తెలుగు సినీ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం
చేసిన చిత్రం ‘బాహుబలి’. ఎస్.ఎస్.రాజమౌళి
దర్శకత్వంలో తెరకెక్కిన ఈ విజువల్
వండర్ బాక్సాఫీస్ వద్ద కాసుల
వర్షాన్ని కురిపించింది. ప్రస్తుతం
‘బాహుబలి: ద కన్‌క్లూజన్’ సిద్ధమవుతోంది.
కట్టప్ప.. బాహుబలిని ఎందుకు
చంపాడు? సగటు సినీ ప్రేక్షకుడి
మదిని తొలిచేస్తున్న ప్రశ్న
ఇది. ఈ నేపథ్యంలో బాహుబలి-2లో
ప్రభాస్ ఫస్ట్‌లుక్‌ను చిత్ర
బృందం విడుదల చేసింది. ‘మహేంద్ర
బాహుబలి వస్తున్నాడు’ అంటూ
ప్రభాస్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు
చెబుతూ ఫస్ట్‌లుక్‌ను అభిమానులతో
పంచుకున్నారు. చేతికి గొలుసులు
చుట్టుకుని సిక్స్‌ప్యాక్‌తో
ఉన్న ప్రభాస్ ఫొటో అభిమానులను
విపరీతంగా ఆకట్టుకుంది. తొలిభాగాన్ని
మరిపించేలా రెండో భాగం ఉంటుందని
ఇటీవల రానా చెప్పిన సంగతి తెలిసిందే.
అందుకు తగినట్లు చిత్ర బృందం
రెండో భాగంపై ప్రత్యేక శ్రద్ధ
పెట్టింది. ‘బాహుబలి: ద కన్‌క్లూజన్’
వచ్చే ఏడాది ఏప్రిల్ 28న ప్రేక్షకుల
ముందుకు రానుంది. ప్రభాస్,
రానా, అనుష్క, తమన్నా కీలక పాత్రలు
పోషించారు.
‘బాహుబలి: ద బిగినింగ్’కు కొనసాగింపు ‘కన్‌క్లూజన్’ను తీసుకువస్తున్నట్లే దర్శకుడు రాజమౌళి 2015లో చేసిన ట్వీట్‌ను కొనసాగింపు ఇచ్చారు. ‘ప్రతి కథలోనూ అంతర్లీనంగా ఒక ప్రత్యేక సందర్భం ఉంటుంది. అది మొత్తం కథను నిర్వచించి, ముందుకు నడిపిస్తుంది. అదే బాహుబలి ద బిగినింగ్’ అనే ట్వీట్‌కు కొనసాగింపుగా, ‘ఇప్పుడు అతడు తన అనితరశక్తితో ఎలా మాహిష్మతి రాజ్యాన్ని గెలుస్తాడో.. అదే బాహుబలి2 ద కన్‌క్లూజన్’ అంటూ ట్వీట్ చేశారు.