భలే భలే మగాడివోయ్ సినిమాతో సక్సెస్ ట్రాక్ లోకి వచ్చిన నాని, ప్రస్తుతం
సినిమాల విషయంలో చాలా సెలెక్టివ్ గా ఉంటున్నాడు. స్టార్ డైరెక్టర్ల నుంచి
కొత్త దర్శకుల వరకు అందరూ నానితో సినిమా చేయడానికి రెడీగా ఉన్నా.. అతడు
మాత్రం ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. ముఖ్యంగా కృష్ణగాడి వీర ప్రేమగాథ
సినిమాతో మంచి విజయం సాధించినా, ఆ సినిమా బ్లాక్ బస్లర్స్ లిస్ట్ లో
చేరకపోవటంతో నెక్ట్స్ సినిమా విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు.
ప్రస్తుతం ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో
హీరోగా నటిస్తున్నాడు నాని. ఆ తరువాత ఉయ్యాల జంపాల దర్శకుడు విరించి వర్మతో
ఓ సినిమా చేస్తాన్న టాక్ వినిపిస్తున్నా, అఫీషియల్ గా మాత్రం ఎనౌన్స
చేయలేదు. దీంతో తరువాత నాని చేయబోయే సినిమాపై ఇంత వరకు ఎలాంటి క్లారటీ
రాలేదు. ఇప్పటికే 16 కథలు విన్న నాని వాటిలో ఏ ఒక్క కథకు ఓకె చెప్పలేదన్న
టాక్ వినిపిస్తోంది. ఇలా నాని కాదన్న కథల్లో స్టార్ డైరెక్టర్లు తెచ్చినవి
కూడా ఉండటంతో ఇండస్ట్రీ వర్గాలు షాక్ అవుతున్నాయి.