Tuesday, April 10, 2012

యువరాజ్ వచ్చేశాడు

yuviభారత స్టార్ క్రికెటర్ యువరాజ్‌సింగ్ ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు కీమోథెరపీ చికిత్సను పూర్తి చేసుకొని సోమవారం స్వదేశానికి తిరిగి వచ్చాడు. తల్లి షబ్న మ్, భారీ సంఖ్యలో అభిమానుల స్వాగతం మధ్య యువరాజ్ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాక్షిశయంలో అడుగుపెట్టాడు. కీమోథెరపీ కారణంగా జుత్తు పూర్తిగా కోల్పోయిన యువీ.. ఎరుపు రంగు స్పోర్ట్స్ క్యాప్, టీ షర్ట్, ఖాకీ ప్యాంటు ధరించి ఎయిర్‌పోర్టు వెనక గేటు గుండా బయటికి వచ్చాడు. అభిమానుల్ని చూడగానే ఉబికివచ్చిన ఉద్వేగాన్ని కళ్లద్దాల వెనక అణచుకుంటూ చిరునవ్వుతో విక్టరీ చిహ్నాన్ని చూపుతూ కారులో ఇంటికి బయలుదేరాడు. బుధవారం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి చికిత్స తీరుతెన్నుల్ని, తన భవిష్యత్ ప్రణాళికను వివరించనున్నాడు. కాగా, గుర్గావ్‌లోని తన నివాసానికి చేరుకున్నాక అతని రాకకోసం నిరీక్షిస్తున్న అభిమానులకు బాల్కనీ నుంచి యువీ అభివాదం చేయగా, అతని తల్లి షబ్నమ్ మీడియాతో మాట్లాడారు.

No comments:

Post a Comment