ప్రముఖ నిర్మాత, రచయిత ఎం.ఎస్.రెడ్డి (87) ఇక లేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం ఉదయం ఫిలింనగర్‌లోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఎం.ఎస్.రెడ్డి మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన మృతి సినీపరిశ్రమకి తీరని లోటని పేర్కొన్నారు. నేడు మల్లెమాల అంతిమ సంస్కారాలు హైదరాబాద్‌లో జరగనున్నాయని కుటుంబ సభ్యులు తెలిపారు.ఎం.ఎస్.రెడ్డి పూర్తి పేరు మల్లెమాల సుందర రామిరెడ్డి. నెల్లూరు జిల్లా..అలివిరి అనే గ్రామంలో 1952లో జన్మించారు. ఓ నిరుపేద కుటుంబంలో పుట్టిన ఎం.ఎస్.రెడ్డి ఐదుగురు అన్నదమ్ముల్లో పెద్దవాడు.
రెడ్డిగారికి చిన్నప్పటినుంచే పఠనాసక్తి ఉంది. ఆ ఆసక్తితో ఎన్నో పుస్తకాలు చదివారు. అభ్యుదయ రచయిత శ్రీశ్రీ అంటే తనకి వల్లమాలిన అభిమానం. విశ్వనాథ సత్యనారాయణ రచనలన్నా ఎంతో ఆసక్తిగా చదివేవారు. ఆ క్రమంలోనే కవిత్వం, పద్యం, పుస్తకం..ఇలా అన్ని విభాగాల్లో రచనలు చేశారు. ఆయన తన ఇంటిపేరునే కలం పేరుగా (మల్లెమాల) మార్చుకుని ఎన్నో రచనలు చేశారు. కవితలు రాశారు. ఆయన రాసిన పద్యకవితలు..మహారచయిత విశ్వనాథ సత్యనారాయణ మెప్పు సైతం పొందాయి. ‘ఇది నా కథ’ పేరుతో ఇటీవల తన ఆత్మకథను విడుదల చేశారు. అయితే అది వివాదాస్పదమైంది. ఇంటా, బయటా వచ్చిన ఒత్తిళ్లతో ఆ పుస్తకాన్ని పూర్తిగా మార్కెట్లోకి రిలీజ్ చేయకుండా నిలిపేశారు.
1966లో ‘కన్నెపిల్ల’ అనే అనువాద చిత్రంతో నిర్మాణరంగంలోకి ప్రవేశించారు. తర్వాత శోభన్‌బాబు, వాణిశ్రీ జంటగా కె.ఎస్. ప్రకాశరావు దర్శకత్వంలో ‘భార్య’ చిత్రాన్ని నిర్మించారు. ఎన్టీర్‌తో ‘శ్రీ కృష్ణ విజయం’, చలం హీరోగా ‘ఊరికి ఉపకారి’, శోభన్‌బాబు హీరోగా ‘కోడెనాగు, నాయుడుబావ, రామబాణం, కృష్ణ హీరోగా ‘ఏకలవ్య’, రామకృష్ణ హీరోగా ‘దొరలు-దొంగలు’ నారాయణరావు హీరోగా ‘ముత్యాల పల్లకి’ నిర్మించారు. 1966 నుంచి 1987 వరకు అంటే రెండు దశాబ్దాలపాటు కౌముది పిక్చర్స్ పతాకంపై 25కు పైగా చిత్రాలను జయాపజయాలతో సంబంధం లేకుండా నిర్మించారు.
స్వయంగా సహజకవి అయిన ఎం.ఎస్.రెడ్డి దాదాపు ఐదువేలకు పైగా కవితలు, పాటలు, పద్యాలు రాశారు. తన సినిమాలలో తాను రాసిన పాటలు ఉపయోగించుకునేవారు. ఎక్కువగా ఆయన పాటలకు సత్యం మాష్టారు ట్యూన్లు కట్టేవారు. బాల రామాయణం చిత్రం ద్వారా జూనియర్ ఎన్టీఆర్‌ను తెలుగు తెరకు పరిచయం చేశారు. ఆ చిత్రంతో జాతీయ అవార్డ్ సైతం అందుకున్నారు. ‘అంకుశం’ చిత్రంలో ఆయన చేసిన ముఖ్యమంత్రి పాత్ర నటుడిగా మంచి గుర్తింపునిచ్చింది.
2005లో రాష్ట్ర ప్రభుత్వం రఘుపతి వెంకయ్య అవార్డుతో సత్కరించింది. ఈయన తనయుడు శ్యాంప్రసాద్ రెడ్డి మల్లెమాల బ్యానర్‌పై సినిమాలు నిర్మిస్తున్నారు. ముక్కుసూటిగా వ్యవహరించే వ్యక్తిగా మల్లెమాలకు పేరుంది. ఇటీవలే ఆయన ‘ఇదీ నా కథ’ పేరుతో రాసిన ఆత్మకథ పలు వివాదాలు సృష్టించింది. తన ఆత్మకథలో పలువురు సినీప్రముఖులపై సూటిగా విమర్శించి సంచలనం సృష్టించారు.
ఎవరికీ అపకారం చేయని వ్యక్తి. ముక్కుసూటి మనిషి. ఆయన నిష్ర్కమణంతో పరిశ్రమ పెద్ద దిక్కును కోల్పోయింది.
రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి ..నిర్మాత ఎం.ఎస్.రెడ్డి మృతిపట్ల తీవ్ర విభ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన స్వగృహంలో భౌతికకాయాన్ని సందర్శించిన అనంతరం గొప్ప వ్యక్తిని సినీపరిశ్రమ కోల్పోయిందని ఆయన వ్యాఖ్యానించారు. కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
పరిశ్రమకు అన్నీ తానే అయి తలో నాలుకలా మెలిగేవారు. చివరి రోజుల్లో ఏ బాదరబందీ లేని వ్యక్తిగా స్వర్గస్తులైన గొప్ప వ్యక్తి. మల్లెమాల ధన్య జీవి.
‘పల్నాటి సింహం’ వంటి విజయవంతమైన చిత్రాన్ని నిర్మించారు. నేను నటించిన ఎన్నో సినిమాలకు స్వయంగా పాటలు రాశారు. పరిశ్రమ నేడు పెద్ద దిక్కును కోల్పోయింది.
ఉత్తమ నిర్మాత, కవి, దార్శనికుడు మల్లెమాల. తెలుగుదనం ఉట్టిపడేలా కవిత్వం రాశారు. రెడ్డిగారి మరణం విచారం కలిగించింది.
పరిశ్రమలో నన్నెంతగానో ప్రోత్సహించిన గొప్ప వ్యక్తిని కోల్పోయాను. ఇది పెద్ద విషాదం. ఆయన ఆత్మ శాంతించాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను.
మల్లెమాలకు అభిమానిని. తనో అద్భుత కవి. ‘భైరవద్వీపం’ సినిమా చూసి రాకుమారి అంటే ఇలా ఉండాలి అని అభినందించారు.
రెడ్డిగారికి చిన్నప్పటినుంచే పఠనాసక్తి ఉంది. ఆ ఆసక్తితో ఎన్నో పుస్తకాలు చదివారు. అభ్యుదయ రచయిత శ్రీశ్రీ అంటే తనకి వల్లమాలిన అభిమానం. విశ్వనాథ సత్యనారాయణ రచనలన్నా ఎంతో ఆసక్తిగా చదివేవారు. ఆ క్రమంలోనే కవిత్వం, పద్యం, పుస్తకం..ఇలా అన్ని విభాగాల్లో రచనలు చేశారు. ఆయన తన ఇంటిపేరునే కలం పేరుగా (మల్లెమాల) మార్చుకుని ఎన్నో రచనలు చేశారు. కవితలు రాశారు. ఆయన రాసిన పద్యకవితలు..మహారచయిత విశ్వనాథ సత్యనారాయణ మెప్పు సైతం పొందాయి. ‘ఇది నా కథ’ పేరుతో ఇటీవల తన ఆత్మకథను విడుదల చేశారు. అయితే అది వివాదాస్పదమైంది. ఇంటా, బయటా వచ్చిన ఒత్తిళ్లతో ఆ పుస్తకాన్ని పూర్తిగా మార్కెట్లోకి రిలీజ్ చేయకుండా నిలిపేశారు.
1966లో ‘కన్నెపిల్ల’ అనే అనువాద చిత్రంతో నిర్మాణరంగంలోకి ప్రవేశించారు. తర్వాత శోభన్‌బాబు, వాణిశ్రీ జంటగా కె.ఎస్. ప్రకాశరావు దర్శకత్వంలో ‘భార్య’ చిత్రాన్ని నిర్మించారు. ఎన్టీర్‌తో ‘శ్రీ కృష్ణ విజయం’, చలం హీరోగా ‘ఊరికి ఉపకారి’, శోభన్‌బాబు హీరోగా ‘కోడెనాగు, నాయుడుబావ, రామబాణం, కృష్ణ హీరోగా ‘ఏకలవ్య’, రామకృష్ణ హీరోగా ‘దొరలు-దొంగలు’ నారాయణరావు హీరోగా ‘ముత్యాల పల్లకి’ నిర్మించారు. 1966 నుంచి 1987 వరకు అంటే రెండు దశాబ్దాలపాటు కౌముది పిక్చర్స్ పతాకంపై 25కు పైగా చిత్రాలను జయాపజయాలతో సంబంధం లేకుండా నిర్మించారు.
స్వయంగా సహజకవి అయిన ఎం.ఎస్.రెడ్డి దాదాపు ఐదువేలకు పైగా కవితలు, పాటలు, పద్యాలు రాశారు. తన సినిమాలలో తాను రాసిన పాటలు ఉపయోగించుకునేవారు. ఎక్కువగా ఆయన పాటలకు సత్యం మాష్టారు ట్యూన్లు కట్టేవారు. బాల రామాయణం చిత్రం ద్వారా జూనియర్ ఎన్టీఆర్‌ను తెలుగు తెరకు పరిచయం చేశారు. ఆ చిత్రంతో జాతీయ అవార్డ్ సైతం అందుకున్నారు. ‘అంకుశం’ చిత్రంలో ఆయన చేసిన ముఖ్యమంత్రి పాత్ర నటుడిగా మంచి గుర్తింపునిచ్చింది.
2005లో రాష్ట్ర ప్రభుత్వం రఘుపతి వెంకయ్య అవార్డుతో సత్కరించింది. ఈయన తనయుడు శ్యాంప్రసాద్ రెడ్డి మల్లెమాల బ్యానర్‌పై సినిమాలు నిర్మిస్తున్నారు. ముక్కుసూటిగా వ్యవహరించే వ్యక్తిగా మల్లెమాలకు పేరుంది. ఇటీవలే ఆయన ‘ఇదీ నా కథ’ పేరుతో రాసిన ఆత్మకథ పలు వివాదాలు సృష్టించింది. తన ఆత్మకథలో పలువురు సినీప్రముఖులపై సూటిగా విమర్శించి సంచలనం సృష్టించారు.
-డా.అక్కినేని నాగేశ్వరరావు
-డా డి.రామా నాయుడు
-కృష్ణ, విజయనిర్మల దంపతులు
-బిజెపి నేత వెంకయ్య నాయుడు
-కృష్ణం రాజు
-రోజా