Sunday, December 23, 2012

వన్డే క్రికెట్‌కు సచిన్‌ గుడ్‌బై

 మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ వన్డే క్రికెట్‌కు గుడ్‌బై చెప్పారు. కొంతకాలంగా సచిన్‌ రిటైర్మెంట్‌పై చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన వన్డేలకు గుడ్‌బై చెప్పడం కూడా చర్చనీయాంశమైంది. వన్డేలకు గుడ్‌బై చెప్పినప్పటికీ, టెస్టుల్లో కొనసాగుతానని ఆయన తెలిపారు. టీమిండియా కెప్టెన్‌గా సచిన్‌ వ్యవహరించారు. సచిన్‌ 463 వన్డేల్లో 18,426 పరుగులు చేశారు. పాక్‌ సిరీస్‌కు ముందుగానే ఆయన వన్డేలకు ఆడనని రిటైర్మెంట్‌ చేయడం క్రికెట్‌ ప్రపంచంలో చర్చనీయాంశమైంది. వన్డేల్లో 49 సెంచరీలు, 96 హాఫ్‌ సెంచరీలు చేశాడు. వన్డేల్లో సచిన్‌ అత్యధిక స్కోరు 200 నాటౌట్‌గా ఉన్నాడు. వన్డేల్లో 154 వికెట్లు తీశాడు. వన్డేల్లో సచిన్‌ బ్యాటింగ్‌ సగటు 44.86గా ఉంది. సచిన్‌ తన కెరీర్‌లో తొలి, చివరి వన్డేలను పాకిస్థాన్‌పైనే ఆడారు. 23 ఏళ్ల వన్డే క్రికెట్‌కు ఆయన గుడ్‌బై చెప్పారు. వన్డేలకు సచిన్‌ గుడ్‌బై చెప్పిన మాట నిజమేనంటూ బీసీసీ సచిన్‌ రిటైర్మెంట్‌ను ధృవీకరించింది. వరల్డ్‌ కప్‌ గెలిచిన టీంలో ఉండడం తన అదృష్టమని సచిన్‌ చెప్పారు. వన్డేలకు గుడ్‌బై చెప్పిన మాట వాస్తమేనని ఆయన స్పష్టం చేశారు. టెస్టుల్లో కొనసాగుతానని సచిన్‌ ప్రకటించారు. తనకు అండగా నిలిచిన సహచరులు, బీసీసీఐ సభ్యులు, క్రికెట్‌ అభిమానులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. వన్డేలకు గుడ్‌బై చెబుతూ సచిన్‌ తీసుకున్న నిర్ణయం తనను ఆశ్చర్యానికి గురి చేసిందని మాజీ క్రికెటర్‌ శ్రీకాంత్‌ తెలిపారు. వన్డేల్లో ఎంతో ప్రతిభకనబర్చిన సచిన్‌ అందరికీ ఆదర్శప్రాయులని ఆయన కొనియాడారు.
అందరికీ కృతజ్ఞతలు : సచిన్‌
క్రికెట్‌లో ఇన్నేళ్లు తనను ప్రోత్సహించిన వారందరికీ సచిన్‌ కృతజ్ఞతలు తెలిపారు. రిటైర్మెంట్‌ ప్రకటించిన అనంతరం సచిన్‌ మీడియాతో మాట్లాడారు. టీమిండియా భవిష్యత్‌ ఉత్తమంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. 2015 ప్రపంచకప్‌కు ఇప్పటి నుంచే సన్నాహక ప్రక్రియ ప్రారంభించాలని టీంకు సూచించారు.

Friday, December 21, 2012

తెలుగు హీరోయిన్లులల్లో నెం1 హీరోయిను హ్యాపీబర్త్‌డే

తెలుగు హీరోయిన్లులల్లో నెంబర్‌ వన్‌ స్థానంలో ఉన్న తమన్న ఈ రోజు జన్మదిన శుభాకాంక్షలు. 


Sunday, November 4, 2012

శాండీ తుఫాన్ లో ఆర్తి అగర్వాల్

  అమెరికాలో శాండీ తుపాను బీభత్సం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. న్యూజెర్సీతో పాటు.. న్యూయార్క్‌, వాషింగ్టన్‌, ఫిలడెల్ఫియా రాష్ట్రాలు ఈ భీకర తుఫాన్ దెబ్బకు కుదేలయ్యాయి. న్యూయార్క్‌ సిటీ సగానికి పైగా నీటమునిగింది.
ఈ నేపధ్యంలో మన తెలుగు హీరోయిన్ ఆర్తి అగర్వాల్ ..శాండి తుఫానులో చిక్కుకుందనే వార్త అబిమానులను కలవరపెడుతోంది. అయితే శాండీ ఎఫెక్టు తో ఆర్తికి పెద్దగా నష్టమేమీ జరగలేదని సమాచారం. ఆమె బస చేస్తున్న మోటల్ తుఫాను తాడికికి చిక్కుకుంది. అక్కడ నుంచి అమెరికా పోలీసులు ఆర్తిని ఖాళీ చేయించారు. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా..ప్రస్తుతం ఆమెను అమెరికా న్యూ జర్శీలో గల ఓ సీనియర్ సిటిజన్ షెల్టర్ లో ఆశ్రయం పొందుతోంది అన్ని సమాచారం. ఒకప్పుడు చిరంజీవి, వెంకటేష్ లాంటి అగ్రహీరోలతో అవకాశాలు దక్కించుకున్న హీరోయిన్ ఆర్తి అగర్వాల్...ఆ తర్వాత ఫామ్ కోల్పోయిన పెళ్లి చేసుకుని కొంత కాలం సినిమాలకు దూరమైన సంగతి తెలిసిందే. అమెరికాలో భర్తతో ఇమడలేక మళ్లీ సినిమాల్లో నటించడానికి తిరిగి ఇండియాకు వచ్చిన ఆమెకు అంతగా కలిసి రాలేదనే చెప్పాలి. ప్రస్తుతం ఆమె అమ్మరాజశేఖర్ దర్శకత్వంలో ాముద్రః అనే చిత్రంలో నటిస్తోంది

Thursday, October 25, 2012

ఫైనల్లో ఢిల్లీ ...

ఛాంపియన్‌ లీగ్‌లో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ జట్టు లయన్స్‌పై ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి ఫైనల్‌ చేరుకుంది. టాస్‌ గెలిచి ఫీల్టింగ్‌ ఎంచుకున్న ఢిల్లీ జట్టు. లయన్స్‌ బ్యాటింగ్‌ల్లో బోడి 49 బంతులల్లో నాలుగు ఫోర్లు, ఒక సిక్స్‌ సహయంతో 50 పరుగులు చేశాడు. పీటర్స్‌న్‌ 24, కుక్‌ 11, ప్రీటోరిర్సు 3, సైముల్స్‌ 0 పరుగులు చేశారు. ఢిల్లీ బౌలింగ్‌లో యాదవ్‌ రెండు వికెట్లు, మోర్కెల్‌, అగ్కర్‌, నెగి చెరో వికెటు లభించింది. 140 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌ జట్టు ఐదు వికెట్లు తేడాతో ఘన విజయం సాధించింది. సెహ్వాగ్‌, వార్నర్‌ ఓపెనింగ్‌ ప్రారంభించారు. సెహ్వాగ్‌ 25 బంతులల్లో 41 పరుగులు చేశారు. మరో ఓపెనరు 20 పరుగులు చేసి అవుట్‌ అయ్యాడు. వన్‌డౌన్‌గా వచ్చిన పీటర్స్‌న్‌ కేవలం 10 పరుగులు చేసి నిరశపరిచాడు. చంద్‌ 30 , టేలర్‌ 10, పఠాన్‌ 35, ఓజా 10 పరుగులు చేశారు. మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ ఉమేష్‌ యాదవ్‌. హా... హా... హా...
        ఇది మొత్తం అబ్బధం ఇప్పుడు చెప్పేంది నిజం 


ఢిల్లీ జట్టు రెండు ఫార్మట్‌లో విఫలమైయింది. బౌలింగ్‌లో, బ్యాటింగ్‌లో రెండు విదాలుగా నిరశపరిచారు. అలాగే ఫీల్గింగ్‌లో చాలా క్యాచ్‌లు మిస్‌ చేశారు. ఢిల్లి జట్టు బలం, బహీనత రెండు మిస్‌ చేశారు. ఒక సారి కూడా ఫైనల్‌ చేరుకోలేదు. ఇది విశేషం. ఢిల్లీ బ్యాటింగ్‌లో సెహ్వాగ్‌, పీటర్స్‌న్‌, టేలర్‌, ఇర్ఫాన్‌ పఠాన్‌, నమన్‌ ఓజా, చంద్‌, జయవర్థన్‌, వార్నర్‌ వీరి పేర్లు వినడమే తప్ప చేతుల్లో చూప్పడం లేదు.





ముఖ్యంగా చెప్పడం మారిపోయా. ( ఉమేష్‌ యాదవ్‌ జన్మదిన శుభాకంక్షాలు )

              happy birthday

Tuesday, October 23, 2012

దసరా శుభాకాంక్షలు

                    దసరా శుభాకాంక్షలు



Sunday, October 21, 2012

బాలీవుడ్ డైరెక్టర్ యశ్‌చోప్రా కన్నుమూత

బాలీవుడ్ డైరక్టర్ యశ్‌చోప్రా (80) కన్నుమూశారు. డెంగ్యూ జ్వరంతో లీలావతి ఆస్పత్రిలో గత వారం రోజులుగా చికిత్స పొందుతూ ఈ సాయంత్రం మృతి చెందారు. యాశ్‌చోప్రా 1932 సంవత్సరంలో లాహోర్‌లో జన్మించారు. 1973లో యశ్‌రాజ్ ఫిల్మ్ సంస్థను స్థాపించారు. ఈ సంస్థ ఆధ్వర్యంలోనే దాదాపు 50 చిత్రాలకు దర్శకత్వం వహించారు. 2001 సంవత్సరంలో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్నారు. 2005లో భారత ప్రభుత్వం చలన చిత్ర రంగానికి చేసిన సేవకు గుర్తింపుగా చోప్రాను పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది.

Saturday, October 20, 2012

అల్లు అర్జున్ భార్యకు గాయాలు

  హైదరాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో సినీ హీరో అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి స్వల్పంగా గాయపడ్డారు. ఆమెను సోమాజిగూడ యశోద ఆసుపత్రికి తరలించారు. ఆమె ఆరోగ్యపరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

Sunday, October 7, 2012

టీ20 ప్రపంచకప్‌ వెస్టిండీస్‌ విజేత

చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న టీ20 ప్రపచంకప్‌ వెస్టిండీస్‌ సొంతం చేసుకుంది. అటు బ్యాటింగ్‌లో ఇటు బౌలింగ్‌ రాణించిన వెస్టిండీస్‌ అటగాళ్లు టైటిల్‌ సొంతం చేసుకున్నారు. లంక చివరి వరకు ప్రయత్నించి ఓడిపోయింది. గ్రూప్‌-1 నుంచి ఫైనల్లో లంక, వెస్టిండీస్‌ రావడం విశేషం. గ్రూప్‌-2 ఆస్ట్రేలియా, భారత్‌, దక్షిణాఫ్రికా, పాస్తాన్‌ బలమైన జట్టు ఉన్నాయి. చివరి గ్రూప్‌-1 నుంచి టైటిల్‌ సొంతం చేసుకుంది. ఇప్పటికి ఇది నాల్గొవ టీ20 ప్రపంచకప్‌.

1 ) భారత్‌ 

2 ) పాకిస్తాన్‌ 
3 ) ఇంగ్లాండ్‌ 
4 ) వెస్టిండీస్‌ 

ఇలా ప్రతి సారి ఒక్కొక్క జట్టు టైటిల్‌ సొంతం

Friday, October 5, 2012

టీ20 ప్రపంచకప్‌ టైటిల్‌ వెస్టిండీస్‌

చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న టీ20 ప్రపచంకప్‌ వెస్టిండీస్‌ సొంతం చేసుకుంది. అటు బ్యాటింగ్‌లో ఇటు బౌలింగ్‌ రాణించిన వెస్టిండీస్‌ అటగాళ్లు టైటిల్‌ సొంతం చేసుకున్నారు. లంక చివరి వరకు ప్రయత్నించి ఓడిపోయింది. గ్రూప్‌-1 నుంచి ఫైనల్లో లంక, వెస్టిండీస్‌ రావడం విశేషం. గ్రూప్‌-2 ఆస్ట్రేలియా, భారత్‌, దక్షిణాఫ్రికా, పాస్తాన్‌ బలమైన జట్టు ఉన్నాయి. చివరి గ్రూప్‌-1 నుంచి టైటిల్‌ సొంతం చేసుకుంది. ఇప్పటికి ఇది నాల్గొవ టీ20 ప్రపంచకప్‌.
1 ) భారత్‌2 ) పాకిస్తాన్‌3 ) ఇంగ్లాండ్‌4 ) వెస్టిండీస్‌ఇలా ప్రతి సారి ఒక్కొక్క జట్టు టైటిల్‌ సొంతం చేసుకుటుంది.
టీ20 ప్రపంచకప్‌

Thursday, October 4, 2012

టీ20 ప్రపంచకప్‌లో ఫైనలో లంక, వెస్టిండీస్‌

కొలంబొ : టీ20 ప్రపంచకప్‌ ఫైనలో లంక, వెస్టిండీస్‌ చేరుకున్నాయి. సెమీఫైనలో లంక, పాకిస్తాన్‌పై 16 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనలో అడుగుపెట్టింది. రెండో సెమీఫైనలో ఆస్ట్రేలియాపై వెస్టిండీస్‌ నాలుగు వికెట్ల తేడాతో విజయ సాధించి పైనలో చేరుకుంది. ఈ రెండు జట్లు గ్రూప్‌-1 నుంచి రావడం విశేషం. టీ20 ప్రపంచకప్‌ ఇప్పటి వరకు రెండు జట్లు ఒక సారి కూడా టైటిల్‌ కూడా సాధించలేకపోయింది. మరి ఫైనలో విజయం ఎవరిదో వెచ్చి చూడాలి...?

Tuesday, October 2, 2012

సూపర్‌ ఎయిట్‌ నుంచి భారత్‌ ఔట్‌ ... ?

టీ 20 ప్రపంచకప్‌లో భారత్‌ సూపర్‌ ఎయిట్‌ నుంచి భారత్‌ ఔట్‌గా ప్రకటించన్నుంది. ఈ రోజు జరగనున్న మ్యాచ్‌లో భారత్‌ 120 పరుగులకు అలౌట్‌ అయ్యింది. చివరి మ్యాచ్‌లో గెలిచి సెమీస్‌ ఆవకాశం కోసం తహతహలాడుతున్న భారత్‌ ఇంటి దారి తప్పలేదు. గ్రూప్‌ -2 నుంచి సెమీస్‌లో ఆస్ట్రేలియా, పాకిస్థాన్‌ గ్రూప్‌ -1 నుంచి లంక, వెస్టిండీస్‌ జట్టు వెళ్లనున్నాయి.
సెమీస్‌లో
ఆస్ట్రేలియా - వెస్టీండీస్‌
లంక - పాకిస్థాన్‌
ఫైనల్‌లో

Monday, October 1, 2012

టీ 20 ప్రపంచకప్‌లో సెమీఫైనలో ఇప్పటి వరకు ఏది జట్లు రాలేదు ... ?

 టీ 20 ప్రపంచకప్‌లో సెమీఫైనలో ఇప్పటి వరకు 12 జట్లు ఉన్నాయి. కాని ఇప్పటికి వరకు ఒక జట్టు కూడా సెమీఫైనలో అడుగుపెట్టలేదు. గ్రూప్‌-1 నుంచి ప్రస్తుతం ఆస్ట్రేలియా సెమీఫైనల్‌ అర్హత ఉంది. కాన్నీ భారత్‌, పాక్తిస్థాన్‌ జట్లు మధ్య పోరు ఉంటుంది. రేపు జరగబోయా మ్యాచ్‌ తుది ఫోరు జరగన్నుంది. గ్రూప్‌ -2లో శ్రీలంక, వెస్టిండీస్‌ సెమీఫైనలో స్థానం దక్కించుకుంది. ఇప్పుడు జరగబోరు మ్యాచ్‌ లంక, ఇంగ్లాండ్‌ జరగన్నుంది. లంకపై ఇంగ్లాండ్‌ భారీ తేడాతో గెలిస్తే గ్రూప్‌-2 నుంచి లంక, వెస్టిండీస్‌, ఇంగ్లాండ్‌ మూడు జట్ల మద్య పోటీ పడుతుంది. రన్‌రేట్‌ ప్రకారం రెండు జట్లు సెమీఫైనలో చేరుకుంటాయి. ఇంకా గ్రూప్‌ -1 నుంచి ఆస్ట్రేలియా నాలుగు పాయ్లింట్‌ ఉంది. భారత్‌, పాకిస్థాన్‌ రెండు పాయ్లింట్‌తో ఉంది. రేపు జరగబోరు మ్యాచ్‌లో పాకిస్థాన్‌, ఆస్ట్రేలియా మధ్య రసవత్తమైన మ్యాచ్‌ జరగన్నుంది. అలాగే భారత్‌, దక్షిణాఫ్రికా మధ్య జరిగబోరు మ్యాచ్‌ కూడా కీలకం మారనుంది. ( ఒక వేళ భారత్‌పై దక్షిణాఫ్రికా భారీ తేడాతో ఘన విజయం సాధించినచో భారత్‌ ఇంటి దారి తప్పదు. ) ఆస్ట్రేలియాపై పాకిస్థాన్‌ భారీ వికెట్ల తేడాతో గెలిచినచో ఆస్ట్రేలియా సెమీఫైనలో ఔట్‌గా ప్రకటించనుంది. గ్రూప్‌-1 నుంచి రేపు జరగబోరు మ్యాచ్‌ చూసి సెమీఫైన జట్లు ఖారారు చేయన్నుంది.

Saturday, September 29, 2012

భారత జట్టులో ఒకరిని చూస్తే భయం, భక్తి అలాగే గౌరవం కూడా ...

 భారత జట్టులో ఒకరిని చూస్తే అందరికి భయం, భక్తి అలాగే గౌరవం కూడా. అది ఎవరో కాదు వీరేంద్ర సెహ్వాగ్‌ ). భారత జట్టులో ఇతను ఉంటే అందరికి భయం.
ఉదా :
నిన్న జరిగిన మ్యాచ్‌ల్లో సెహ్వాగ్‌ లేడు. అతనికి చేతి వేలికి గాయం కారణంగా జట్టులో స్థానం కల్పించలేదు. అదే ఇతను ఉంటే మాత్రం ఎంతో కొత్త స్కోరు చేసి ఉండేవాడు కదా ?

భారత జట్టులో ఒకరిని చూస్తే భయం, భక్తి అలాగే గౌరవం అని చెప్పాను కదా. అది సెహ్వాగ్‌ బ్యాటింగ్‌ చేస్తే ఉంటే అందరి చూస్తు ఉండి పోతారు. క్రీజులో ఉన్నంత వరకు వీరేంధ్రుడి ఎప్పుడు అవుట్‌ అవుతాడు అని ఎదురు చూస్తారు. ఇదే భయం, భక్తి, అలాగే గౌరవం. నిన్న జరిగిన మ్యాచ్‌లో దోని ప్రయత్నాలు విఫ్లమయ్యాయి. సూపర్‌ ఎయిట్‌లో కనిసం ఒక మ్యాచ్‌ గెలిచిన తరువాత ప్రయత్నాలు జరపాలి. అలా కాకుండా ముందే ప్రయత్నాలు జరపారాదు.

సూపర్‌ ఎయిట్‌ నుంచి భారత్‌ ఔట్‌ ... ?

టీ 20 ప్రపంచకప్‌లో భారత్‌ సూపర్‌ ఎయిట్‌ నుంచి వైదొలగింది. సూపర్‌ ఎయిట్‌లో భారత్‌, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, పాకిస్థాన్‌ నాలుగు జట్లు ఉన్నాయి. పాకిస్థాన్‌, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌ రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. పాకిస్థాన్‌ మరో మ్యాచ్‌ గెలిస్తే సెమిఫైనల్‌ చేరుకుంటుంది. అలాగే భారత్‌, ఆస్ట్రేలియా మ్యాచ్‌లో ఆస్ట్రేలియా తొమ్మిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇప్పటికి గ్రూప్‌-1 నుంచి పాకిస్థాన్‌, ఆస్ట్రేలియా చెరో రెండు పాయింట్లు ఉన్నాయి. సౌతాఫ్రిపై పాకిస్థాన్‌ గెలిచింది అంటే నమ్మడం తక్కువ. భారత్‌ సెమిఫైనల్‌ వెళ్లడం దురదుష్టం. ఇంకా రెండు మ్యాచ్‌లు ఉన్నాయి. ఒక్కటి పాకిస్థాన్‌, మరోకటి సౌతాఫ్రికా రెండు టఫ్‌ మ్యాచ్‌ ఉన్నాయి. ఈ రెండు మ్యాచ్‌ గెలిచిస్తే సెమిఫైనలో స్థానం దక్కుతుంది.

Wednesday, September 19, 2012

టీ 20 వరల్డ్‌కప్‌లో భారత్‌ తొలి అడుగు

 టీ 20 వరల్డ్‌కప్‌ రెండో రోజు భారత్‌ 23 పరుగులు తేడాతో విజయం సాధించింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌ దిగిన భారత్‌ 20 ఓవర్లల్లో ఐదు వికెట్ల నష్టానికి 159 పరుగుల సాధించింది. కోహ్లీ 50, రైనా 38, యువరాజ్‌ సింగ్‌ 18 పరుగులు చేశారు. ధోని 18, శర్మ 1 పరుగులతో నాటౌట్‌గా ఉన్నారు. 160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆప్ఘనిస్తాన్‌ 136 పరుగులకు అలౌట్‌ అయ్యింది. మ్యాన్‌ అప్‌ ది మ్యాచ్‌ కోహ్లీ ఎంపికయ్యాడు.

Tuesday, September 18, 2012

Sunday, August 26, 2012

హైదరాబాద్‌ టెస్ట్‌లో భారత్‌ ఘనవిజయం

 ఉప్పల్‌ స్టేడియంలో జరుగుతున్న భారత్‌ - న్యూజిలాండ్‌ జట్ల మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్‌ మ్యాచ్‌లో భారత్‌ ఘన విజయం సాధించింది. కివీస్‌ ఇన్నింగ్‌ఇ్స 115 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. ఫాలో ఆన్‌ ఆడిన న్యూజిలాండ్‌ భారత స్పిన్నర్ల ధాటికి రెండో ఇన్నింగ్స్‌లో 164 పరుగులకు అలౌటయ్యింది. నాలుగు రోజుల్లోనే ఫస్ట్‌ టెస్ట్‌ ముగిసింది. టెస్ట్‌ సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో భారత్‌ విజయం సాధించింది. మెక్‌ కల్లమ్‌ (52), విలియమ్సన్‌ 42, మాత్రమే రాణించారు. భారత్‌ బౌలర్లలో అశ్విన్‌ అద్భుతంగా బౌలింగ్‌చేసి 6 వికెట్లు నేలకూల్చాడు. ఓజా 3 వికెట్లు పడగొట్టాడు. యాదవ్‌ ఒక వికెట్‌ తీశాడు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 438 పరుగులు, కివీస్‌ 159 పరుగులు చేసింది. రెండో టెస్ట్‌ ఈనెల 31ను ఆహ్మదాబాద్‌లో రెండో టెస్ట్‌ ప్రారంభం కానుంది.

Saturday, August 18, 2012

అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెబుతున్నా : లక్ష్మణ్‌

  అంతర్జాతీయ క్రికెట్‌కు హైదరాబాద్‌కు చెందిన భారత క్రికెటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ గుడ్‌బై చెబుతున్నట్లు ప్రకటించారు. ఉప్పల్‌లోని హెచ్‌సీఏ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించనందుకు అదృష్టంగా భావిస్తున్నానన్నారు. క్రికెట్‌ ద్వారా దేశానికి సేవ చేసే అవకాశం లభించిందన్నారు. 16 ఏళ్లపాటు క్రికెట్‌కు సేవలందించినందుకు గర్వకారణంగా ఉందన్నారు. 134 టెస్టుల్లో 8781 పరుగులు, 17 శతకాలు, 56 అర్ధ సెంచరీలు, 86 వన్డేల్లో 2338 పరుగులు, 6 సెంచరీలు, 10 అర్ధ సెంచరీలు చేశాడు. ఆసీస్‌పై ఈనెన్‌ గార్డెన్స్‌లో అత్యధిక స్కోర్‌ 281 పరుగులు చేశాడు. 2010లో పద్మశ్రీ పురస్కారం అందుకున్నాడు. యువతకు అవకాశం కల్పించేందుకే రిటైర్మెంట్‌ అవుతున్నానని చెప్పారు. లిటిల్‌ ఫ్లవర్‌ స్కూల్‌ ఉపాధ్యాయులు, మిత్రుల ప్రోత్సాహంతోనే ఇంతటి వాడినయ్యానని అన్నారు. డర్బన్‌లో దక్షిణాఫ్రికాపై విజయం మరవలేనిదని గుర్తుచేశారు. తన ప్రతిభను గుర్తించిన హెచ్‌సీఏకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Friday, July 20, 2012

మహేష్ కూతురికి పేరు పెట్టిన రాజమౌళి!

సూపర్ స్టార్ మహేష్ బాబు-నమ్రత దంపతులు శుక్రవారం ఉదయం పండంటి పాపకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దర్శకుడు రాజమౌళి మహేష్ బాబు దంపతులకు విష్ చేశారు. అంతే కాదు ఈ సందర్భంగా ఆయన మహేష్ ఇంట పుట్టిన లిటిల్ ఏంజల్ కోసం ఓ పేరు కూడా సూచించారు.

ఆయన సూచించిన పేరు ాసితారః. మరి ఈ పేరుపై పాపాయిని రాజమౌళి ముద్దుగా పిలుచుకుంటున్నారా...? లేక మహేష్ బాబు మనసులో ఉన్న ఆలోచనను ఈ విధంగా బయట పెట్టారా? అనేది తేలాల్సి ఉంది. మహేష్ బాబుకు చాలా దగ్గరి స్నేహితుల్లో రాజమౌళి ఒకరు. తరచూ ఆయన్ను ఈయన..ఈయన్ను ఆయన పొగుడుకుంటుండం మనం చూస్తూనే ఉన్నాం. ఆచొరవతోనే రాజమౌళి మహేష్ కూతురికి పేరు పెట్టినట్లు తెలుస్తోంది.

ఇక మహేష్ బాబు పాపాయి విషయానికొస్తే... నమ్రత ప్రసవించిన స్వప్న నర్సింగ్ హోం డాక్టర్ మీడియాతో మాట్లాడుతూ తల్లి బిడ్డలు ఆరోగ్యంగా ఉన్నారని, కాన్పు జరిగే సమయంలో మహేష్ భార్య పక్కనే ఉన్నాడని చెప్పారు. మహేష్ బాబు బంధువులు, స్నేహితులు ఆసుపత్రికి ముందుగానే చేరుకున్నారని, మహేష్ బాబు తనయుడు గౌతం కూడా ఉదయం నుంచి ఆసుపత్రిలోనే ఉన్నారని, తన చిట్టి చెల్లి చూసి మురిసి పోయాడని వెల్లడించారు.

Tuesday, May 29, 2012

క్యాన్సర్‌ను జయించారు వీళ్లు ...

 యువరాజునూ మార్చేసింది
గౌతమి రొమ్ము క్యాన్సర్‌
యుపిఎ అధినేత్రి సోనియాగాంధీ 
నెల్సన్‌ మండేలా 
సినీ నటి లీసారే  











http://www.prajasakti.com/coverstory/article-354838

'మగధీర', 'సింహ', 'యమదొంగ', సినామాల్లో హీరోగా నటించాను నేను ...

 ' దూకుడు ' సినిమాలో చేసిన క్యారెక్టర్‌ నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. శ్రీనువైట్ల గారు నా పాత్ర గురించి చెప్పిన వెంటనే నేను చాలా హ్యాపీగా ఫీలయ్యాను. 'మగధీర', 'సింహ', 'యమదొంగ', సినామాల్లో హీరో డైలాగుల్ని నాతో చెప్పించారు. థియేటర్‌లో ప్రేక్షకులు చూసిన ఆనందం చూసి సంతోషిచానాన్ను . అంతక ముందు చాలా సినిమాలో చేశాను. ఈ సినిమాలో చూసిన ఆనందం అంత ఇంత కాదు. ' మా నాన్న కు పెళ్లి', ' రామచక్కనోడు', ' సర్దుకుపోదాం' సినిమాలు నాకు నంది అవార్డుల్ని తెచ్చిపెట్టాయి.
http://www.prajasakti.com/cinema/article-354601

Sunday, May 27, 2012

ఐపీఎల్‌-5 విజేత కోల్‌కతా

ఐపీఎల్‌-5 విజేతగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఆవిర్భవించింది. చైన్నై సూపర్‌కింగ్స్‌పై కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 190 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా అదిలోనే ఓపెనరు గంభీర్‌ వికెటు కోల్పోయిడు. కానీ మరో ఓపెనర్‌ బిస్లా దిటుగా అడాడు. బిస్లా 89, కల్లిస్‌ 69, శుక్లా 3, యుసుఫ్‌ పఠాన్‌1 పరుగులు చేశారు. ఆఖర్లో షకిబుల్‌ 11, తివారీ 9 లాంఛనాన్ని పూర్తి చేశారు. చైన్నై బౌలింగ్‌లో హిల్ఫెనాస్‌ 2, మోర్కెల్‌, అశ్విన్‌, బ్రావో చెరో వికెటు లభించింది. అంతక ముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న చెన్నై జట్టు 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. హస్సీ 54, విజరు 42, సురేష్‌ రైనా 73 పరుగులు చేశారు. కోల్‌కతా బౌలింగ్‌లో షికిబుల్‌, కల్లిస్‌, భాటియా తలో వికెటు తీశారు.

జగన్మోహన్‌రెడ్డి అరెస్టు

హైదరాబాద్‌ : అక్రమాస్తుల కేసులో కడప ఎంపీ, వెైఎస్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వెైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిని సీబీఐ అరెస్టు చేసింది. ఐపీసీ 120బి, 420, 409, 477-ఏ సెక్షన్‌ అవినీతి నిరోధక చట్టం 13-1 సీ మరియు డీ సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తూ జగన్‌ను ఎ-1గా సీబీఐ పేర్కొంది. మూడో రోజు విచారణ అనంతరం సీబీఐ అరెస్టు చేయడం జరిగింది. ఎంపీ సబ్బం హరి, జూపూడి ధ్రువీకరించారు. ఆస్తుల అరెస్టు కేసులో జగన్‌ది ఐదో అరెస్టు. సీబీఐ అధికారులు రేపు జగన్‌ను సీబీఐ కోర్టులో హాజరుపర్చనున్నారు. మూడో రోజు అరెస్టు తర్వాత జగన్‌ను సీబీఐ అరెస్టు చేసింది.

Saturday, May 26, 2012

ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌ జట్టులో ఏదో తప్పు జరిగింది. ... ?

 ఐపీఎల్‌ -5లో భాగంగా ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌ జట్టులో ఏదో తప్పు జరుగుతుంది. అదే ఏమిటి అంటే చివరి రెండు మ్యాచ్‌లో ఓడిపోవడం. చూశారా చివరి రెండు మ్యాచ్‌లో ఘోరంగా ఓడిపోవడం ఎంత తెలిగా జరిగింది. చివరి రెండు మ్యాచ్‌లు ఒకటి గెలిచినా ఫైనలో వెళ్లెంది. కాని ఒక మ్యాచ్‌ కూడా గెలవలేదు. చివరి రెండు మ్యాచ్‌లో వార్నర్‌, సెహ్వగ్‌ ఇద్దరు కావాలనే అవుట్‌ అయ్యారు. కాని ఇందులో మహేల జయవర్ణన్‌ రెండు మ్యాచ్‌లో అర్థసెంచరీ చేశాడు.
కాని చివరికి టైటిల్‌ చెన్నైకా కొల్‌కతా ... ?
( టైటిల్‌ చివరికి మీకా, మాకా అని ఘర్షనా జరుగుతుంది. ) 
 మనీ మోర్‌ ఎవరు ఎక్కువ ఇసై వాళ్లకే టైటిల్‌ ... ?
చెన్నై జట్టు పైనల్‌కు వెళ్లె పరిస్థితి తాడో పేడో తెలుచుకోవాల్సిన పరిస్థితిలో ఉన్న సమయంలో డెక్కన్‌ ఛార్జర్‌ జట్టు రాజస్థాన్‌ రాయల్స్‌, బెంగుళూరు రాయల్స్‌ జట్టు రెండు మ్యాచ్‌లో గెలిచి డెక్కన్‌ చార్జర్స్‌ గెలిచి ఫైనలో చెన్నై జట్టును పంపించింది. చూశారు ఎంత తెలివిగా జరిగింది. కాని ఇది చూసేవారికి ఇది నిజం అనుకుంటారు.

Friday, May 25, 2012

8 గంటలకు పైగా విచారణ చివరికి ఏమిటి ... ?

 దిల్‌కుషా అతిధి గృహంలోని సీబిఐ కార్యాలయంలో కడప ఎంపీ. జగన్‌ వివచారణ ఈరోజు ప్రారంభంమైయింది. వాన్‌పిక్‌ ప్రాజెక్టుకు సంబంధించి విచారించేందుకు జగన్‌ను పిలిపించిన సీబీఐ. ఇప్పటికే అరెస్టు కస్టడీలో ఉన్న నిమ్మగడ్డ ప్రసాద్‌, బ్రహ్మనందరెడ్డి, మోపిదేవి వెంకటరమణలతో కలిపి జగన్‌ను విచారిస్తున్న సీబీఐ. సాయంత్రం 7 గంటలవరకూ విచారణ కొనసాగిపు. అన్ని ఏర్పాటు అక్కడే చేశారు. రేపు కూడా సీబీఐ జగన్‌ను ప్రశ్నించే అవకాశం ఉంది.
వేర్వేరు గదుల్లో విచారణ ఎందుకు ... ?
జగన్‌, మోపిదేవి, నిమ్మగడ్డ, బ్రహ్మానందంరెడ్డిలను సీబీఐ వేర్వేరు గదుల్లో విచారిస్తుంది. ఎందుకు అన్ని వేర్వేరు గదుల్లో విచారణ. ఒకే చోట విచారణ లేదా ? అలా విచారిస్తే ఏమవుతుంది.  

రేపు మళ్లీ విచారణకు రమ్మన్నారని జగన్‌ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. సీబీఐ అడిగిన ప్రశ్నలన్నింటికి సమాధానం చెప్పానన్నారు. రేపు 10.30 గంటలకు జగన్‌ విచారణకు హాజరు అవుతారు.
 

దరువు రివ్వూ

                                  దరువు రివ్వూ 

Thursday, May 24, 2012

పైనల్‌లో మళ్లీ నేనే

ఐపీఎల్‌-5లో భాగంగా క్వాలిఫైర్‌-2లో ఫైనలో మళ్లీ నేనే గెలిచి పైనలో వెళ్తుతాను. ఈ రోజు జరిగే ఫైనలో ఢిల్లీపై గెలిచి ఫైనలో కొల్‌కతాతో ఢ. ఎంత ఆశా కెప్టెన్‌ ధోనికి మళ్లీ గెలిచి హ్యాట్రిక్‌ కొట్టి కప్‌ గెలిచితీరుతామాన్ని ధీమా. కానీ ఎవరోఒకరు చెన్నై చిత్తు చిత్తుగా ఓడించి కప్‌ మాత్రం కొల్‌కతా లేదా, ఢిల్లీ దక్కుతుంది. ఇది మాత్రం నిజం.

Wednesday, May 23, 2012

వివాదాల క్రికెట్‌ లీగ్‌

  ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో ఇటీవల వెలుగు చూస్తున్న వివాదాలను విస్తుపోయేలా చేస్తున్నాయి. 2008లో పరిమిత ఓవర్లలో ఐపిఎల్‌ అట్టహాసంగా ఆరంభమైంది. తొలి ఐపిఎల్‌ ప్రారంభమూ క్రికెట్‌ అభిమానుల క్రీడానందానికి పర్యాయపదమా అన్న భావన కలిగించింది. కానీ ఒక దాని వెంట ఒకటిగా వివాదాలు తన్నుకొస్తున్న తీరు అన్ని వర్గాలనూ నీరసింపజేస్తోంది. ఒక్క మాటలో వినోదానికి డబ్బు జబ్బు తోడైతే ఏం జరుగుతుదో అదే జరుగుతోంది. ముఖాముఖి ముష్టిఘాతాలకు సిద్ధపడే ఫ్రాంచైజీలు, పంతాలతో మైదానంలోనే పరస్పర దూషణ-భాషణాలకు దిగబడే ఆటగాళు ్ల అన్నిటిని మించి మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలు ఐపిఎల్‌ ప్రతిష్టను మసకబారుస్తున్నాయి.ఐపిఎల్‌ల్లో చోటు చోసుకున్న ప్రధాన వివాదాలు పరిశీలిస్తే...
స్పాట్‌ ఫిక్సింగ్‌ : ఐపిఎల్‌ ప్రతిష్టకు మొదటి గండం మ్యాచ్‌ ఫిక్సింగ్‌ రూపంలో ఎదురైంది. ఒక ప్రైవేటు టివి ఛానలు నిర్వహించిన అపరాధపరిశోధనలో ఐపిఎల్‌ అటగాళ్లు మైదానం వెలుపల డబ్బుకు అమ్ముడుపోయారని తేలింది. జట్ల యాజమాన్యాలకు ఇందులో భాగస్వామ్యం ఉందని, ఫ్రాంఛైజీలు తక్కువ తినలేదని తేల్చింది. సదరు మీడియా సంస్థ విడుదల చేసిన వీడియోలో మ్యాచ్‌ మధ్యలో నోబాల్‌ వేసే అంశంపై ఆటగాళ్లు చర్చలు జరపడం ఉంది. దీనితో ప్రమేయమున్న ఐదుగురు ఆటగాళ్ల మీద వేటు వేస్తూ ఇండియన్‌ క్రికెట్‌ బోర్డ్‌ కఠినంగా వ్యవహరించింది. కాగా ఈవివాదంపె దర్యాప్తు జరిపి 15 రోజుల్లోగా సమగ్ర నివేదికను అందజేసే బాధ్యతను బిసిసిఐ అవినీతి వ్యతిరేక విభాగ అధిపతి రవి సవానీకి అప్పగించారు.

లలిత్‌ మోడీ ఉద్వాసన : ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ ఏర్పాటుకు సూత్రధారి లలిత్‌మోడీ అన్న సంగతి తెలిసిందే. ఆర్ధిక అవకతవకలకు పాల్పడిన అభియోగంతో పాటుగా బెట్టింగు, మనీ లాండరింగు వంటి తీవ్ర అబియోగాలు వెలుగు చూడటంతో 2010లో ఐపిఎల్‌ ఛైర్మన్‌ పదవి నుంచి లలిత్‌ మోడీకి ఉద్వాసన పలికారు. ఒక రకంగా మోడీ తన ఉద్వాసనకు తనే బీజాలు వేసుకున్నాడని చెప్పాలి. ఐపిఎల్‌లోకి కొత్తగా ప్రవేశించిన కొచ్చి టస్కర్స్‌ కేరళ రహస్య ఒప్పందాలను ఉల్లంఘించిందంటూ తన ట్విటర్‌లో ఆయన స్వయంగా రాసుకున్న అంశాలే తుదకు ఉద్వాసనకు దారి తీశాయి. నాటి విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి డాక్టర్‌ శశిథరూర్‌ పదవికి ఎసరు తెచ్చాయి. ఇంత జరిగినా తప్పేమీ జరగలేదంటూ మోడీ వితండ వాదన కొనసాగించడం విశేషం.


ముష్టిఘాతాలు : ఐపిఎల్‌ ఆరంభం ఎంత ఘనంగా ప్రారంభమైందో అంతే శీఘ్రంగా వివాదాలను నమోదు చేసుకుంది. ఏప్రిల్‌ 25న కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ జట్టులోని ఆటగాడు ఎస్‌ శ్రీశాంత్‌ను ముంబయి ఇండియన్స్‌ ఆటగాడు హర్జజన్‌సింగ్‌ లాగి లెంపకాయకొట్టాడు. వరుసగా మూడు వికెట్లు కోల్పోయిన దశలో దురదృష్టమంటూ హర్భజన్‌ను అనడమే శ్రీశాంత్‌ తప్పిదంగా తుదకు తేలింది. వీడియోక్లిప్పింగుల పరిశీలన అనంతరం హర్భజన్‌ సింగ్‌ను తొలి ఐపిఎల్‌లో జరగాల్సిన 11 మ్యాచ్‌ల్లో ఆడటానికి వీల్లేదంటూ సస్పెండ్‌ చేశారు.

షారుఖ్‌ జగడం : ఇక తాజా వివాదం బాలీవుడ్‌ స్టార్‌ షారుఖ్‌ ఖాన్‌ది. కొల్‌కత నైట్‌ రైడర్స్‌కు షారుఖ్‌ సహ యజమానిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈనెల 16న ముంబయి ఇండియన్స్‌ జట్టు మీద తన జట్టు గెలుపొందిన తరువాత ఈ జగడం చోటు చేసుకుంది. ముంబయి క్రికెట్‌ అసొసియేషను అధికారులో షారుఖ్‌ ముఖాముఖి తలపడినట్లుగాను దుర్భాషలాడినట్లుగాను సమాచారం. మ్యాచ్‌ జరిగే సమయంలో వాస్తవానికి షారుఖ్‌ స్టేడియంలోనే లేడు. ఆట ముగిశాక ఆటను తిలకించే తనకుమార్తెను తీసుకు వెళ్లేందుకు స్టేడియానికి వచ్చాడు. పనిలో పనిగా ఆటగాళ్లను అభినందించాడు. అంతే అక్కడి భద్రత సిబ్బందితో జగడం మొదలైంది. దీనిపై షారుఖ్‌ మీద ఎఫ్‌ఐఆర్‌ కూడా నమోదైంది. తన కుమార్తె కూడా ఉన్న పిల్లల బృందం మీద స్టేడియం భద్రత సిబ్బంది బలప్రయోగానికి దిగారనేది షారుఖ్‌ వాదన. ఫిర్యాదు తదితర అంశాలను పరిశీలించిన తరువాత షారుఖ్‌ను ఐదేళ్లపాటు ఎంసిఎలో ప్రవేశించకుండా నిషేదం విధిస్తున్నట్లు ఎంసిఎ అధ్యక్షుడు విలాస్‌రావ్‌ దేశ్‌ముఖ్‌ ప్రకటించారు. ఎంసిఎ పాలక మండలిలో షారుఖ్‌ ఖాన్‌ స్వయంగా సభ్యుడు కావడం విశేషం.

అత్యాచార అభియోగం : రాయల్‌ ఛాలంజర్స్‌ బెంగళూరు జట్టులోని ల్యూక్‌ పోమర్స్‌బాచ్‌ మీద అత్యాచార అభియోగం నమోదైంది. భారత సంతతి అమెకన్‌ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన అభియోగంపై పోమర్స్‌బాచ్‌ను శుక్రవారం అరెస్టు చేశారు.


విందు విలాసాలు : ఐపిఎల్‌లో మ్యాచ్‌ ముగిసాక జరిగే విందులు విలాసాలకు ఒకప్రత్యేకత వుంది. ఏమిటంటారా ..హద్దుపద్దూ లేకుండా పెచ్చరిల్లడమేనని చెప్పవచ్చు. విందులో పాల్గొనే ఏ ఆటగాడినైనా లేదా ఏ బాలీవుడ్‌ నటుడితోనైనా కరచాలనం చేయవచ్చు. దీనికి భిన్నమైన కథనం దాగుందని దక్షిణాఫ్రికాకు చెందిన ఛీర్‌లీడర్‌ తన బ్లాగులో పేర్కొనే వరకు సమాజానికి తెలయదు. 2011లో ఒక పార్టీ అనంతరం ఛీర్‌ లీడర్లను నడిచే శృంగార భామలుగానూ క్రికెటర్ల హద్దులు దాటిన ప్రవర్తనను గేబ్రియల్ల పస్కలోటో సవిరంగా అభివర్ణించారు. అంతే రహస్యాలను రచ్చ చేస్తోందంటూ ఆమెను ఇంటికి సాగనంపారు. తప్ప ఆమె తన బ్లాగులో రాసుకున్న కథనాలు వాస్తవాలా కాదా అనే అంశాన్ని పట్టించుకోక పోవడం నిజంగా విశేషమేనని చెప్పాలి. ఉద్వాసనకు గురయిన లలిత్‌ మోడీ స్థానంలో నూతన కమిషనరుగా బాధ్యతలు చేపట్టిన చిరయూ అమీన్‌ వచ్చీ రావడంతోనే ఆట తరువాత విందు విలాసాలకు తెర దించేశారు.

సెహ్వాగ్‌ తప్పు చేశాడు...

ఐపీఎల్‌-5 భాగంగా నిన్న జరిగిన మ్యాచ్‌లో 162 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌ 144 పరుగులు చేసింది. సెహ్వాగ్‌ జట్టులో ఆరవ బ్యాట్స్‌మెన్‌గా నెగిని బ్యాటింగ్‌ దిప్పి తప్పు చేశాడు. అతను కాక ఇక ఇర్పాన్‌ పఠాన్‌, టేలర్‌ ఉన్నారు. వీరిద్దరిలో ఎవరినో ఒకరి పంపిస్తే జట్టు గెలిచింది. నిర్లక్ష్యం వల్లనే నిన్న జట్టు ఓడిపోవడం అయ్యింది. అతను అడాలకుంటే తప్పని సరిగా అడి జట్టును గెలిచిపించేవాడు. మరి ఇంత తొందరపాటు పనికి రాదు. సరే ఒక విధంగా అనుకుంటే అతను అవుట్‌ అయితే మిగితా బ్యాట్స్‌మెన్స్‌ని ఎలా పంపిచాలో అలోచించాలి.

Sunday, May 20, 2012

చివరిలో సత్తా

చివరి రెండు మ్యాచ్‌లో సత్తా చాటినా డెక్కన్‌ ఛార్జర్స్‌. ఐపీఎల్‌-5లో భాగంగా డెక్కన్‌ చార్జర్స్‌ 16 మ్యాచ్‌లల్లో 11 మ్యాచ్‌లల్లో ఓడిపోయి, నాలుగు మ్యాచ్‌లల్లో గెలిచి తొమ్మిది పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. 18వ రోజు జరిగిన మ్యాచ్‌లల్లో రాజస్థాన్‌ రాయల్స్‌ మ్యాచ్‌ తప్పని సరిగా గెలవలసినా మ్యాచ్‌ల్లో డెక్కన్‌ ఛార్జర్స్‌ షాక్‌ ఇవ్వడంతో పైనల్‌ అవకాశం కోల్పోయింది. ఈరోజు జరిగిన మ్యాచ్‌లో బెంగుళూరు మ్యాచ్‌ల్లో డెక్కన్‌ మరో షాక్‌ ఇవ్వడంతో బెంగుళూరు పైనల్‌ అవకాశం కోల్పోయింది. చివరికి చెన్నై అవకాశం దక్కింది.

Sunday, April 29, 2012

వరుసగా నాలుగు హాప్‌ కొట్టి ఊపు మీద ఉన్న వీరుడు

 వరుసగా నాలుగు హాప్‌ కొట్టిన వీరుడు ఏవరో కాదు మన క్రికెట్‌ వీరుడు వీరేంద్ర సెహ్వాగ్‌. ఐపీఎల్‌ -5లో వరుసగా నాలుగు అర్థసెంచరీతో రాణించడంతో ఐపీఎలో రెండో స్థానం దక్కించుకున్నాడు. ఇప్పటి వరకు తొమ్మిది మ్యాచ్‌లో అడి 372 పరుగుల సాధించి రెండో స్థానం దక్కించుకున్నాడు. మొదటి స్థానంలో రహానే 416 పరుగులతో ఉన్నాడు. పూణేతో జరిగిన రెండు మ్యాచ్‌లో 57, 87 పరుగుల చేశాడు. ముంబయి జరిగినా మ్యాచ్‌లో 73, రాజస్థాన్‌ రాయల్స్‌తో 63 పరుగులు చేశాడు. ఈ టోర్నిలో సెహ్వాగ్‌ రెండో స్థానంలో ఉన్నాడు. ఐపీఎల్‌ పాయింట్ల పట్టికలో ఢిల్లీ డేర్‌ డెవిల్‌ తొమ్మిది మ్యాచ్‌లో అడి రెండు మ్యాచ్‌లో ఓడిపోయి 14 పాయింట్లతో మొదటి స్థానం దక్కించుకుంది.

Tuesday, April 17, 2012

పెళ్లి ఆలోచన ఇప్పట్లో లేదట వీళ్లకు ...

ప్రభాస్‌, గోపిచంద్‌, నాగచైతన్య, తరుణ్‌ వీళ్లందరు పెళ్లి విషయం మాట్లాడే వరకు ఇప్పట్లో లేదు. దానికి టైమ్‌ రావాలి అట్టున్నారు. సినిమా వాళ్లు కొందరు పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. వాళ్లు పెళ్లిళ్లకు వీళ్లు వెళ్తుతున్నారు. అక్కడ ఎవరో ఒక్కరు మరీ మీ పెళ్లి ఎప్పుడు సారు అన్ని అడిగితే ప్రస్తుతం కెరీర్‌పైనే దృష్టిపెట్టాననీ అంటున్నారు. అందరు పెళ్లి చేసుకుంటే వీళ్లు మాత్రం పెళ్లికు దూరం ఉంటున్నారు. మారి అసలు విషయం బయటికి రావడం లేదు.

Friday, April 13, 2012

ఏప్రిల్‌ 15న గబ్బర్‌సింగ్‌ గీతాలు

 పవన్‌కళ్యాణ్‌ హీరోగా తెరకెక్కుతున్న సినిమా 'గబ్బర్‌సింగ్‌'. శివబాబు బండ్ల సమర్పణలో పరమేశ్వర ఆర్ట్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై హరీష్‌ శంకర్‌ ఎస్‌.దర్శకత్వం వహిస్తున్నాడు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్ర గీతాలు ఏప్రిల్‌ 15న సరికొత్త స్టైల్‌లో చాలా గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నారు.
ఈ సందర్భంగా నిర్మాత బండ్ల గణేష్‌ మాట్లాడుతూ...'గబ్బర్‌సింగ్‌ ఆడియో ఏప్రిల్‌ 15న సరికొత్త స్టైల్‌లో చాలా గ్రాండ్‌గా రిలీజ్‌ చేస్తున్నాం. ఏప్రిల్‌ 15 ఉదయం పవన్‌కళ్యాణ్‌గారు స్పెషల్‌ ఫ్లైట్‌లో తిరుపతి వెళ్ళి దైవ దర్శనం చేసుకొని అభిమానుల్ని కలుసుకుంటారు. తర్వాత వైజాగ్‌, సింహాచలం వెళ్ళి దైవదర్శనం చేసుకొని అక్కడ కూడా అభిమానుల్ని కలుసుకుంటారు. అదేరోజు సాయంత్రం హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో చాలా గ్రాండ్‌గా జరిగే 'గబ్బర్‌సింగ్‌' ఆడియో ఫంక్షన్‌లో పాల్గొంటారు' అని అన్నారు.
ఈ చిత్రానికి ఫోటోగ్రఫీ : జైనన్‌ విన్సెంట్‌, సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, ఆర్ట్‌: బ్రహ్మ కడలి, ఎడిటింగ్‌: గౌతంరాజు, స్క్రీన్‌ప్లే: రమేష్‌రెడ్డి, వేగేశ్న సతీష్‌, డాన్స్‌: దినేష్‌, గణేష్‌, ఫైట్స్‌: రామ్‌లక్ష్మణ్‌, ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: డి.బ్రహ్మానందం, సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేష్‌, స్క్రీన్‌ప్లే-మాటలు-దర్శకత్వం: హరీష్‌ శంకర్‌ ఎస్‌.

Tuesday, April 10, 2012

డేరింగ్‌ విక్టరీ

సెహ్వాగ్, పీటర్సన్ మెరుపులు
ఢిల్లీ ఇరగదీసింది! బౌలింగ్‌లోనా బ్యాటింగ్‌లోనా? ఈ రెంటితో పాటు అద్భుతమైన గ్రౌండ్ ఫీల్డింగ్‌తో! అవును.. నాలుగు రనౌట్లతో చెన్నైకి దిమ్మతిరిగేలా చేసింది. ఫలితం.. భారీ లక్ష్యాన్ని నిర్దేశించడంలో చెన్నై రనౌటైంది. నామమాత్ర లక్ష్యా న్ని ఢిల్లీ సునాయాసంగా ఛేదించింది. మంగళవారం పూరి ఏకపక్షంగా జరిగన ఐపీఎల్ రెండో మ్యాచ్‌లో సెహ్వాగ్ జట్టు.. ధోనీమెన్‌పై 8 వికెట్ల తేడా తో భారీ విజయాన్ని నమోదు చేసింది. టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ సెహ్వాగ్ తొలుత ఫీల్డింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఐతే. అంతకుముందు మ్యాచ్‌లో వెట్టోరి తరహాలో వీరూ నిర్ణయం బెడిసికొట్టదు కదా! అనే సందేహాలకు ఢిల్లీ ఫీల్డర్లు తమ మెరుపు ఫీల్డింగ్‌తో తెరదించారు. ఫలితంగా చెన్నై 20 ఓవర్లలో 8 వికెట్లకు 110 పరుగులకే పరిమితమైంది. మోర్నీ మోర్కెల్ 4 ఓవర్లలో 19 పరుగులే ఇచ్చి 2 వికెట్లతో రాణించాడు. ఇక లక్ష్యఛేదనలో ఢిల్లీ 13.2 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి గెలిచింది. జట్టులో చేరిన బ్యాట్స్‌మెన్ కెవిన్ పీటర్సన్ (26 బంతు ల్లో 43 నాటౌట్; 4x3, 6x2) మెరుపు బ్యాటింగ్‌తో అలరి స్తే, జయవర్దనే 20 (నాటౌట్) పరుగులు చేశాడు. అంతకుముందు సెహ్వాగ్ (21 బంతుల్లో 33; 4x4; 6x1)... నమన్ ఓఝా (14)తో కలిసి ఢిల్లీకి మెరుపు ఆరంభాన్నిచ్చారు. అల్బీ మోర్కెల్ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్లోని తొలి మూడు బంతుల్ని ఓఝా బౌండ్రీకి తరలిస్తే, తర్వాత అతని ఓవర్లోనే సెహ్వాగ్ వరుసగా 4, 6 కొట్టి హల్‌చల్ చేశాడు. ఈ జంట తొలి వికెట్‌కు 8.2 రన్‌రేట్‌తో 32 పరుగులు జోడించారు. ఈ ఇద్దరు ఔటయ్యాక జయవర్దనే-పీటర్సన్‌లు అబేధ్యమైన మూడో వికెట్‌కు 61 పరుగులు జోడించారు. మోర్నీ మోర్కెల్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది.



Raina చెన్నై ‘పరుగో పరుగు’!
దిగ్గజాల చేరిక ఢిల్లీకి ఉత్సాహాన్నిచ్చిందో ఏమోగానీ ఢిల్లీ జట్టు అద్భుత ఫీల్డింగ్‌తో మెరిసింది. ఫలితంగా 4 రనౌట్లు! దీనికి తొలి బంతితోనే బీజంపడింది. సింగిల్ తీసే క్రమంలో డుప్లెసిస్ తడబాటు పాపం ఒక్క బంతి కూడా ఆడకుండానే విజయ్‌ని రనౌట్‌గా బలిగొంది. అంతేనా.. కొద్దిసేపటికే తనూ రనౌటయ్యాడు డుస్లిసిస్. ఫలితంగా 26 పరుగులకే ఓపెనర్లను కోల్పోయింది చెన్నై. ఈ దశలో రైనా రెండు సిక్సర్లతో హల్‌చల్ చేసినా లేని సింగిల్‌కు కక్కుర్తిపడి యోగేశ్ నాగర్ వేసిన అద్భుతమైన త్రోకు అతనూ రనౌటయ్యాడు. మరో మూడు ఓవర్లు ముగిశాయో లేదో బద్రీనాథ్ కూడా రనౌట్‌గానే వెనుదిరగాల్సివచ్చింది. అప్పటికి చెన్నై స్కోరు 9.4 ఓవర్లలో 64. ఇక మ రుసటి ఓవర్లో దక్కన్‌పై పేలిన జడేజా (13) కూడా వెనుదిరగడంతో చెన్నై భారీస్కోరు ఆశలకు గండిపడింది. భారీ హిట్టింగ్‌తో అ లరిస్తాడనుకున్న ధోనీ 18 బం తులో 11 రన్స్ చేసి ఔటయ్యాడు.

యువరాజ్ వచ్చేశాడు

yuviభారత స్టార్ క్రికెటర్ యువరాజ్‌సింగ్ ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు కీమోథెరపీ చికిత్సను పూర్తి చేసుకొని సోమవారం స్వదేశానికి తిరిగి వచ్చాడు. తల్లి షబ్న మ్, భారీ సంఖ్యలో అభిమానుల స్వాగతం మధ్య యువరాజ్ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాక్షిశయంలో అడుగుపెట్టాడు. కీమోథెరపీ కారణంగా జుత్తు పూర్తిగా కోల్పోయిన యువీ.. ఎరుపు రంగు స్పోర్ట్స్ క్యాప్, టీ షర్ట్, ఖాకీ ప్యాంటు ధరించి ఎయిర్‌పోర్టు వెనక గేటు గుండా బయటికి వచ్చాడు. అభిమానుల్ని చూడగానే ఉబికివచ్చిన ఉద్వేగాన్ని కళ్లద్దాల వెనక అణచుకుంటూ చిరునవ్వుతో విక్టరీ చిహ్నాన్ని చూపుతూ కారులో ఇంటికి బయలుదేరాడు. బుధవారం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి చికిత్స తీరుతెన్నుల్ని, తన భవిష్యత్ ప్రణాళికను వివరించనున్నాడు. కాగా, గుర్గావ్‌లోని తన నివాసానికి చేరుకున్నాక అతని రాకకోసం నిరీక్షిస్తున్న అభిమానులకు బాల్కనీ నుంచి యువీ అభివాదం చేయగా, అతని తల్లి షబ్నమ్ మీడియాతో మాట్లాడారు.

సినిమాలకు గుడ్‌బై?

ముగ్ధమనోహర సౌందర్యంతో భారతీయ సినీ ప్రేమికుల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్న ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్ త్వరలో సినిమాలకు గుడ్‌బై చెప్పనున్నట్లు తెలిసింది. ఇటీవలే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన ఐష్ గత కొంతకాలంగా సినిమాలకు పూర్తి దూరంగా వుంటోంది. ‘హీరోయిన్’ చిత్రం నుంచి అర్థాంతరంగా తప్పుకున్న తర్వాత ఐశ్వర్య మరే చిత్రంలోనూ నటించలేదు. డెలివరీ తర్వాత ఓ సంవత్సరం విరామం తీసుకొని సినిమాల్లో నటిస్తానని ఐష్ గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఐశ్వర్య పరిస్థితిని గమనిస్తే ఇక ఏ మాత్రం సినిమాల్లో నటించే అవకాశం లేదని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. ఈ మధ్యన రెండు భారీ చిత్రాల్లో నటించడానికి ఐశ్వర్యకు ఆఫర్లు వచ్చాయి. తల్లి కావడం వల్ల ఐశ్వర్య కొంచెం ఒళ్లు చేసి బొద్దుగా తయారైంది. దీంతో ఆఫర్లతో ముందుకొచ్చిన నిర్మాతలు ఈ సుందరి మళ్లీ మునుపటిలా ఒక్కపల్చగా తయారవ్వాలనే షరతులు ముందుంచారట. అయితే చక్కటి డైటింగ్‌తో నాజూకు అందాల్ని సొంతం చేసుకునే వీలున్న, ఆ సమయంలో తన పాప ఆలనాపాలనకు దూరమౌతానేమోనన్న బెంగపట్టుకుందట ఐష్‌కు. దీంతో భారీ పారితోషికాలతో వచ్చిన ఆఫర్లను కూడా ఈ మద్దుగుమ్మ తిరస్కరించిందని తెలిసింది. ఈ సమయంలో తనకు పాపే ముఖ్యమని భావిస్తున్న ఐశ్వర్య పాప కోసం సినిమాల్ని వదులుకోవడానికి సిద్ధంగా వుందని ఆమె సన్నిహితులు అంటున్నారు. దీంతో వెండితెరపై ఈ సుందరి సమ్మోహన రూపం చూసే అదృష్టం ఇక వుండబోదని ఆమె అభిమానులు నిరుత్సాహపడుతున్నారు.

Saturday, April 7, 2012

పూలరంగడు 50రోజుల

సునీల్‌ హీరోగా నటించిన 'ఫూలరంగడు' శనివారంతో 50 రోజు లకు చేరుకుటుంది. ఈ సందర్భం గా నిర్మాత అచ్చిరెడ్డి మాట్లా డుతూ... మా ఆర్‌ఆర్‌మూవీ మేకర్స్‌ బేనర్‌లో సంక్రాంతికి బిజినెస్‌మేన్‌ సూపర్‌ హిట్‌కాగా, మహాశివ రాత్రికి వచ్చిన పూలరంగడు సూపర్‌ హిట్‌ అయింది. ఏప్రిల్‌ 7కు 50 రోజులు పూర్తి చేసుకుంటోంది. ఈ చిత్ర విజయానికి సిక్స్‌ప్యాక్‌, అనప్‌ మ్యూజిక్‌ బాగా ప్లస్‌ అయ్యాయి. ప్రేమకావాలి తర్వాత మా బేనర్‌లో పూలరంగడు మరో సూపర్‌హిట్‌ చిత్రంగా నిలిచింది. ఈ చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియ జేశారు.

Tuesday, March 20, 2012

ఆసియా కప్‌లో ముఖ్యాంశాలు ...

పైనల్‌లో పాక్‌, బంగ్లాదేశ్‌
భారత్‌ :సచిన్‌ 100వ శతకం పూర్తి చేశారు.
విరాట్‌ కోహ్లీ అద్భుతమైన ఫామ్‌తో కోనసాగిస్తున్నాడు. పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 183 పరుగులు చేశాడు. ఆసియా పర్యటనలో మొత్తంలో విరాట్‌ తన విశ్వరూపాన్ని చూపించాడు. రెండు సెంచరీలు, ఒక అర్థసెంచరీ చేశాడు.
భారత్‌, బంగ్లాదేశ్‌పై ఓడిపోయి చివరికి నిరాశమిగిలింది. శ్రీలంక , పాకిస్థాన్‌ జట్లుపై గెలిచి బంగ్లాదేశ్‌ జట్టుపై ఓడిపోయింది. అత్యునమైన జట్టుపై గెలిచి బంగ్లాదేశ్‌పై ఓడిపోవడం చాలా దూరదృష్టంకరం. ఈ రోజు జరిగిన మ్యాచ్‌లో లంక గెలిస్తే పైనలో అవకాశం భారత్‌కు దక్కుతుంది. కాని బంగ్లాదేశ్‌ లంకపై ఐదు వికెట్ల తేడాతో గెలిచి ఫైనలో పాక్‌, బంగ్లాదేశ్‌ తలపడనుంది.

పాకిస్థాన్‌ :
ఆసియా కప్‌ భాగంగాలో శ్రీలంక, బంగ్లాదేశ్‌తో గెలిచి పాక్‌ తొమ్మిది పాయ్లింటతో మొదటి స్థానంలో ఉంది.
పాకిస్థాన్‌ భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌ 50 ఓవర్లలో 330 పరుగులు చేసింది. అనంతరం బరిలోకి దిగిన భారత్‌ 13 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యం సాధించింది. విరాట్‌ కోహ్లీ 183 పరుగులు చేసి విజయం సాధించాడు.


బంగ్లాదేశ్‌ : బంగ్లాదేశ్‌ తొలి మ్యాచ్‌ పాక్‌పై తలపడింది. అందులో పాకిస్థాన్‌ గెలిచింది. అతరువాత మ్యాచ్‌ భారత్‌తో ఢ కొంది. ఈ మ్యాచ్‌లో భారత్‌ తెలికగా తీసుకున్న బంగ్లాదేశ్‌ మాత్రం గెలిచి తీరాలి అన్ని నిర్ణయించుకుంది. అనుకున్న లక్ష్యం సాధించి నాలుగు పాయింట్లుతో ముందు అడుగు వేసింది. అతరువాత మ్యాచ్‌ బంగ్లాదేశ్‌, శ్రీలంక ఉంది. లంక మ్యాచ్‌తో గెలిస్తే ఏకంగా పైనలో మళ్లీ పాక్‌పై తలపడనుంది. ఈ రోజు జరిగిన మ్యాచ్‌లో లంకపై బంగ్లాదేశ్‌ ఐదు వికెట్లు తేడాతో గెలిచి పైనల్‌లో అవకాశం దక్కిచుకుంది. లంకతో మ్యాచ్‌ ఓడిపోయింటే భారత్‌ పైనల్‌ చేరేఅవకాశం ఉంది. కాని బంగ్లాదేశ్‌ మాత్రం అటు బ్యాటింగ్‌లో ఇటు బౌలింగ్‌లో మాత్రం రాణించడంతో పైనల్‌ చేరుకుంది. ఈ నెల 22న పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌ తలపడనుంది. చివరి మ్యాచ్‌లో పాక్‌పై బంగ్లాదేశ్‌ గెలిచి కప్‌ కోసం తహతహలాడుతుంది.
శ్రీలంక : ఆసియా కప్‌ భాగంగా లంక మూడు పరాజయాలు చూసింది. తొలి మ్యాచ్‌ భారత్‌, అతరువాత మ్యాచ్‌ పాకిస్థాన్‌ ఓడిపోయింది. చివరికి పరువు అయినా దక్కించుకోవాలన్ని అనుకున్న లంక చివరి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై ఐదు వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఆసియా కప్‌ పరాజయం పాలైయింది. 

Wednesday, March 14, 2012

ముచ్చటగా మూడు...


neelimaపవన్‌కల్యాణ్‌తో ఇటీవలే ‘పంజా’ చిత్రాన్ని నిర్మించిన సంఘమిత్ర ఆర్ట్స్ సంస్థ త్వరలో మూడు చిత్రాల నిర్మాణానికి పూనుకుంటోంది. కొత్త రచయితలను ప్రోత్సహించాలనే ఉద్ధేశ్యంతో ఇటీవలే ఈ సంస్థ కొత్త కథలకు స్వాగతం పలుకుతూ కాంటెస్ట్‌ను నిర్వహించింది. దీనికి రచయితల నుంచి మంచి స్పందన లభించిందని ,మొత్తం వేయికిపైగా కథల్లోంచి మూడు కథల్ని ఎంపికచేసుకున్నామని నిర్మాతలు నీలిమా తిరుమలశెట్టి, నగేష్ ముంతా తెలిపారు.
త్వరలో నిర్మించబోయే మూడు చిత్రాల విశేషాలను వారు తెలియజేస్తూ ‘అత్యద్భుతమైన మూడు కథల్ని ఎంపిక చేశాం. ‘అలియాస్ జానకి’ చిత్రానికి టెన్త్‌క్లాస్ చిత్రానికి దర్శకత్వం వహించిన చందు దర్శకత్వం వహిస్తాడు. ప్రేమకథా చిత్రమిది. చక్కటి సందేశం వుంటుంది. ‘ఏ శ్యామ్ గోపాల్ వర్మ ఫిలిం’ అనే చిత్రాన్ని ఐటీ రంగానికి చెందిన రాకేష్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తాడు. కామెడీ థ్రిల్లర్‌గా ఈ చిత్రం వుంటుంది. ‘అరే...అరెరే..’ అనే టైటిల్‌తో రానున్న చిత్రాన్ని శేఖర్ కమ్ముల దగ్గర సహాయ దర్శకుడిగా పనిచేసిన శశికిరణ్ టిక్కా దర్శకత్వం వహిస్తాడు. ఏప్రిల్ నెల నుంచి ప్రతి నెలా ఓ చిత్రాన్ని ప్రారంభిస్తాం. ఈ మూడు చిత్రాలకు సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాల్ని త్వరలో తెలియజేస్తాం. చిత్రాల ప్రారంభోత్సవ తేదీలను త్వరలో ప్రకటిస్తాం’ అన్నారు.

Tuesday, March 13, 2012

భారత్‌ తొలి విజయం

 305 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లంక 254 అలౌట్‌ అయ్యింది. 152కే మూడు వికెట్లు కోల్పోయిన లంక విజయం దిశగా పయనిస్తుంది. సంగక్కర 60, తిరిమానేన్‌ 29 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఆశ్విన్‌ ఒకే ఓవర్లలో రెండు వికెట్లు తీసుకోని లంకకు దెబ్బమీద దెబ్బ తీస్తాడు. 35 ఓవర్లలో సంగక్కర 65, తిరిమానేన్‌ 29 అవుట్‌ చేస్తాడు. 38 ఓవర్లలో వినయకుమార్‌ హ్యాట్రిక్‌ మిస్‌ అయ్యాడు. కులశేఖర్‌ 11, కపుదేగారా 0 అవుట్‌ చేస్తాడు. శ్రీలంక బ్యాట్స్‌మెన్‌లు జయవర్థనే 78, సంగక్కర 65 పరుగులు చేశారు. మిగితా బ్యాట్స్‌మెన్‌లు తక్కువ స్కోరుకు అవుట్‌ అయ్యారు. భారత్‌ బౌలింగ్‌లో పఠాన్‌ నాలుగు, వినరు కుమార్‌, అశ్విన్‌ చెరో మూడు వికెట్లు తీసుకున్నారు. అంతక ముందు బ్యాటింగ్‌ ప్రారంభించిన భారత్‌ 50 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 304 పరుగుల చేసింది. గంభీర్‌ 100, విరాట్‌ కోహ్లీ 108 పరుగులు చేశారు. ఇద్దరు ఒకరు మించి ఒకరుగా పోటి పడి సెంచరీ సాధించారు. సచిన్‌ 6 పరుగులకు అవుట్‌ అయ్యారు. చివరిలో ధోని 46, రైనా 30 పరుగులు చేశారు.

Friday, March 9, 2012

రాహుల్‌ స్థానం భర్తీ చేయలేనిది టీమిండియా ...

రాహుల్‌ ద్రావిడ్‌ స్థానం భర్తీ చేయలేనిదని బీసీసీఐ అధ్యక్షుడు ఎస్‌ శ్రీనివాస్‌ అన్నారు. రాహుల్‌ ఈ రోజు అంతర్జాతీయ క్రికెట్‌కి గుడ్‌బై చెప్పాడు. ఒక అద్భుతమైన క్రికెటర్‌ని చూసే అపురూపమైన అవకాశం మనకు లభించింది. ఆయన ఉత్తమ క్రీడా కారుడు మాత్రమే కాదు. అలాంటి వ్యక్తి మరొకరుంటారని నేను అనుకోవడం లేదు.

ఆస్ట్రేలియా పర్యటనలో టెస్టు సిరీస్‌లో రాహుల్‌ ద్రావిడ్‌, లక్ష్యణ్‌, సచిన్‌ సరిగా అడ్డకపోవడం వల్లనే సిరీస్‌ కోల్పోయా అని పలు సమచారం. అలాగే లక్ష్మణ్‌, ద్రావిడ్‌, సచిన్‌ టెస్టు సిరీస్‌లకు గుడ్‌బై చెప్పాలని పలువురు వ్యక్తం చేశారు. మరి ఈరోజు రాహుల్‌ ద్రావిడ్‌ అంతర్జాతీయ క్రికెట్‌కి గుడ్‌బై చెప్పాడు. దీనికి కారణం ...
బీసీసీఐ అధ్యక్షుడు ఎస్‌. శ్రీనివాస్‌ మాట్లాడూతూ ...


రాహుల్‌ ద్రావిడ్‌ ఈరోజు అంతర్జాతీయ క్రికెట్‌కి గుడ్‌బై చెప్పిన నేపథ్యంలో మాట్లాడుతూ ఒక అద్భుతమైన క్రికెటర్‌ని చూసే అపురూపమైన అవకాశం మనకు లభించింది. ఆయన ఉత్తమ క్రీడాకారుడు మాత్రమే కాదు... నేటి తరానికి చక్కని ఆద్శరం కూడా. ఆయనలాంటి వ్యక్తి మరొకరుంటారని నేను అనుకోను... అలాంటి వ్యక్తులు ఆట వదిలేసి వెళ్లిపోవాలని ఎవరూ కోరుకోరు. వ్యక్తిగతంగా ఇది నాకు చాలా బాధాకరమైన రోజు అని బీసీసీఐ అధ్యక్షుడు ఎస్‌.శ్రీనివాస్‌ చెప్పారు.

Sunday, March 4, 2012

11న రచ్చ ఆడియో


మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ హీరోగా ఎన్నో సూపర్‌డూపర్‌ హిట్‌ చిత్రాల్ని అందించిన మెగా సూపర్‌గుడ్‌ ఫిలింస్‌ ప్రై.లిమిటెడ్‌ సంస్థ లేటెస్ట్‌గా ‘రచ్చ’ నిర్మిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. సుప్రసిద్ధ నిర్మాత ఆర్‌.బి.చౌదరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి పారస్‌జైన్‌, ఎన్‌.వి.ప్రసాద్‌లు నిర్మాతలు. కాగా ‘రచ్చ’ ఆడియో వివరాలను చిత్ర నిర్మాతలలో ఒకరైన ఎస్‌.వి.ప్రసాద్‌ చెబుతూ ‘రామ్‌చరణ్‌ హీరోగా నటిస్తున్న రచ్చ చిత్రం ఆడియోను చలన చిత్ర ప్రముఖుల సమక్షంలో 11వ తేదీన హైదరాబాద్‌లోని పీపుల్స్‌ ప్లాజాలో విడుదల చేస్తు న్నాం. ఈ చిత్రాన్ని సమ్మర్‌ కానుకగా విడుదల చేస్తున్నాం’ అన్నారు. మణిశర్మ సంగీత దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం సంపత్‌నంది.

Friday, March 2, 2012

సచిన్‌ వన్డే మ్యాచ్‌లను దూరం చేయాలని పలువురు సూచనాలు ...

సచిన్‌ను వన్డే మ్యాచ్‌లను నుంచి దూరం చేయాలని పలువురు వ్యక్తం చేస్తున్నారు. వన్డేలు వదిలి, టెస్టులపై దృష్టిసారించాలని సలహా ఇచ్చారు. తానే స్వచ్ఛందంగా వన్డే క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాలని, తన వందో సెంచరీ కోసం అతడు ఆందోళన చెందనవసరం లేదని, పెద్ద ఫార్మాట్‌లో అతడు తప్పకుండా సెంచరీ సాధించి తీరతాడని అన్నాడు.

ఫైనలో భారత్‌, ఆస్ట్రేలియా డీ

ముక్కోణపు సిరీస్‌ భాగంగా ఫైనలో భారత్‌, ఆస్ట్రేలియా తలపడనుంది. అంతక ముందు లంక, భారత్‌ జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 37 ఓవర్లలో 321 పరుగుల లక్ష్యాని సాధించింది. విరాట్‌ కోహ్లీ సెంచరీతో సమాదానం చెప్పాడు. అతని తోడుగా గంభీర్‌ హాఫ్‌ చేశారు.

Friday, February 17, 2012

రాష్ట్ర బడ్జెట్ ముఖ్యాంశాలు

145854 కోట్ల రూపాయలతో రాష్ట్ర బడ్జెట్

రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 9.26 శాతం
రాష్ట్ర ప్రణాళిక వ్యయం 54030 కోట్ల రూపాయలు
ప్రణాళికేతర వ్యాయం 91,824కోట్ల రూపాయలు
ద్రవ్యం లోటు 20008 కోట్ల రూపాయలు

హైదరాబాద్: రాష్ట్ర బడ్జెట్ ముఖ్యంశాలు క్రింది విదంగా ఉన్నాయి.
  • జాతీయ వార్షక వృద్దిరేటుకన్నా రాష్ట్ర వార్షక వృద్దిరేటు అధికంగా ఉంది.

  • కేంద్రం నుంచి కరువు సాయంగా 3500 కోట్లు కోరినట్లు మంత్రి తెలిపారు.
  • జాతీయ విపత్తు పద్దు కింద 246 కోట్ల నిధులు రానున్నాయి.
  • ఆదాయ వనరుల సమీకరణ పెంపు.
  • రూపాయికే కిలో బియ్యం.
  • యువతకు ప్రైవేటు రంగంలో 15 లక్షల ఉద్యోగాలు.
  • లక్ష మందికి ప్రభుత్వ ఉద్యోగాలు
  • రైతులకు స్వయం సహాయక బృందాలకు 1075 కోట్ల వడ్డిలేని రుణాలు
  • రాజీవ్ విద్యామిషన్‌లో 2014 నాటికి 15 లక్షల ఉద్యోగాలు
  • 10లక్షల స్వయం సహాయక బృందాలకు వ్యవసాయ రుణాలు
  • 1లక్ష పైబడిన వ్యవసాయ రుణాలకు పావలా వడ్డి
  • ఇందిర జలప్రభ క్రింద లక్ష బోరుబావుల తవ్వకం
  • రెండు రచ్చబండ కార్యక్రమంలో 50లక్షల మందికి లబ్ధి
  • తీర ప్రాంతాల్లో మౌలిక అంశాలు వసతుల కల్పనకు 25 కోట్లు
  • గ్రామిణ రహదారుల అభివృద్దికి ప్రత్యేక పథకం
  • గ్రామీణాభివృద్దికి 600 కోట్ల రూపాయల నిధులు
  • పంచాయితీరాజ్‌కు 200 కోట్ల నిధులు
  • చిన్ననీటి పారుదల శాఖకు 300 కోట్ల నిధులు
  • రైతాంగానికి వ్యవస్థాగత రక్షణ చర్యలు
  • నూనే గింజల దిగుబడి 25 శాతం తగ్గింది.
  • సకాలంలో రుణాలు చెల్లించిన రైతులకు 1 లక్ష వరకు వడ్డీలేని రుణాలు
  • 2012-13 సంవత్సరానికి వ్యవసాయ రంగానికి 2572 కోట్ల నిధుల కేటాయింపు
  • పౌర సరఫరాల శాఖకు 3ద175 కోట్ల రూపాయలు
  • మాంసం గుడ్ల ఉత్పత్తిలో దేశంలో రాష్ట్రం రెండో స్థానం
  • పాల మిషన్‌లకు మొత్తం 100 కోట్లు కేటాయింపు
  • పశువుల వ్యాదినిరోదానికి 50 కోట్లు పేద రైతులకు పశువుకు కొనడానికి సగం సబ్సీడీ
  • పేద రైతులకు 42 వేల పశువులు అందజేయనున్న ప్రభుత్వం
  • సముద్ర ఉత్పత్తుల్లో 40 శాతం రాష్ట్ర ంనుంచి ఉత్పత్తి అవుతుంది.
  • మత్సకారుల బీమా పథకం క్రింద 234 కోట్ల రూపాయలు కేటాయింపు
  • గ్రామీణ ఉపాధి క్రింద 188 కోట్లు రూపాయలు
  • రాజివ్ యువకిరణాలు పథకం క్రింద ఉపాధి కల్పన
  • ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటికే 104,232 మందికి ఉద్యోగాలు
  • స్వయం సహాయక బృందాలకు రుణాలకు స్త్రీనిధి ద్వారా నిధులు
  • 1146 స్త్రీ శక్తి భవనాలకు ఒక్కోదానికి 25 లక్షలు చొప్పున కేటాయింపు
  • వ్యవసాయ రుణాలు రూపాయలు 51020 కోట్లు
  • 2012- 13 లో గ్రామీణాభివృద్దికి రూ 4703 కోట్లు
  • జాతీయ ఉపాధి మిషన్, ఉపాధి హామి పథకం అమలులో రాష్ట్రనిదే అగ్రస్థాన
  • ఇందనం, విద్యుత్‌శాఖలకు రూపాయలు5937 కోట్లు కేటాయింపు
  • రవాణా రోడ్డు భవనాలు రూ. 5032 కోట్లు కేటాయింపు
  • పట్టణాభివృద్ది రూ. 6586 కోట్లు
  • సాంఘీక సంక్షేమ శాఖ రూ. 2677 కోట్లు
  • గిరిజన సంక్షేమ శాఖ రూ 1540 కోట్లు
  • రాజీవ్ యువకిరణాలకు రూ. 777కోట్లు
  • బీసీ సంక్షేమం రూ. 3014 కోట్లు
  • మహిళా సంక్షేమశాఖ రూ. 2283 కోట్లు
  • వికలాంగుల సంక్షేమ రూ 66 కోట్లు
  • మైనార్టీ సంక్షేమం రూ. 489 కోట్లు
  • పాఠశాల విద్యా రూ. 15510 కోట్లు
  • సాంకేతిక విద్యా రూ. 1087 కోట్లు
  • ఉన్నత విద్య రూ. 1841 కోట్లు
  • గృహ నిర్మాణం రూ 2302కోట్లు
  • కార్మిక ఉపాధి శాఖ 500 కోట్లు
  • సాధారణ పరిపాలన శాఖ 88 కోట్లు
  • మత్య శాఖ రూ . 234 కోట్లు
  • ఐటీ శాఖ రూ. 151 కోట్లు
  • నీటి పారుధల శాఖ రూ. 15010 కోట్లు
  • పరిశ్రమలు రూ. 633 కోట్లు
  • హోశాఖ రూ. 4832 కోట్లు
  • వైద్య, ఆరోగ్య, కుటుంభ సంక్షేమం రూ. 5889 కోట్లు
  • పర్యాటక, సాంస్కక్షుతిక శాఖ, క్రీడాలు రూ 280 కోట్లు
  • రెవిన్యూ మిగులు రూ. 4444 కోట్లు
  • పర్యటక, అటవీ శాఖ రూ. 524 కోట్లు
  • ఈ ఏడాది ఆర్టీసీ 6000 కొత్త బస్సులు
  • ఆర్టీసీ రాయితీల క్రింద రూ. 710 కోట్లు చెల్లింపు
  • వెనకబడిన 66 మండలాల్లో బాలికలకు కొత్త బడులు
  • 22 జిల్లాల్లో 876 మండలాలను కరువు మండలాలుగా ప్రకటన
  • గోదావరిపై రాజమండ్రి వద్ద రెండో వంతెన నిర్మాణం పనులు 70 శాతం పూర్తి
  • డిమాండ్‌కు అనుగూనంగా 540 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి
  • రాష్ట్రంలో 29.84 లక్షల వ్యవసాయ పంపు సెట్లకు నాణ్యమైన విద్యుత్ కేటాయింపు
  • ప్రభుత్వ ప్రైవేటు భాగస్వాములతో 65664 కిలోమీటర్ల రహదారుల నిర్మాణం
  • బోధన ఫీజు చెల్లిపునకు రూ. 2142 కొట్లు కేటాయింపు
  • వికలాంగుల వివాహాల ప్రోత్సాహం కోసం 50 వేలు పెంపు
  • ఇందనం విద్యుత్ శాఖకు రూ. 5937 కోట్లు
  • పట్టణాభివృద్ది రూ. 6586 కోట్లు
  • ప్రతి శాసనసభా నియోజక వర్గంలో ఇండోర్‌స్టేడియం
  • జాతీయ తుఫాను విపత్తు ఉపసమనం క్రింద రూ. 2055 కోట్లు
  • హైదరాబాద్‌ను అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దేందుకు మూడు ప్రాజెక్టులు అమలు
  • ఔటర్ రింగ్‌రోడ్డుకు రూ. 6786 కోట్లు కేటాయింపు
  • ఎంఎంటీఎస్ రెండో దశకు రూ. 640 కోట్లు కేటాయింపు
  • క్రీడా రంగానికి రూ. 22 కోట్లు
  • గ్రామీణాభివృద్ధికి రూ. 4703 కోట్లు కేటాయింపు

Friday, February 10, 2012

టాలీవుడ్‌ బామ...

కాజల్‌ స్పీడ్గ రెట్టింపైంది. బిజినె స్‌మేన్‌ సెక్సస్‌తో తారా పథంలోకి దూసుకువెళ్లిన కాజల్‌కి తమిళం లో...తెలుగులో అవకాశాల వెల్లువ వచ్చిపడుతోంది. సూర్య, విజయ్‌ల చిత్రాల లో నటిస్తూ తమిళనాట తన హవా కొనసా గిస్తోంది. టాలీవుడ్గ లోనూ పెద్ద హీరోల చిత్రాలలో నటిం పజేసేం దుకు నిర్మాతలు పోటీపడుతున్నారు.

Tuesday, January 31, 2012

చెవిలో పూలు పెట్టుకోవడం ఎప్పుడైనా చూస్తారా ఇది చూడండి.

చెవిలో పూలు పెట్టుకోవడం ఎప్పుడైనా చూస్తారా ఇది చూడండి.
 



Monday, January 30, 2012

పవన్ సరసన్ కాజల్?


DSC55 talangana patrika telangana culture telangana politics telangana cinema‘బిజినెస్‌మేన్’ సక్సెస్‌తో మేఘాల్లో తేలిపోతోంది ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్. గ్లామర్‌తో పాటు చక్కటి అభినయం కలబోసిన పాత్రకు ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు లభిస్తున్నాయని మురిసిపోతోంది ఈ వయ్యారి. అయితే యాక్షన్ సినిమాల కంటే తనకు స్వతహాగా కామెడీ సినిమాలంటే ఇష్టమని, ఫుల్‌పూంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా నటించాలన్నది తన చిరకాల కోరికని సెలవిస్తోంది కాజల్ అగర్వాల్. ‘చిన్నప్పటి నుంచి యాక్షన్ సినిమాలంటే అస్సలు ఇష్టం వుండదు. అంతేందుకు టీవీ చూస్తున్నప్పుడు కూడా యాక్షన్ ఎపిసోడ్స్ వస్తే వెంటనే ఛానల్ మార్చేస్తా. అయితే సినిమాల్లోకి వచ్చాక యాక్షన్ సినిమాలకు తప్పనిసరిగా అలవాటు పడిపోవాల్సి వచ్చింది.
రాబోయే రోజుల్లో కామెడీ సినిమాలపై దృష్టిపెట్టాలనుకుంటున్నాను. హాస్యరస పాత్రల్లో నటించి మెప్పించడం అంత సులువు కాదు..ఎవరికైనా అది పెద్ద ఛాలెంజ్ లాంటిది. ఒకవేళ అలాంటి అవకాశం వస్తే నా సత్తా ఏంటో చూపించడానికి సిద్ధంగా వున్నాను’ అని చెప్పుకొచ్చింది కాజల్ అగర్వాల్. తాజా సమాచారం ప్రకారం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పవన్‌కల్యాణ్ నటించే చిత్రంలో ఈ సుందరిని కథానాయికగా ఎంపికచేయనున్నట్లు తెలుస్తోంది. దాదాపు పన్నెండేళ్ల తర్వాత పూరి-పవన్ కలయికలో వస్తోన్న ఈ చిత్రం మేలో సెట్స్‌పైకి వెళ్లనుంది. తొలుత ఈ చిత్రానికి బాలీవుడ్ భామను కథానాయికగా అనుకున్నా ‘బిజినెస్‌మేన్’ సక్సెస్‌తో పూరి చేత లక్కీగాళ్ అనిపించుకున్న ఈ భామనే హీరోయిన్‌గా ఓకే చేయనున్నట్లు సమాచారం.

Friday, January 27, 2012

మూడు భాషల్లో రాణిస్సా!

అంతా యువతీయువకులే ఉన్న టీమ్‌తో పనిచేస్తే హుషారొస్తుంది. ఫలితమూ అంతే బావుంటుంది’’ అంటున్నారు ‘కొలవెరి..డి’ ఫేం, ‘3’ సంగీతదర్శకుడు అనిరుధ్‌. 21ఏళ్ల ఈ యువకుడు ఒకే ఒక్క ‘కొలవెరి..’తో ప్రపంచ ప్రసిద్ధ సంగీతదర్శకుడైపోయాడు. తెలుగు, తమిళ్‌, హిందీలో నేడు వరుస అవకాశాలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడు. హైదరాబాద్‌లో పాత్రికేయులతో ముచ్చటిస్తూ-‘ఐశ్వర్య దర్శకత్వంలో ధనుష్‌ హీరోగా ‘3’ సినిమాకి సంగీతం అందిస్తున్నా. ఆల్బమ్‌లో రెండు పాటలు కూడా పాడాను. ‘కొలవెరి...’కి కోరస్‌ పాడాను. అసలు ‘కొలవెరి...’ అనేది ప్రేమలో విఫలమైనప్పుడు..విచారంలో పాడుకునే పాట. రొటీన్‌కి భిన్నంగా ఉండాలని బాణి కొత్తగా వినిపించాను. హాస్యం, విచారం ఒకే పాటలో ఉండేలా ట్యూన్‌ కట్టడం చాలా కష్టం. ప్రయత్నించి సక్సెసయ్యాను. అలాగే ‘3’ సినిమాకోసం ముందస్తు ప్రణాళికలెన్నో. సెట్స్‌కెళ్లడానికి ముందు 13 లఘుచిత్రాలు మేమంతా కలిసి రూపొందించాం. అందులోంచి ఓ లఘుచిత్రాన్ని పూర్తి స్థాయి ఫీచర్‌ సినిమా ‘3’ గా తెరకెక్కిస్తున్నాం’’ అన్నారు. ఏ.ఆర్‌.రెహ్మాన్‌ని విపరీతంగా అభిమానించే అనిరుధ్‌..బికాం పూర్తిచేసి లండన్‌ ట్రినిడాడ్‌ సంగీతకళాశాలలో మ్యూజిక్‌ కోర్స్‌ పూర్తిచేశారు. కర్నాటిక్‌ సంగీతంలోనూ మంచి ధిట్ట.

Sunday, January 22, 2012

ప్రిన్స్‌కు వదిన దొరికినట్లేనా!

వెంకటేష్‌, మహేష్‌బాబుల సంచలన కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభమయింది. అయితే గత కొంతకాలంగా వెంకటేష్‌ సరసన నటించే హీరోయిన్‌ విషయమై సందిగ్థం నెలకొంది. త్రిష, భూమిక, అమలాపాల్‌ లాంటి హీరోయిన్ల పేర్లు ఆ మధ్య వినిపించాయి. తీరా విషయానికి వస్తే అవన్నీ ఒట్టిదేనని తేలింది. ఇప్పుడు అనూహ్యంగా అంజలి పేరు వినిపిస్తోంది. అంజలి అచ్చంగా తెలుగమ్మాయి అనే సంగతి చాలామందికి తెలియదు. ఇప్పుడు ఈ అచ్చతెలుగు అందాల అపరంజి బొమ్మను వెంకటేష్‌ పక్కన నటింపజేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తాజా సమాచారం. వెంకటేష్‌ సరసన అయితే ఓకేగానీ హీరోయిన్లంతా ప్రిన్స్‌ మహేష్‌బాబుకు ఒదిన పాత్ర అనేసరికి వెనక్కి తగ్గుతున్నారు. ఇప్పుడు అంజలి కూడా అవకాశం ఉపయోగించుకుంటుందో లేక మిగతా హీరోయిన్ల మాదిరిగా వదులుకుంటుందో మరి వేచిచూడాలి.

Tuesday, January 17, 2012

మార్చిలో జహీర్‌ ఖాన్‌ పెళ్లి

భారత క్రికెటర్‌ జహీర్‌ ఖాన్‌ ఓ ఇంటివాడు కానున్నారు. చిరకాల స్నేహితులు, బాలీవుడ్‌ తార ఇషా షేర్వాణితో జహీర్‌ మార్చి నెలలో పెళ్లి జరుగనుంది. ఆస్ట్రేలియా పర్యటన తర్వాత జహీర్‌ ఖాన్‌ పెళ్లి జరిగే అవకాశముంది. ఒక వేళ మార్చి నెలలో సాధ్యపడకపోతే అక్టోబర్‌ నెలలో జరుగుతుందని కుటుంబ సభ్యులు తెలిపారు.