Saturday, March 19, 2016

ఈ డ్రెస్‌కు బాలీవుడ్‌ స్టార్స్‌ ఫిదా అయ్యారట!

 పరిణితీ చోప్రా ధరించిన దుస్తులకు బాలీవుడ్‌ స్టార్స్‌ ఫిదా అయ్యారట. పరిణితీ తన ట్విట్టర్‌ ఖాతాలో ది టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా ఫిల్మ్‌ అవార్డుల కార్యక్రమంలో దిగిన ఓ ఫొటోను పోస్ట్‌ చేశారు. అందులో ఆమె ధరించిన బ్లూ లాంగ్‌ ఫ్రాక్‌ను బాద్‌షా షారుక్‌ ఖాన్‌, జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌, రణ్‌వీర్‌ సింగ్‌, వరుణ్‌ ధావన్‌లు సరదాగా పట్టుకుని ఉన్నారు. వీరంతా తన డ్రెస్‌కు ఫ్యాన్స్‌ అయిపోయారంటూ... పరిణితీ తనదైన స్టైల్‌లో ఫన్నీగా ట్వీట్‌ చేశారు. ఇలా స్టార్స్‌ అంతా ఒకే చోట సరదాగా ఉన్న ఫొటోకు అభిమానులు నుంచి తెగ లైక్‌లు వస్తున్నాయి. నిజంగానే ఆమె డ్రెస్‌ చక్కగా ఉందని అభిమానులు కామెంట్స్‌ పెట్టారు.

Thursday, March 17, 2016

బుర్రిపాలెంలో నమ్రత

ప్రభుత్వ పథకాల వల్లె వేయడంతో గ్రామస్తుల నిరాశ
రెండునెలల్లో మహేష్‌ వచ్చి ప్రణాళికను వెల్లడిస్తాడని ప్రకటన



బ్రహ్మరథం పట్టిన బుర్రిపాలెం గ్రామస్తుల కోలాహాలం మధ్య సినీ నటుడు మహేష్‌ భార్య నమ్రత శిరోద్కర్‌ గ్రామంలో గురువారం పర్యటించారు. తెనాలి మండలం బుర్రిపాలేన్ని మహేష్‌బాబు ఆన్‌లైన్‌ ద్వారా దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గ్రామ స్థితిగతులు తెలుసుకునేందుకు మహేష్‌బాబు భార్య నమ్రతా శిరోద్కర్‌, అతని సోదరి, ఎంపి గల్లా జయదేవ్‌ భార్య పద్మావతి బుర్రిపాలెంలో పర్యటించారు. పలు ప్రార్థనా మందిరాలను సందర్శించినానంతరం సూపర్‌స్టార్‌ కృష్ణ తల్లి నాగరత్నమ్మ నిర్మించిన జడ్‌పి పాఠశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామంలోని కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన సభకు ఎంపిడిఒ బి.శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. నమ్రతా మాట్లాడుతూ గ్రామీణుల్లో చైతన్యం తెచ్చి వారి జీవన ప్రమాణాలు మెరుగుపరచ్చేందుకు సిఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని అన్నారు. సిఎం స్ఫూర్తితో స్మార్ట్‌ గ్రామాలకు తామూ ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. పలు ప్రభుత్వ పథకాలను ఆమె ఇక్కడే ఉదహరించారు. సిఎం, పిఎం పాలనపై ప్రశంసలు కురిపించిన ఆమె ప్రతిఒక్కరూ మరుగుదొడ్డి నిర్మించుకుంటే ప్రభుత్వాలే ప్రత్యేక గ్రాంటులు విడుదల చేస్తాయని చెప్పారు. మహేష్‌బాబు సోదరి, ఎంపి గల్లా జయదేవ్‌ భార్య పద్మావతి మాట్లాడుతూ తన తండ్రి సొంతూరు బుర్రిపాలెం, అమ్ముమ సొంతూరు కంచర్లపాలెం అంటే తనకు అమితమైన మక్కువన్నారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కార్యకర్తకు మాత్రమే మాట్లాడే అవకాశం కల్పించారు. తమ గ్రామంలోని మూడు అంగన్వాడీ కేంద్రాలూ పాఠశాలల్లోనే కొనసాగుతున్నాయని, ప్రత్యేక భవనాలు నిర్మించాలని కార్యకర్త కోరారు. అయితే వారి నుండి మాత్రం సరైన స్పందన వ్యక్తమవ్వలేదు. ఈ సందర్భంగా జడ్‌పి పాఠశాల నేతృత్వంలో రూపొందించిన కృష్ణ, మహేష్‌బాబు కుటుంబ సభ్యుల డాక్యుమెంటరీని ప్రదర్శించారు. అనంతరం కృష్ణ నివాసంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలోనూ పై అంశాలనే ప్రస్తావించారు. ఎంపి గల్లా జయదేవ్‌ నిధుల నుండి రూ.27లక్షలతో సిసి రోడ్లు నిర్మిస్తారని రెండురోజుల కిందటి నాటి అంశాన్ని గుర్తుచేశారు. కార్యక్రమంలో ఎంపిపి ఎస్‌.వెంకట్రావు, జడ్‌పిటిసి ఎ.జయలక్ష్మి, సర్పంచ్‌ కె.సామ్రాజ్యం, ఎంపిటిసి ఎస్‌.రామ్మోహనరావు, హెచ్‌ఎం లలితప్రసాద్‌, గ్రామ కార్యదర్శి కిషోర్‌ పాల్గొన్నారు.
కంచెర్లపాలెంలో పద్మావతి..
అనంతరం ఎంపి గల్లా జయదేవ్‌ భార్య పద్మావతి తాను దత్తత తీసుకున్న కంచర్లపాలెంలో పర్యటించారు. అభివృద్ధి పనులపై అధికారుల నుండి వివరాలు సేకరించారు. స్థానిక ప్రజలతో సమావేశం కాగా సిసి రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణం, శ్మశాన వాటికల అభివృద్ధి, కమ్యూనిటీ హాలు, బస్సు ఏర్పాటు అంశాలను గ్రామస్తులు ఆమె దృష్టికి తెచ్చారు. పరిశ్రమను ఏర్పాటు చేస్తే ఉపాధి అవకాశాలు కలుగుతాయని కోరారు. ఈ సందర్భంగా పద్మావతి మాట్లాడుతూ గ్రామాభివృద్దికి రూ.27లక్షలతో డ్రెయిన్‌ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టామన్నారు. ఉపాధి హామీ, రూ.60 లక్షల ప్రభుత్వ నిధులతో అభివృద్ధి పనులు చేపట్టారని చెప్పారు. కార్యక్రమంలో సర్పంచ్‌ కె.నిర్మలాకుమారి, తహశీల్దార్‌ జివి సుబ్బారెడ్డి, ఎంపిపి, జడ్‌పిటిసి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

'బాహుబలి 2లో నటించడం లేదు'


 తాను 'బాహుబలి 2' సినిమాలో నటించడం లేదని హీరోయిన్ శ్రియ తెలిపింది. ఈ చిత్రంలో భల్లాలదేవుడిగా నటించిన దగ్గుబాటి రానాకు జోడీగా శ్రియ నటించనుందని అంతకుముందు వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను శ్రియ తోసిపుచ్చింది. 'బాహుబలి 2'లో తాను లేనని వెల్లడించింది. ఢిల్లీలో ఇటీవల నిర్వహించిన అమెజాన్ ఇండియా ఫ్యాషన్ వీక్ లో ఆమె పాల్గొంది. డిజైనర్ కనిజ సలూజ డిజైన్ చేసిన దుస్తులు ధరించి ర్యాంప్ పై మెరిసిపోయింది.
         ఈ సందర్భంగా విలేకరులు 'బాహుబలి 2' గురించి అడగ్గా... ఈ సినిమాలో నటించమని తనను ఎవరూ సంప్రదించలేదని తెలిపింది. ఈ చిత్రం నటించాలని ఉన్నా తనకు అవకాశం రాలేదని వెల్లడించింది.
            'బాహుబలి' తొలి భాగంలో రానా కొడుకు పాత్రను మాత్రమే చూపించిన దర్శకుడు రాజమౌళి.. రెండో భాగంలో భల్లాలదేవుడి భార్యను కూడా చూపించనున్నాడు. ఈ పాత్ర ఎవరికి దక్కుతుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రభాస్, రానా లీడ్ రోల్స్‌ లో నటించిన 'బాహుబలి 2' వచ్చే ఏడాది ఏప్రిల్ 14న విడుదల చేయాలని చిత్రయూనిట్ ప్లాన్ చేస్తోంది.

Wednesday, March 16, 2016

అర్జంట్‌గా నాకొక కూతురు కావాలి..

 టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సమంతకు అర్జెంట్‌గా  ఓ కూతురు కావాలట. అదీ మూడు రోజుల్లోనే. 'శనివారం లోగా నాకో బేబీ కావాలి. ఇప్పుడెలా అంటూ..' ట్వీట్‌ చేశారు సమంత. ఇంత అర్జెంట్‌గా సమంతకి కూతురి అవసరం ఎందుకొచ్చిందో ఓసారి చూద్దాం..ప్రస్తుతం 'బ్రహ్మోత్సవం' షూటింగ్‌లో బిజీగా ఉన్న సమంత.. మహేష్‌బాబు తనయ సితారతో గడిపేందుకు శనివారం సమయాన్ని కేటాయించింది. అయితే సితార తనతో ఆడుకోవడానికి సమంత కూతురిని కూడా తీసుకురమ్మని రిక్వెస్ట్‌ చేసిందట. దీంతో ఏం చేయాలో తెలీయక సమంత పై విధంగా ట్వీట్‌ పెట్టింది. 'శనివారం సితారతో ఆడుకోవడానికి డేట్‌ ఫిక్స్‌ చేశా. కాని సితారకి నా కూతురు కూడా కావాలంట. శనివారంలోగా ఓ బేబీని ఎలా ఎరేంజ్‌ చేయాలి' అంటూ సితారతో దిగిన ఓ ఫోటోను సరదాగా ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసింది సమంత. 'బ్రహ్మోత్సవం'తోపాటు సమంత నితిన్‌ సరసన 'అ...ఆ' చిత్రంలోనూ నటిస్తున్న విషయం విదితమే.

రాజకుమారిగా కాజల్‌

  ‘మగధీర’ చిత్రంలో రాజకుమారి మిత్రవిందగా అందరినీ ఆకట్టుకొంది నటి కాజల్‌. ఇప్పుడు ఈ భామ తన తరువాతి చిత్రం ‘సర్దార్‌ గబ్బర్‌సింగ్‌’లోనూ రాజకుమారిగా కనిపించనుందట. కాజల్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ఈ విషయాన్ని తెలుపుతూ... సర్దార్‌ సెట్‌లోని ఒక ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. సర్దార్‌ గబ్బర్‌సింగ్‌, రాజకుమారి అర్షి అంటూ హ్యాష్‌టాగ్‌లు పెట్టారు.
కాజల్‌ తొలిసారి ఈ చిత్రంలో పవన్‌ కల్యాణ్‌కు జంటగా నటించారు. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ నెల 20న చిత్రం ఆడియో విడుదల వేడుకలను నిర్వహించనున్నారు. ఏప్రిల్‌ 8న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tuesday, March 15, 2016

సానియా మీర్జా X షోయబ్ మాలిక్


 భారత్, పాకిస్తాన్ ప్రపంచకప్ మ్యాచ్‌కు ముందు ఉన్న ఉత్కంఠను కార్పొరేట్ కంపెనీలు కూడా వాడుకుంటున్నాయి. తాజాగా నెస్లేసంస్థ తమ ఉత్పత్తి కోసం పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్, అతని భార్య (భారత టెన్నిస్ స్టార్) సానియా మీర్జాలతో కలిసి ఓ యాడ్‌ను రూపొందించింది. ఇందులో ఇద్దరూ తమ తమ దేశాల్లో ప్రసిద్ధి చెందిన ఉత్పత్తులే గొప్ప అంటూ వాదనకు దిగుతారు. సచిన్ స్ట్రయిట్ డ్రైవ్ గొప్పని సానియా అంటే... అక్తర్ యార్కరే గ్రేట్ అని మాలిక్ అంటాడు. ప్రస్తుతం ఈ యాడ్ పాకిస్తాన్‌లో ప్రసారం అవుతోంది.

అమితాబ్‌, రజనీల షికార్లు!

 తారల పాట్లు తారలవి. సరదాగా ఏ రోడ్డు మీదనో షికారుగా నడవాలంటే కుదరదు. అభిమానులు గుర్తుపట్టి మూగిపోతారు. అయినా అప్పుడప్పుడు ఏ మారువేషంలోనే సరదాలు తీర్చుకుంటారు. అలాగే చేశారు అమితాబ్‌ బచ్చన్‌.
నిర్మాత సూజిత్‌ సర్కార్‌ అమితాబ్‌ బచన్‌తో ుఆగ్రా కా దాబ్రా’ సినిమా తీస్తున్నారు. దిల్లీ నేపథ్యంలో సాగే ఈ సినిమా అనిరుద్ద రాయ్‌ చౌదరి దర్శకత్వంలో రూపు దిద్దుకుంటోంది. సినిమా షూటింగు కోసం దిల్లీ వెళ్లిన అమితాబ్‌ ఒక ఖాకీ ప్యాంటు, బాగా వదులుగా వుండే చొక్కా ధరించి ముఖాన్ని కవర్‌ చేసే టోపీ ధరించి క్రిక్కిరిసి వుండే దిల్లీ ప్రధాన వీధిలో ఒంటరిగా నడుచుకుంటూ వెళ్లారు. అయితే ఎవరూ ఆయనను గుర్తుపట్టలేదు. ునాకు తోడుగా ఒక వీధి కుక్క మాత్రం నడిచింద’ని అమితాబ్‌ ట్వీట్‌ చేసారు.

 తనను గుర్తుపట్టని విధంగా మేకప్‌ చేసిన వ్యక్తిని అభినందించుకుంటూ తాను బాలీవుడ్‌కు రాకముందు తిరిగిన వీధిని చుట్టబెట్టేశారు. అమితాబ్‌ లాగే మరో సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ కూడా బెంగళూరులో తన స్నేహితుల్ని, తను నిత్యం ఆరాధించే దేవాలయాన్ని చూడాలనిపిస్తే మారువేషంలో వెళుతుంటారు. ుుఈ స్టార్‌ డమ్‌ రావడం వల్ల కానీ, లేకపోతేనా... బెంగళూరు వీధుల్లో డ్యాన్స్‌ చేస్తూ తిరిగేవాడిని’’ అంటూ చెబుతుంటారు రజనీకాంత్‌.

Sunday, March 13, 2016

రజనీ చిత్రం రూ.350 కోట్లకు ఇన్సూరెన్స్

 సూపర్‌స్టార్ రజనీకాంత్ చిత్రాన్ని రూ.350 కోట్లకు ఇన్సూరెన్స్ చేశారు. ఇలా ఇన్సూరెన్స్ చేసిన తొలి తమిళ చిత్రం బహుశా ఇదే కావొచ్చు. రజనీకాంత్ ప్రస్తుతం రెండు భారీ చిత్రాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే.అందులో ఒకటి కబాలి, మరొకటి 2.ఓ.ఇది ఎందిరన్‌కు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న చిత్రం అన్నది గమనార్హం. స్టార్ దర్శకుడు శంకర్ మరో అద్భుతానికి పూనుకున్న చిత్రం ఇది. ఎమీజాక్సన్ నాయకిగా నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో విలన్‌గా నటించడం విశేషం.
            నీరవ్‌షా చాయాగ్రహణం, సంగీత మాంత్రికుడు ఏఆర్.రెహ్మాన్ సంగీతంతో పాటు, హాలీవుడ్ సాంకేతికనిపుణులు పనిచేస్తున్న 2.ఓ చిత్రాన్ని లైకా సంస్థ రూ.350 కోట్లతో బ్రహ్మాండంగా నిర్మిస్తోంది.ఇంత భారీ బడ్జెట్‌లో తొలి తమిళ చిత్రం ఇదేననీ ఘంటాపథంగా చెప్పవచ్చు. విదేశీ స్టంట్ కళాకారులు, మేకప్ నిపుణులు,అబ్బుర పరచే సెట్స్ అంటూ నిరాటంకంగా చిత్రీకరణ జరుపుకుంటున్న 2.ఓ చిత్రాన్ని లైకా సంస్థ 350 కోట్లకు ఇన్సూరెన్స్ చేసినట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం.