టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇచ్చిన దగ్గరనుంచి తన స్థాయికి తగ్గ హిట్ ఇవ్వటంలో
ఫెయిల్ అవుతున్న రామ్ గోపాల్ వర్మ ఈసారి తన పూర్తి స్థాయి ఎఫర్ట్ తో
తెరకెక్కించిన సినిమా కిల్లింగ్ వీరప్పన్. చాలారోజులుగా క్వాలిటీ సినిమాలు
చేయట్లేదన్న అపవాదు మూట కట్టుకున్న రామ్ గోపాల్ వర్మ కిల్లింగ్ వీరప్పన్
సినిమాను గ్రాండ్‌గా తెరకెక్కించాడు. నాలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను
గడగడలాడించిన గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ఈ
సినిమా వర్మను సక్సెస్ ట్రాక్ ఎక్కించిందా..? అనుకొని పరిస్థితుల్లో
తెలుగు వర్షన్ రిలీజ్ వాయిదా పడింది. ప్రస్తుతానికి కన్నడ ప్రేక్షకులను
అలరిస్తున్న వీరప్పన్ ను తెలుగు ఆడియన్స్ చూడాలంటే మాత్రం వర్మ మరో డేట్
చెప్పే వరకు వెయిట్ చేయాల్సిందే......
Saturday, January 2, 2016
అబ్బాయితో అమ్మాయి : రివ్యూ
కథేంటంటే:అభి
(నాగశౌర్య) ఇంజినీరింగ్ కుర్రాడు. ప్రేమంటే ఇతనికి ఓ సరదా వ్యాపకం.
అందుకే అందంగా కనిపించిన ప్రతీ అమ్మాయినీ ప్రేమలోకి దించే ప్రయత్నం చేస్తుంటాడు.
ఆ దశలో ప్రార్థన (పల్లక్ లల్వాని) బస్‌స్టాప్‌లో తారపడుతుంది. ఆమెని ఆకట్టుకొని
ప్రేమలోకి దించేస్తాడు. ఇద్దరూ శారీరకంగా ఒక్కటవుతారు. ఆ విషయం
ప్రార్థన ఇంట్లో తెలిసిపోతుంది. దీంతో తండ్రి ఆమెని ఇంట్లో నుంచి గెంటేస్తాడు.
ఆ విషయం తెలిసినా అభి నుంచి స్పందన కనిపించదు. దీంతో అభి అసలు రూపాన్ని
తెలుసుకొన్న ప్రార్థన ఏం చేసింది? పవన్‌కల్యాణ్‌గా ఫేస్‌బుక్‌లో పరిచయమైన
కుర్రాడు ప్రార్థన కోసం ఏం చేశాడు? పవన్‌కల్యాణ్‌కీ, అభికీ మధ్య సంబంధమేమిటి?
అనే విషయాలను తెరపైనే చూడాలి.
ఎలా ఉందంటే: సామాజిక అనుసంధాన వేదికల్లో తమ అంతరంగాల్ని ఆవిష్కరించుకొనే యువతరం.. వాళ్ల మనసుల్లోని గందరగోళం.. నేపథ్యంలో తీర్చిదిద్దిన కథ ఇది. ట్రెండ్‌కి తగ్గ అంశాన్నే ఎంచుకొన్నారు కానీ.. ఆ ఒక్క అంశమే సినిమా అయిపోదు కదా! దాని చుట్టూ బలమైన కథనాన్ని అల్లుకోవాలి. మలుపులు, పాత్రల మధ్య సంఘర్షణ జోడించాలి. ఆ విషయంలోనే దర్శకుడు తడబడ్డాడు. తెరపై ఏ పాత్ర ఎప్పుడు ఎలా వ్యవహరిస్తుందో అర్థం కాని పరిస్థితి. పాత్రలు అటూ ఇటూ వేగంగా తిరుగుతుంటాయి తప్ప కథ మాత్రం ముందుకు నడవదు. అసలు ఈ సినిమాలో కథ ఉందా అన్న సందేహం కూడా వెంటాడుతూ ఉంటుంది. కానీ అడుగడుగునా పంచ్ డైలాగ్ వినిపిస్తుంటుంది. ప్రతీ పది నిమిషాలకో పాట వినిపిస్తుంటుంది. అందమైన లొకేషన్లు కనిపిస్తుంటాయి. ఇలాంటివి ఎన్నున్నా ఏం లాభం?.. కథే లేనప్పుడు. ఉన్నట్టుండి హీరోయిన్ హీరో ఇంట్లోకి వచ్చేస్తుంది. ఆ వెంటనే హీరో హీరోయిన్ ఇంట్లోకి దూరిపోతాడు. హీరోకి బద్ధ శత్రువులా, ఒక శాడిస్ట్‌లా కనిపించిన హీరోయిన్ తండ్రి ఒక ఫైట్ పూర్తయ్యేలోపు మారిపోతాడు. ఏకంగా తన కూతురిని ఎలా ప్రేమలో దించాలో హీరోకి టిప్స్ ఇచ్చేస్తుంటాడు. సినిమాలో ఇలాంటి సిత్రాలు చాలానే ఉంటాయి. ప్రతీ సన్నివేశం గందరగోళంగానే అనిపిస్తుంటుంది. బ్రహ్మానందం, పృథ్వీ, తేజస్విలాంటి ప్రముఖ నటులున్నా వాళ్లంతా ఎప్పుడొస్తారో, ఎప్పుడు వెళ్లిపోతారో అర్థం కాకుండా ఉంటుంది. ఇలాంటి ప్రేమకథలకి భావోద్వేగాలు చాలా ముఖ్యం. అందుకే తెరపైన కనిపించే ప్రతీ పాత్రని సీరియస్‌గా చూపెట్టాడు దర్శకుడు... కానీ పాత్రల మధ్య భావోద్వేగాలు మాత్రం పండలేదు.
ఎవరెలా..: నాగశౌర్య పాత్రకి తగ్గట్టుగా బాగా చేశాడు. సినిమా సగభాగం నుంచి భావోద్వేగాలు పండించే ప్రయత్నం చేశాడు కానీ ఆ సన్నివేశాలకి అతకలేదు. పల్లక్ లల్వాని అందంగా కనిపించింది. కానీ ఆమె నవ్వినా, ఏడ్చినా ఒకలాగే అనిపిస్తుంటుంది. రావు రమేష్ పాత్ర సాగే విధానం ప్రేక్షకుడికి ఏమాత్రం రుచించదు. ఆ పాత్రలో ఆయన అంతకంటే ఏమీ చేయలేరేమో! సాంకేతికత విషయంలోకి వస్తే... శ్యామ్ కె.నాయుడు కెమెరా పనితనానికి వందకి వంద మార్కులేయాల్సిందే. ప్రతీ సన్నివేశాన్నీ అందంగా చూపించాడాయన. బ్రహ్మ కడలి కళా విభాగం కూడా మంచి పనితీరును కనబరిచింది. ఇళయరాజా సంగీతానికి ఓ ప్రత్యేకమైన మార్క్ ఉంటుంది. కానీ పాటలు, రీ రికార్డింగ్‌పై ఆయన ముద్ర అస్సలు కనిపించదు. దర్శకుడిగా రమేష్ వర్మ తనదైన ముద్ర వేయలేకపోయాడు. కథ, కథనాలతో ఏ దశలోనూ రక్తికట్టించలేకపోయాడు. మాటలు మాత్రం బాగానే పేలాయి. ప్రాసలపైనా, పంచ్‌లపైనా బాగానే కసరత్తులు చేశారు. నిర్మాణ విలువల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ప్రతీ సన్నివేశం రిచ్‌గా కనిపిస్తుంటుంది.

Subscribe to:
Posts (Atom)