Thursday, August 20, 2015

నార్వేలో శివమ్


           రామ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం శివమ్. శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై రవికిషోర్ నిర్మిస్తున్నారు. రాశిఖన్నా కథానాయిక. శ్రీనివాసరెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. టాకీ పార్ట్ పూర్తయింది. ప్రస్తుతం నార్వేలో పాటల చిత్రీకరణ జరుగుతోంది. ఈ సందర్భంగా రామ్ మాట్లాడుతూ ఇటీవల విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌కు మంచి స్పందన లభిస్తోంది. పవర్‌ఫుల్ యాక్షన్ అంశాలు మేళవించిన ప్రేమకథా చిత్రమిది. నా పాత్ర చిత్రణ గత చిత్రాలకు పూర్తి భిన్నంగా వుంటుంది అన్నారు. నార్వే, స్వీడన్‌లోని సుందరమైన లొకేషన్లలో పాటల్ని చిత్రీకరిస్తామని, వచ్చే నెలలో పాటల్ని విడుదల చేసి అక్టోబర్ 2న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకుతీసుకొస్తామని నిర్మాత తెలిపారు. దర్శకుడు మాట్లాడుతూ ఫ్యామిలీ సెంటిమెంట్, లవ్, యాక్షన్ అంశాలు మేళవించిన చిత్రమిది. స్క్రీన్‌ప్లే ప్రధానంగా సాగే ఈ చిత్రంలోని ప్రతి మలుపు ఆసక్తికరంగా వుంటుంది.