నటుడు జయంరవిని చిన్న కమలహాసన్‌గా ప్రభుదేవా అభివర్ణించారు. ప్రముఖ
నృత్యదర్శకుడు, నటుడు, దర్శకుడు ప్రభుదేవా ఇటీవల దేవి చిత్రంలో నిర్మాతలా
కూడా అవతారమెత్తిన విషయం తెలిసిందే. ఆయన తన ప్రభుదేవా స్టూడియోస్ పతాకంపై
నిర్మిస్తున్న తాజా చిత్రం బోగన్. జయంరవి, హన్సిక జంటగా నటిస్తున్న ఈ
చిత్రానికి ఇంతకు ముందు ఇదే జంటతో రోమిమో జూలియట్ వంటి సక్సెస్‌ఫుల్
చిత్రాన్ని తెరకెక్కించిన లక్ష్మణ్ దర్శకత్వం వహిస్తున్నారు. నటుడు
అరవిందస్వామి ముఖ్య పాత్రను పోషిస్తున్న ఈ చిత్రానికి డి.ఇమాన్ సంగీతాన్ని
అం దిస్తున్నారు. చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం శనివారం సాయంత్రం చెన్నై
శివారు ప్రాంతం ఇంజిమ్‌బాక్కమ్‌లో గల వేల్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆవరణలోని
ఐసరి వేలన్ ఆవరణలో జరిగింది.ఈ కార్యక్రమంలో పాల్గొన్న చిత్ర కథానాయకుడు
జయంరవి మా ట్లాడుతూ బోగన్ పక్కా కమర్షియ ల్ ఫార్ములాలో తెరకెక్కిన మాస్
రొమాంటిక్ ఎంటర్‌టెయినర్ అని తెలిపారు.
ఇందులో అరవిందస్వామితో మరోసారి కలిసి నటించడం ఆనందంగా ఉందన్నారు. ఇక ఈ
చిత్రంలో యువ సంగీత దర్శకుడు అనిరుద్ పాడిన పాటకు తాను చిందేయడం మంచి
అనుభూతి అని పేర్కొన్నారు. తనిఒరవన్ చిత్రం తరువాత అంత మంచి విజయం
సాధిస్తుందనే నమ్మకం ఉందని అన్నారు. చిత్ర నిర్మాత ప్రభుదేవా మాట్లాడుతూ
సినిమాకు చెందిన చాలా విషయాలు ఆయనకు తెలుసని, అందుకే తాను జయంరవిని
కుట్టి(చిన్న) కమలహాసన్ అని పిలుస్తానని అన్నారు. ఇక నటి హన్సిక నటన బోగన్
చిత్రంలో తనను చాలా ఇంప్రెస్ చేసిందన్నారు. ఎంగేయుమ్ కాదల్ చిత్రం నాటి
నుంచి ఇప్పటి వరకూ ఆమె ఎదుగుదలను తాను చూస్తున్నానని తెలిపారు. ఈ బోగన్
చిత్రం అని వరా్గాలను అలరించే మంచి కమర్షియల్ ఎంటర్‌టెరుునర్‌గా ఉంటుందని
ప్రభుదేవా ఆశాభావం వ్యక్తం చేశారు.