గణేష్ నిమజ్జనోత్సవం సందర్భంగా ఆదివారం నగరంలోని పలు ప్రాంతాలలో ట్రాఫిక్
ఆంక్షలు విధిస్తూ నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
వినాయక విగ్రహాలు ఊరేగింపుతో వచ్చే ప్రధాన శోభాయాత్ర రహదారులన్నింటిని
మూసివేయనున్నారు. నగర వాసులు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారు ప్రత్యామ్నాయ
మార్గాలను ఎంచుకొని తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచించారు. ప్రధాన
ఉరేగింపు ర్యాలీ జరిగే రూట్‌లో ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సోమవారం ఉదయం 8
గంటల వరకు ఇతర వాహనాలకు అనుమతి లేదు, కేవలం వినాయక విగ్రహాలను నిమజ్జనానికి
తరలించే వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుందని ఆయన తెలిపారు.