కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో నటించే అవకాశం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూసే కథానాయికలు చాలామందే. తమ అందాన్ని రెట్టింపు చేసి చూపెట్టే మాయాజాలం దర్శకేంద్రుడి చేతిలో ఉందని కథానాయికలు నమ్ముతుంటారు. అలాంటి కె.రాఘవేంద్రరావే ఎప్పట్నుంచో ఓ కథానాయికతో పనిచేయాలని ఎదురు చూస్తున్నారట. ఆమె ఎవరో కాదు... అనుష్క. కాస్త ఆలస్యమైనా అనుష్కతో కలిసి పనిచేసే అవకాశం లభించిందని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు కె.రాఘవేంద్రరావు. ఆయన దర్శకత్వంలో నాగార్జున ప్రధాన పాత్రధారిగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఓం నమో వెంకటేశాయ’. ఇందులో ఓ కీలక పాత్ర కోసం అనుష్కని ఎంపిక చేసుకొన్నారు. అలాగని అనుష్క నాగార్జునకి జంటగా నటించడం లేదు. ఇందులో ఆమెది ఓ భక్తురాలి పాత్ర అని కె.రాఘవేంద్రరావు స్పష్టం చేశారు. ఆమె కెరీర్‌లో ఇలాంటి పాత్ర చేయడం ఇదే తొలిసారి. ‘‘ఏ పాత్రనైనా చేయగలిగే అద్భుతమైన నటి అనుష్క. ‘అరుంధతి’, ‘బాహుబలి’, ‘రుద్రమదేవి’ చిత్రాల్లో తన పాత్రలకి తగ్గట్టుగా ఒదిగిపోయింది. తనదైన నటనతో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. భక్తురాలిగా మా సినిమాలో అనుష్క నటనని చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది’’ని ట్వీట్ చేశారు కె.రాఘవేంద్రరావు.
Tuesday, July 5, 2016
ఆ ఫోటోలను నెట్ లో పెడతానంటూ...
ల్లూరు క్రైం: ‘నీ అర్ధనగ్న ఫొటోలు నా వద్ద ఉన్నాయి.. చెప్పినట్లు వినకుంటే ఫొటోలు నెట్‌లో పెడతా’..అంటూ బెదిరించి బాలికపై ఓ వ్యక్తి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అతని వేధింపులు తాళలేని బాధితురాలు నిద్రమాత్రలు మింగింది. ఈ సంఘటన శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో మంగళవారం వెలుగులోకి వచ్చింది. నెల్లూరులోని నీలగిరి సంఘానికి చెందిన ఓ బాలిక పాలిటెక్నిక్ డిప్లొమో సెకండియర్ చదువుతోంది. ఆమె ఇంటి ముందు నివాసం ఉండే ఉడతా సురేష్‌కు భార్య, ఎనిమిదేళ్ల కొడుకు కూడా ఉన్నాడు. అతడు బాలికను ప్రేమిస్తున్నానంటూ కొన్ని నెలలుగా వెంటపడుతున్నాడు. బాధితురాలు తన తల్లిదండ్రులకు తెలియజేయడంతో వారు ఒకటో పట్టణ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో సురేష్ కుటుంబసభ్యుల హామీ మేరకు కేసు ఉపసంహరించుకొన్నారు. అయినా, అతని ప్రవర్తనలో మార్పురాలేదు. బాలిక కళాశాలకు వెళుతుండగా వెంటబడేవాడు.
ఆమెకు అసభ్యకరమైన మెసేజ్‌లు పెట్టడంతో పాటు, ఆమె అర్ధ నగ్న ఫొటోలు తన వద్ద ఉన్నాయని.. వాటిని నెట్‌లో పెడతానని బాలికను బెదిరిస్తున్నాడు. తాను చెప్పినట్లు వినాలని బెదిరించి తన షాపునకు తీసుకెళ్లి పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డాడు. ఎవరికైనా చెబితే ఆమెను, ఆమె తల్లిదండ్రులను చంపుతానని బెదిరించాడు. దీంతో బాలిక అతని వికృత చేష్టలను మౌనంగా భరిస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలో బాలిక గర్భవతి కాగా అబార్షన్ పిల్స్ మింగించాడు. ఈ క్రమంలో ఈ నెల మూడోతేదీ సాయంత్రం నిద్రమాత్రలు మింగింది. అపస్మారక స్థితిలో ఉన్న బాలికను బాధిత కుటుంబసభ్యులు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటి నుంచి ఆమె ఆస్పత్రిలో చికిత్స పొంది మంగళవారం తల్లిదండ్రుల సాయంతో నాలుగో నగర పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇన్‌స్పెక్టర్ సీహెచ్ సీతారామయ్య నిందితుడిపై లైంగికదాడి కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

విలన్ గా మారుతున్న మరో హీరో
స్టార్ డైరెక్టర్ ఇవివి సత్యనారాయణ వారసుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన హీరో ఆర్యన్ రాజేష్. కెరీర్ స్టార్టింగ్ లో కాస్త ఫరవాలేదనిపించినా.. తరువాత వరుస ఫ్లాప్ లతో నిరాశపరిచాడు. తరువాత వ్యాపారాలతో బిజీగా కావటంతో సినీరంగానికి పూర్తిగా దూరమయ్యాడు. అదే సమయంలో ఆర్యన్ తమ్ముడు అల్లరి నరేష్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకొని 50పైగా సినిమాలు చేసి సత్తా చాటాడు.
సినీ నిర్మాణంతో పాటు ఇతర వ్యాపారాల్లోనూ బిజీగా ఉన్న ఆర్యన్ రాజేష్ కు నటనమీద ఆసక్తితగ్గలేదు. అందుకే త్వరలో రీ ఎంట్రీకి రెడీ అవుతున్నాడు. అయితే టాలీవుడ్ హీరోల సంఖ్య భారీగా పెరుగుతుండటంతో ప్రస్తుతం ప్రతినాయక పాత్రలకు మంచి డిమాండ్ ఏర్పడింది. అందుకే త్వరలో విలన్ గా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు రాజేష్. ఎక్కువగా లవర్ బాయ్ తరహా సినిమాలు చేసిన రాజేష్, విలన్ గా ఎంట్రీ ఇస్తే, అభిమానులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.

Subscribe to:
Posts (Atom)