నేడు ప్రముఖ సినీ హీరో, ఎమ్మెల్యే చిరంజీవి తనయుడు రామ్‌చరణ్‌తేజ, అపోలో గ్రూప్ ఛైర్మన్ ప్రతాప్‌రెడ్డి మనుమరాలు ఉపాసనల నిశ్చితార్థం జరుగనుంది. ఈ నిశ్చితార్థనికి మొయినాబాద్ మండలం అజీజ్ నగర్‌లోని అపోలో ఫాంహౌస్‌లో అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఫాంహౌస్‌ను అంగరంగ వైభవంగా తీర్చిదిద్దారు. ముందు ప్రతాప్‌రెడ్డి సొంత జిల్లా అయిన నిజామా బాద్‌లోని తన సొంత కోటలో నిశ్చితార్థం నిర్వహించాల నుకున్నారు. అనంతరం హైదరాబాద్ నగరా నికి, అంతర్జాతీయ విమానాశ్రయానికి దగ్గరగా ఉండే విధంగా నిశ్చితార్థ వేదికను ఈ ఫాంహౌస్‌కి మార్చారు. 20 రోజులుగా నిశ్చితార్థ ఏర్పాట్లు చేశారు. సుమారు 30 ఎకరాల విస్తీర్ణంలో నిశ్చితార్థం ప్రాంగణాన్ని తయారు చేశారు. వేదికను భారీ సెట్టింగులతో ఏర్పాటు చేశారు. సుమారు 2000 మంది వరకు రాజకీయ, సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు రాష్ట్ర నలుమూలల నుంచి రావడంతో పాటు దేశ రాజధాని నుంచి వివిఐపిలు ఈ వేడుకకు హాజరు కానున్నారు. వాహనాలు పార్కింగ్ చేసేందుకు పార్కింగ్‌ను ఏర్పాటు చేశారు.
హాజరుకానున్న ప్రముఖులు
చిరంజీవి కుమారుడు రామ్‌చరణ్‌తేజ నిశ్చితార్థానికి రాజకీయ, సినీ ప్రముఖులు హాజరు కానున్నారు. ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఐఎఎస్ అధికారులు సైతం హాజరవుతున్నట్లు సమాచారం. హైదరాబాద్ నగరానికి చేరువలో అంతర్జాతీయ విమానాశ్రయానికి దగ్గరలో ఔటర్ రింగ్ రోడ్డు నుంచి కిలోమీటర్ దూరంలో నిశ్చితార్థ వేదిక ఏర్పాట్లు చేశారు. వివిఐపిలకు అనుకూలంగా ఉండే విధంగా ఈ ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. వివిఐపిల సమయాన్ని దృష్టిలో పెట్టుకొని నగరానికి దగ్గరలో ఏర్పాట్లు చేశారు. దేశ రాజధాని నుంచి కొందరు ప్రముఖులు రావడంతో విమానాశ్రయానికి చేరువలో ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. నిశ్చితార్థం ప్రాంగణంలోనికి వివిఐపిలకు ప్రత్యేక ద్వారాన్ని ఏర్పాటు చేశారు. విలేకర్లను మాత్రం లోపలికి వెళ్లేందుకు అనుమతించడం లేదు.