గవర్నర్ నరసింహన్‌తోనూ ప్రత్యేక సమావేశం
తెలంగాణ, ఆరధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆదివారం హైదరాబాద్‌లో భేటీ కానున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని నగర శంకుస్థాపనకు రమ్మని ఆహ్వానించేందుకు చంద్రబాబు కెసిఆర్‌ను కలవబోతున్నారు. ఆదివారం సాయంత్రం 5.30 గంటలకు ఆయన కెసిఆర్ నివాసానికి వెళ్లనున్నారు. దీనికి సంబంధించి శనివారం ఉదయం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయం కెసిఆర్ అపాట్‌మెంట్ కోరింది. ఏడాది తర్వాత వారిద్దరూ సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఓటుకు నోటు కేసు తర్వాత ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమన్న పరిస్థితి నెలకొంది. ఇక భవిష్యత్తులో భేటీ అయ్యే పరిస్థితులు ఉండవని అనుకున్న నేపథ్యంలో ఏపీ నూతన రాజధాని అమరావతి శంకుస్థాపన వారిని కలపబోతుంది. కెసిఆర్‌ను కలిసి ఆహ్వానించే బాధ్యతను ఏపీ సెక్రటేరియట్ చంద్రబాబుకు అప్పగించిన విషయం తెలిసిందే.