్‌గా కూడా అతను సత్తా చాటాల్సి ఉంది.
జట్ల వివరాలు (అంచనా)
భారత్: ధోని (కెప్టెన్), రోహిత్, ధావన్, రహానే, కోహ్లి, రైనా, బిన్నీ, హర్భజన్, మిశ్రా, ఉమేశ్, భువనేశ్వర్/మోహిత్.
దక్షిణాఫ్రికా: డివిలియర్స్ (కెప్టెన్), డి కాక్, ఆమ్లా, డు ప్లెసిస్, డుమిని, బెహర్దీన్, మిల్లర్/మోరిస్, స్టెయిన్, రబడ, మోర్కెల్, తాహిర