Sunday, January 24, 2016

యువీ కనీస ధర రూ. 2 కోట్లు

 గత రెండు ఐపీఎల్‌ సీజన్లలోనూ రూ.15 కోట్లకు పైగా ధర దక్కించుకుని లీగ్‌లోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు యువరాజ్‌ సింగ్‌. నిరుడు అతణ్ని ఎంచుకున్న దిల్లీ ఈసారికి అతణ్ని వదిలేసింది. దీంతో మళ్లీ అతను వేలంలోకి రాబోతున్నాడు. ఈసారి యువీ కనీస ధర రూ.2 కోట్లుగా నిర్ణయించారు. యువీతో పాటు కెవిన్‌ పీటర్సన్‌, షేన్‌ వాట్సన్‌, ఇషాంత్‌ శర్మ, ఆశిష్‌ నెహ్రా, దినేశ్‌ కార్తీక్‌, స్టువర్ట్‌ బిన్నీ, సంజు శాంసన్‌, ధవల్‌ కులకర్ణి, మైకేల్‌ హసిలు కూడా రూ.2 కోట్ల కనీస ధర జాబితాలో ఉన్నారు. ఫిబ్రవరి 5న వేలం నిర్వహిస్తారు.

వేలంలోకి రానున్న కొందరు ప్రధాన ఆటగాళ్లు
కనీస విలువ రూ. 2 కోట్లు: యువరాజ్ సింగ్, పీటర్సన్, వాట్సన్, ఇషాంత్, మిషెల్ మార్ష్, ఆశిష్ నెహ్రా, దినేశ్ కార్తీక్, స్టువర్ట్ బిన్నీ, సంజు శామ్సన్, ధావల్ కులకర్ణి.
రూ. 1.5 కోట్లు: డేల్ స్టెయిన్, మోహిత్ శర్మ, జాస్ బట్లర్.
రూ. 1 కోటి: ఇర్ఫాన్ పఠాన్, టిమ్ సౌతీ.
రూ. 50 లక్షలు: మార్టిన్ గప్టిల్, జాసన్ హోల్డర్, బరీందర్ శరణ్

‘24’లో సూర్య కొత్తలుక్‌

 ‘24’ చిత్రంలో నటుడు సూర్య సరికొత్త లుక్‌ విడుదల అయ్యింది. సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిలర్‌ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ఇప్పటి వరకు విడుదలైన సూర్య పోస్టర్లు ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ప్రస్తుతం విడుదలైన ఈ పోస్టర్‌తో ఈ సినిమాలో సూర్య నటనపై అంచనాలు మరింత పెరిగే అవకాశం ఉంటుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ చిత్రాన్ని సూర్య స్వయంగా నిర్మిస్తుండగా, ప్రముఖ దర్శకులు విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహ్మాన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు.