దర్శకుడు రాజమౌళికి
బాలీవుడ్‌లో కూడా మంచి గుర్తింపు వుంది. ఆయన దర్శకత్వం వహించిన
విక్రమార్కుడు మర్యాద రామన్న చిత్రాలు హిందీలో పునర్నిర్మించబడి భారీ
విజయాల్ని సొంతం చేసుకున్నాయి. తాజాగా షాహిద్‌కపూర్ హీరోగా
సాజిద్‌నదియావాలా దర్శకత్వంలో మగధీర చిత్రాన్ని రీమేక్ చేస్తున్నారు.
ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో బాహుబలి చిత్రం తెరకెక్కుతున్న విషయం
తెలిసిందే. ఈ చిత్రాన్ని హిందీలో డబ్బింగ్ చేసి విడుదల చేసేందుకు సన్నాహాలు
చేస్తున్నారు.
ఇదిలావుండగా ఇటీవల ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమీర్‌ఖాన్ హీరోగా హిందీ చిత్రానికి దర్శకత్వం వహించే ఆలోచన వున్నట్లు రాజమౌళి వెల్లడించారు. హిందీ చిత్రాల్ని తక్కువగా చూస్తాను. అయితే అమీర్‌ఖాన్, దర్శకుడు రాజ్‌కుమార్‌హీరాని సినిమాలంటే నాకు చాలా ఇష్టం. భవిష్యత్తులో అమీర్‌ఖాన్ హీరోగా సినిమా చేయాలనే ఆలోచన వుంది. అందుకు ఆయన అంగీకరిస్తాడని ఆశిస్తున్నాను అని చెప్పారు రాజమౌళి.