ఇంగ్లాండ్ మాజీ
క్రికెటర్ ఆండ్రూ ఫ్లింటాఫ్‌పై భారత్‌లోని రెండు మతాల వాళ్లు ఒకేసారి
విరుచుకుపడ్డారు. అదేనండి క్రికెట్, సినిమా మతాలకు చెందిన వాళ్లు.
ఆస్ట్రేలియాపై అద్భుత ఇన్నింగ్స్‌తో చెలరేగిన విరాట్ కోహ్లీని పొగుడుతూనే..
‘‘విరాట్ ఇలాంటి ఆటతీరునే కొనసాగిస్తే ఏదో ఒక రోజు ఇంగ్లాండ్ స్టార్ బ్యాట్స్‌మన్
రూట్ అంతటివాడవుతాడు’’ అంటూ ట్వీట్ చేసి ఓ చురక అంటించాలని
ప్రయత్నించాడు ఫ్లింటాఫ్. దీనికి విరాట్ అభిమానులు తమదైన శైలిలో స్పందిస్తుండగానే..
ఏకంగా అమితాబ్ బచ్చన్ రంగంలోకి దిగాడు. ‘‘రూట్ (వేరు) ఏంటీ రూట్?
రూట్‌ను కుదుళ్లతో సహా పీకేస్తాం’’ అంటూ రివర్స్ పంచ్ ఇచ్చాడు. ఈసారి
బిగ్ బీనే ఆటపట్టిద్దామని ‘‘ఇంతకీ మీరెవరూ?’’ అనేశాడు ఫ్లింటాఫ్.
ఇక అభిమానులు వూరుకుంటారా! యువీ ఆరు సిక్సర్లు, లార్డ్స్‌లో గంగూలీ
చొక్కా విప్పడం లాంటి అనుభవాలు గుర్తు చేసి మరీ ఫ్లింటాఫ్‌ను వాయించేశారు.
‘‘బంధుత్వంలో ఆయన మీ బాప్ (తండ్రి) లాంటి వారు. పేరు షెహన్‌షా’’
అంటూ ఓ అభిమాని.. ‘‘వెళ్లి మేడమ్ టుసాడ్స్ మ్యూజియం చూడు. ఇంగ్లాండ్‌లో
నీకన్నా ఆయనే ప్రముఖుడు’’ అంటూ మరో ఔత్సాహికుడు ఫ్లింటాఫ్‌కు
బిగ్-బిని పరిచయం చేశాడు.