‘మగధీర’ చిత్రంలో రాజకుమారి మిత్రవిందగా అందరినీ ఆకట్టుకొంది నటి కాజల్.
ఇప్పుడు ఈ భామ తన తరువాతి చిత్రం ‘సర్దార్ గబ్బర్‌సింగ్’లోనూ రాజకుమారిగా
కనిపించనుందట. కాజల్ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఈ విషయాన్ని తెలుపుతూ...
సర్దార్ సెట్‌లోని ఒక ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. సర్దార్ గబ్బర్‌సింగ్,
రాజకుమారి అర్షి అంటూ హ్యాష్‌టాగ్‌లు పెట్టారు.
కాజల్ తొలిసారి ఈ చిత్రంలో పవన్ కల్యాణ్‌కు జంటగా నటించారు. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ నెల 20న చిత్రం ఆడియో విడుదల వేడుకలను నిర్వహించనున్నారు. ఏప్రిల్ 8న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

No comments:
Post a Comment