Wednesday, March 16, 2016

అర్జంట్‌గా నాకొక కూతురు కావాలి..

 టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సమంతకు అర్జెంట్‌గా  ఓ కూతురు కావాలట. అదీ మూడు రోజుల్లోనే. 'శనివారం లోగా నాకో బేబీ కావాలి. ఇప్పుడెలా అంటూ..' ట్వీట్‌ చేశారు సమంత. ఇంత అర్జెంట్‌గా సమంతకి కూతురి అవసరం ఎందుకొచ్చిందో ఓసారి చూద్దాం..ప్రస్తుతం 'బ్రహ్మోత్సవం' షూటింగ్‌లో బిజీగా ఉన్న సమంత.. మహేష్‌బాబు తనయ సితారతో గడిపేందుకు శనివారం సమయాన్ని కేటాయించింది. అయితే సితార తనతో ఆడుకోవడానికి సమంత కూతురిని కూడా తీసుకురమ్మని రిక్వెస్ట్‌ చేసిందట. దీంతో ఏం చేయాలో తెలీయక సమంత పై విధంగా ట్వీట్‌ పెట్టింది. 'శనివారం సితారతో ఆడుకోవడానికి డేట్‌ ఫిక్స్‌ చేశా. కాని సితారకి నా కూతురు కూడా కావాలంట. శనివారంలోగా ఓ బేబీని ఎలా ఎరేంజ్‌ చేయాలి' అంటూ సితారతో దిగిన ఓ ఫోటోను సరదాగా ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసింది సమంత. 'బ్రహ్మోత్సవం'తోపాటు సమంత నితిన్‌ సరసన 'అ...ఆ' చిత్రంలోనూ నటిస్తున్న విషయం విదితమే.

రాజకుమారిగా కాజల్‌

  ‘మగధీర’ చిత్రంలో రాజకుమారి మిత్రవిందగా అందరినీ ఆకట్టుకొంది నటి కాజల్‌. ఇప్పుడు ఈ భామ తన తరువాతి చిత్రం ‘సర్దార్‌ గబ్బర్‌సింగ్‌’లోనూ రాజకుమారిగా కనిపించనుందట. కాజల్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ఈ విషయాన్ని తెలుపుతూ... సర్దార్‌ సెట్‌లోని ఒక ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. సర్దార్‌ గబ్బర్‌సింగ్‌, రాజకుమారి అర్షి అంటూ హ్యాష్‌టాగ్‌లు పెట్టారు.
కాజల్‌ తొలిసారి ఈ చిత్రంలో పవన్‌ కల్యాణ్‌కు జంటగా నటించారు. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ నెల 20న చిత్రం ఆడియో విడుదల వేడుకలను నిర్వహించనున్నారు. ఏప్రిల్‌ 8న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tuesday, March 15, 2016

సానియా మీర్జా X షోయబ్ మాలిక్


 భారత్, పాకిస్తాన్ ప్రపంచకప్ మ్యాచ్‌కు ముందు ఉన్న ఉత్కంఠను కార్పొరేట్ కంపెనీలు కూడా వాడుకుంటున్నాయి. తాజాగా నెస్లేసంస్థ తమ ఉత్పత్తి కోసం పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్, అతని భార్య (భారత టెన్నిస్ స్టార్) సానియా మీర్జాలతో కలిసి ఓ యాడ్‌ను రూపొందించింది. ఇందులో ఇద్దరూ తమ తమ దేశాల్లో ప్రసిద్ధి చెందిన ఉత్పత్తులే గొప్ప అంటూ వాదనకు దిగుతారు. సచిన్ స్ట్రయిట్ డ్రైవ్ గొప్పని సానియా అంటే... అక్తర్ యార్కరే గ్రేట్ అని మాలిక్ అంటాడు. ప్రస్తుతం ఈ యాడ్ పాకిస్తాన్‌లో ప్రసారం అవుతోంది.

అమితాబ్‌, రజనీల షికార్లు!

 తారల పాట్లు తారలవి. సరదాగా ఏ రోడ్డు మీదనో షికారుగా నడవాలంటే కుదరదు. అభిమానులు గుర్తుపట్టి మూగిపోతారు. అయినా అప్పుడప్పుడు ఏ మారువేషంలోనే సరదాలు తీర్చుకుంటారు. అలాగే చేశారు అమితాబ్‌ బచ్చన్‌.
నిర్మాత సూజిత్‌ సర్కార్‌ అమితాబ్‌ బచన్‌తో ుఆగ్రా కా దాబ్రా’ సినిమా తీస్తున్నారు. దిల్లీ నేపథ్యంలో సాగే ఈ సినిమా అనిరుద్ద రాయ్‌ చౌదరి దర్శకత్వంలో రూపు దిద్దుకుంటోంది. సినిమా షూటింగు కోసం దిల్లీ వెళ్లిన అమితాబ్‌ ఒక ఖాకీ ప్యాంటు, బాగా వదులుగా వుండే చొక్కా ధరించి ముఖాన్ని కవర్‌ చేసే టోపీ ధరించి క్రిక్కిరిసి వుండే దిల్లీ ప్రధాన వీధిలో ఒంటరిగా నడుచుకుంటూ వెళ్లారు. అయితే ఎవరూ ఆయనను గుర్తుపట్టలేదు. ునాకు తోడుగా ఒక వీధి కుక్క మాత్రం నడిచింద’ని అమితాబ్‌ ట్వీట్‌ చేసారు.

 తనను గుర్తుపట్టని విధంగా మేకప్‌ చేసిన వ్యక్తిని అభినందించుకుంటూ తాను బాలీవుడ్‌కు రాకముందు తిరిగిన వీధిని చుట్టబెట్టేశారు. అమితాబ్‌ లాగే మరో సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ కూడా బెంగళూరులో తన స్నేహితుల్ని, తను నిత్యం ఆరాధించే దేవాలయాన్ని చూడాలనిపిస్తే మారువేషంలో వెళుతుంటారు. ుుఈ స్టార్‌ డమ్‌ రావడం వల్ల కానీ, లేకపోతేనా... బెంగళూరు వీధుల్లో డ్యాన్స్‌ చేస్తూ తిరిగేవాడిని’’ అంటూ చెబుతుంటారు రజనీకాంత్‌.

Sunday, March 13, 2016

రజనీ చిత్రం రూ.350 కోట్లకు ఇన్సూరెన్స్

 సూపర్‌స్టార్ రజనీకాంత్ చిత్రాన్ని రూ.350 కోట్లకు ఇన్సూరెన్స్ చేశారు. ఇలా ఇన్సూరెన్స్ చేసిన తొలి తమిళ చిత్రం బహుశా ఇదే కావొచ్చు. రజనీకాంత్ ప్రస్తుతం రెండు భారీ చిత్రాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే.అందులో ఒకటి కబాలి, మరొకటి 2.ఓ.ఇది ఎందిరన్‌కు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న చిత్రం అన్నది గమనార్హం. స్టార్ దర్శకుడు శంకర్ మరో అద్భుతానికి పూనుకున్న చిత్రం ఇది. ఎమీజాక్సన్ నాయకిగా నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో విలన్‌గా నటించడం విశేషం.
            నీరవ్‌షా చాయాగ్రహణం, సంగీత మాంత్రికుడు ఏఆర్.రెహ్మాన్ సంగీతంతో పాటు, హాలీవుడ్ సాంకేతికనిపుణులు పనిచేస్తున్న 2.ఓ చిత్రాన్ని లైకా సంస్థ రూ.350 కోట్లతో బ్రహ్మాండంగా నిర్మిస్తోంది.ఇంత భారీ బడ్జెట్‌లో తొలి తమిళ చిత్రం ఇదేననీ ఘంటాపథంగా చెప్పవచ్చు. విదేశీ స్టంట్ కళాకారులు, మేకప్ నిపుణులు,అబ్బుర పరచే సెట్స్ అంటూ నిరాటంకంగా చిత్రీకరణ జరుపుకుంటున్న 2.ఓ చిత్రాన్ని లైకా సంస్థ 350 కోట్లకు ఇన్సూరెన్స్ చేసినట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం.

Thursday, March 10, 2016

త్రిష తెలుగు పాట పాడిందోచ్!

 త్రిష హీరోయిన్‌గా వచ్చి 13 ఏళ్లయింది. ఈ తమిళ పొణ్ణు తెలుగులో టాప్‌స్టార్‌గా ఎదిగింది. అగ్ర హీరోలు చిరంజీవి నుంచి మహేశ్‌బాబు వరకూ అందరితోనూ నటించిన ఈ భామ ఇప్పటి దాకా తెర మీద తెలుగులో గొంతు విప్పలేదు. బయట కూడా పొడి పొడి తెలుగే వచ్చు.
ఇప్పటివరకూ డబ్బింగ్ చెప్పని త్రిష ఏకంగా పాటే పాడేశారు. తాజాగా ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘నాయకి’. గోవి దర్శకత్వంలో గిరిధర్ మామిడిపల్లి, ఎం. పద్మజ తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తున్న నాయకి కోసం రెండు భాషల్లోనూ త్రిష పాడడం విశేషం. ప్రపంచ మహిళా దినోత్సవం రోజున సంగీత దర్శకుడు రఘు కుంచె సారథ్యంలో  త్రిష ఈ పాట రికార్డింగ్ పూర్తిచేశారు. 

Wednesday, March 9, 2016

గిన్నిస్‌ రికార్డులో సోనాక్షి సిన్హాకు స్థానం


మహిళలందరితో కలిసి ఒకేసారి గోళ్లకు రంగు వేసుకొని బాలీవుడ్‌ నటి సోనాక్షి సిన్హా గిన్నిస్‌బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డులో స్థానం సంపాదించింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ముంబయిలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో పలు కళాశాలలకు చెందిన వందలాది మంది విద్యార్థినులు ఉత్సాహంగా పాల్గొని ఏకకాలంలో గోళ్లకు రంగు వేసుకున్నారు.
పోలాండ్‌కు చెందిన కాస్మోటిక్‌ బ్రాండ్‌ ఇంగ్లోట్‌తో కలిసి సోనాక్షి సిన్హా సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. కార్యక్రమ అనంతరం గిన్నిస్‌ రికార్డు ధ్రువీకరణ పత్రాన్ని నిర్వాహకులు సోనాక్షికి అందజేశారు.

Monday, March 7, 2016

సమ్మర్‌లో సై!

 శత్రువులపై కన్నెర చేసే సింహం..  ఆపదలో ఉన్నవారికి సహాయం చేసే ఆపద్బాంధవుడు.. సమాజం కోసం పాటుపడే మంచి సంఘ సంస్కర్త... టోటల్‌గా మంచితనానికి చిరునామా కబాలి. ఈ మాఫియా డాన్ లక్ష్యం ఏంటి? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. టైటిల్ రోల్‌లో రజనీకాంత్ హీరోగా పా. రంజిత్ దర్శకత్వంలో ‘కలైపులి’ ఎస్. థాను నిర్మిస్తున్న ‘కబాలి’ ఫస్ట్ లుక్‌కి భారీ ఎత్తున స్పందన లభించిన విషయం తెలిసిందే. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందిన ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది.
ఈ సందర్భంగా ‘కలైపులి’ ఎస్. థాను మాట్లాడుతూ - ‘‘రజనీకాంత్‌తో సినిమా నిర్మించాలన్న నా కల ఈ చిత్రంతో నెరవేరింది. మంచి కథ, కథనాలతో రూపొందిన ఈ చిత్రంలో ఆయన గెటప్ ప్రత్యేక ఆకర్షణ అవుతుంది. రంజిత్ మంచి స్టయిలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు. ఏప్రిల్ మొదటి వారంలో టీజర్‌ను, రెండో వారంలో పాటలను, వేసవి కానుకగా మేలో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చెప్పారు. రాధికా ఆప్టే, ధన్సిక, కిశోర్, జాన్ విజయ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి మాటలు: సాహితి, సంగీతం: సంతోశ్ నారాయణ్, పాటలు: సిరివెన్నెల, చంద్రబోస్, అనంతశ్రీరామ్, కెమెరా: మురళి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: దేవి-శ్రీదేవి సతీశ్.