Sunday, July 10, 2011

భారత్‌ 1-0 తేడా గెలుపు

మూడో టెస్టు మ్యాచ్‌ డ్రా
ఎడ్వూర్స్‌ , చందర్‌పాల్‌ సెంచరీలు
భారత్‌ రెండో ఇన్సింగ్‌ టార్గెట్‌ 180
ఇంకా 15 ఓవర్ల ఉండగానే మ్యాచ్‌ డ్రాగా ముగిసింది.
 
భారత్‌, వెస్టిండీస్‌ల మధ్య జరుగుతున్న మూడోవ టెస్టు మ్యాచ్‌ డ్రా అయ్యింది. వెస్టిండీస్‌ రెండో ఇన్నింగ్స్‌ 322 పరుగులు చేసి అలౌట్‌ అయ్యింది. చందర్‌పాల్‌ 116, ఎడ్వూర్స్‌ 110 ఇద్దరు సెంచరీలు చేశారు. విండీస్‌ 10 పరుగులకే ఓపెనర్లు ఇద్దరు పెవిలియన్‌కు చేరుకున్నారు. వన్‌డౌన్‌గా వచ్చిన ఎడ్వూర్స్‌ తన మొదటి మ్యాచ్‌లో సెంచరీ చేసి భారత్‌ బౌలింగ్‌ దీటుగా ఎదుర్కొన్నాడు. 195 బంతులలో తొమ్మిది ఫోర్లు, ఒక సిక్స్‌లతో సహాయంతో 110 పరుగులు చేశాడు. ఎడ్వూర్స్‌కు తోడుగా చందర్‌పాల్‌ సహయం చేశాడు. మిగితా బ్యాట్స్‌మెన్‌లు కనీసం 20 పరుగులు కూడ చేయలేకపోయారు. భారత్‌ బౌలింగ్‌లో హర్భజన్‌ సింగ్‌ నాలుగు వికెట్లు తీసుకున్నాడు. ప్రవీణ్‌కుమార్‌, సురేష్‌ రైనా చెరో రెండు వికెట్లు తీసుకున్నారు.ఇషాంత్‌ శర్మ ఒక వికెట్లు లభించింది. భారత్‌ 180 టార్గెట్‌ ఇచ్చింది. రెండో ఇన్సింగ్స్‌ ప్రారంభించిన భారత్‌ ఓపెనరు ముకుంద్‌ డకౌట్‌గా అయ్యాడు. మురళీ విజరు, ద్రావిడ్‌ ఇద్దరు మ్యాచ్‌ని గెలిచే ప్రయత్నించారు. మురళీ విజరు 45 పరుగుల వద్ద అవుట్‌ కావడంతో స్కోరు బోర్డు కాస్త మెల్లగా నడిచింది. సురేష్‌ రైనా 8 పరుగులు చేసి నిరశాపరిచాడు. ద్రావిడ్‌ 34, లక్ష్మణ్‌ 3 పరుగులతో నాటౌట్‌గా ఉన్నారు. ఇంకా 15 ఓవర్ల ఉండగానే మ్యాచ్‌ డ్రాగా ముగిసింది.