బొమ్మరిల్లులో హాసిని పాత్రలో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయిన జెనీలియా గుర్తుందా. ఆమె ఈ రోజు ఓ బిడ్డకు జన్మనిచ్చింది. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ కుమారుడు రితీష్ దేశ్‌ముఖ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆమె మంగళవారం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని రితీష్ ట్విట్టర్‌లో తెలిపాడు. తనకు చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నాడు. కాగా 2003లో బాయ్స్ సినిమాలో జెనీలియా నటించినప్పటి నుంచి వీరు ప్రేమించుకుంటున్నారు. 2012లో వీరు వివాహం చేసుకున్నారు.
No comments:
Post a Comment