Tuesday, February 23, 2016

నేటి నుంచే ఆసియా కప్



ఆఖరి పంచే కాదు, తొలి విజయం మనదైనప్పుడూ ఆ కిక్కు వేరుగా ఉంటుంది. ఆ కిక్కును సొంతం చేసుకోవాల్సిన సమయమిది. టీ20 ఆసియా కప్ మొదలయ్యేది నేడే. టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు బంగ్లాదేశ్‌తో ఢీకొననుంది టీమ్ ఇండియా. చలో మరి.. టోర్నీలో శుభారంభం చేద్దాం.. కప్పు వేటను దూకుడుగా మొదలెడదాం.
ఆసియా కప్‌కు సర్వం సిద్ధమైంది. బంగ్లాదేశ్ ఆతిథ్యంలో జరగనున్న ఈ టోర్నీ మొదలయ్యేది బుధవారమే. ప్ర పంచ క్రికెట్లో పసికూన స్థాయి నుంచి పరిణతి గల జట్టు స్థాయికి ఎగబాకుతున్న బంగ్లా జట్టుతోనే టీమ్ ఇండియా తొలి మ్యాచ్. ఈ మ్యాచ్‌కు వేదికగా ఇక్కడి షేర్-ఏ-బంగ్లా స్టేడియం ముస్తాబైంది. టీ20 ఫార్మాట్లో ఇప్పుడు భారత్ తిరుగులేని శక్తి. ఆస్ట్రేలియాను వారి గడ్డపై క్లీన్‌స్వీప్ చేసి వచ్చి, భారత్‌లో లంకను 2-1తో ఓడించి బలంగా కనిపిస్తున్నది. సోమవారం జరిగిన ప్రాక్టీస్ సెషన్ ముందు వరకూ కూడా టీమ్ ఇండియా అన్ని అంశాల్లో ఏ లోటూ లేకుండా కనబడింది. అయితే ప్రాక్టీస్‌లో ధోనీ వెన్నుకండరాల గాయానికి గురవడం ప్రస్తుతం జట్టును ఇబ్బంది పెడుతున్న అంశం. అలా అని ఈ మ్యాచ్‌లో ధోనీ ఆడబోడన్నది ఇప్పుడే చెప్పలేంగానీ, అన్ని విధాలుగా ఆసియా కప్‌కు సమాయత్తమైన జట్టుకు ధోనీ గాయం కొద్దిగా ఇబ్బంది పెట్టే అంశమే. ఈ మ్యాచ్‌కు ధోనీ దూరమైనా యువసారథి కోహ్లీ నేతృత్వంలో జట్టు ఆత్మవిశ్వాసంతోనే బరిలోకి దిగుతుంది.
జట్లు (అంచనా)
భారత్: ధవన్, రోహిత్, కోహ్లీ, రైనా, యువరాజ్, ధోనీ (కెప్టెన్, వికెట్ కీపర్)/ పార్థివ్ పటేల్, పాండ్య, జడేజా, అశ్విన్, బుమ్రా, నెహ్రా
బంగ్లా: సౌమ్య సర్కార్, మహ్మద్ మిథున్, సబ్బీర్, మహ్మదుల్లా, ముష్ఫికర్, షకిబల్, నురుల్ హసన్ (వికెట్ కీపర్), మోర్తజా (కెప్టెన్), అరాఫత్, ముస్తఫిజుర్, అల్ అమిన్ హుస్సేన్

ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టగలరా..?

  చిట్టి గౌను ధరించి చేతిలో పువ్వు పట్టుకుని కూర్చున్న ఈ చిన్నారి ఎవరో తెలుసా?... ‘లక్ష్మీ కళ్యాణం’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి కాజల్‌. ఆమె తన చిన్ననాటి మధురానుభూతులను గుర్తు చేసుకుంటూ ఇలా ఈ ఫొటోను సోషల్‌మీడియా ద్వారా పంచుకున్నారు. ‘చిన్నప్పటినుంచే పోజులిచ్చేదాన్ని... నా చేతిలో ఆ పువ్వు ఎందుకు పట్టుకున్నానో తెలియట్లేదు’ అంటూ పోస్ట్‌ చేశారు. దీనికి అభిమానులు తెగ లైక్‌లు కొట్టేస్తూ... బోలెడన్ని కామెంట్స్‌ పెట్టేస్తున్నారు. చిన్నప్పటికీ ఇప్పటికీ కాజల్‌ ఏమీ మారలేదని, తన కళ్లు చాలా అందంగా ఉంటాయని చెప్పుకొచ్చారు. అంతేకాదు కాజల్‌ చేతిలోని ఆ పువ్వు తమ కోసమేనంటూ అభిమానులు సరదాగా కామెంట్స్‌లో పేర్కొన్నారు.