ప్రేమకోసం..
ప్రియురాలి కోసం ప్రియుడు ఎన్ని కష్టాలైనా భరిస్తాడు. ఎన్ని యుద్ధాలైనా
చేస్తాడు. విలన్లతో పోరాడుతాడు. దెబ్బలు తింటాడు. జైలుకెళ్తాడు. ప్రేమను
గెలుపించుకోవడం కోసం ఏదైనా చేస్తాడు. ఇది సహజం. కానీ.. ప్రియుడు
కోసం ఓ ప్రియురాలి చేసిన సాహసం గురించి చెబితే.. ఔరా! అంటూ ఆశ్చర్యపోతారు.
ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు.. ఏం చేసిందంటే..
వెనుజులాకి చెందిన 25ఏళ్ల ఆంటోనిటా రొబుల్స్ సౌడా బార్సిలోనాలోని ప్యుంటె అయేలా జైలులో శిక్ష అనుభవిస్తున్న తన ప్రియుడు జోస్ ఆంటోనియోను చూసేందుకు వచ్చింది. ఆమెతో పాటు తన పాపను.. గులాబి రంగు సూట్‌కేస్‌ను వెంట తెచ్చుకుంది. ఈ జైల్లో ఖైదీలను చూసేందుకు వచ్చిన వారు రాత్రంతా అక్కడే గడిపే వెసులుబాటు ఉంది. దీంతో సౌడా తన ప్రియుడితో రాత్రంతా గడిపింది. మరుసటి రోజు సౌడా తాను తెచ్చుకున్న గులాబి రంగు సూట్‌కేసులో ప్రియుడిని కుక్కి పడుకోబెట్టి బయటకు తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. దాదాపు తప్పించుకున్నారన్న సమయంలో జైలు ద్వారం వరకు సూట్‌కేసును మోసుకెళ్లిన సౌడా ద్వారం గడపను దాటించేందుకు చాలా అవస్థలు పడింది. సూట్‌కేసులో ప్రియుడు ఉండటంతో అది బరువైక్కింది. దాన్ని సౌడా ఒక్కతే మోయలేకపోయింది. వచ్చేటప్పుడు సౌడా సూట్‌కేసును అవలీలగా మోసుకెళ్లింది. ఇప్పుడు మోసేందుకు శ్రమిస్తుడంటంతో అనుమానం వచ్చిన పోలీసులు సూట్‌కేసును తెరిచారు. అందులో ఆమె ప్రియుడు జోస్ ఆంటానియో ఉండటం చూసి పోలీసులు షాక్ అయ్యారు. వెంటనే అతన్ని మళ్లీ జైలు గదికి పంపి.. సౌడాను కోర్టులో హాజరుపర్చారు. తొందరల్లో ఆమెకు న్యాయస్థానం శిక్ష ఖరారు చేయనుంది. వారి పాపను సోషల్ సర్వీస్ శాఖకు అప్పగించనున్నారు.