Sunday, June 19, 2016

ఇక చాలు.. కట్టు కథలకు అడ్డుకట్ట వేయండి!

సెలబ్రిటీలు కాస్త క్లోజ్‌గా మూవ్ అయితే చాలు.. వాళ్ల మధ్య ఏదో నడుస్తోందనీ... డేటింగ్ చేస్తున్నారనీ.. ఇలా రకరకాల గాసిప్పులు ప్రచారమవుతాయి. ముఖ్యంగా సినిమా రంగంలో మాత్రం ఇటువంటి గాసిప్పులకు కొదవే ఉండదు. ఫలానా హీరో ఫలానా హీరోయిన్‌తో డేటింగ్ చేస్తున్నాడట.. ఆ ఇద్దరూ ప్రేమలో ఉన్నారట... త్వరలో పెళ్లి చేసుకుంటారట...! వంటి వార్తలు కోకొల్లలు. ప్రస్తుతం కృతీసనన్, సుశాంత్ సింగ్‌రాజ్‌పుత్ గురించి అలాంటి ఓ వార్తే ప్రచారంలో ఉంది.

మహేశ్‌బాబుతో ‘1 నేనొక్కడినే’, నాగచైతన్యతో ‘దోచెయ్’ చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ ఇప్పుడు ‘రాబ్తా’ అనే హిందీ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రకథానాయకుడు సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్‌తో ఆమె క్లోజ్‌గా మూవ్ అవుతున్నారన్న వార్త బాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. గత కొన్నాళ్లుగా బాలీవుడ్‌లో ఇది ఓ హాట్ టాపిక్. ఇంకా మౌనం వహిస్తే, ఈ ప్రచారం వీర విహారం చేస్తుందనుకున్న కృతీ సనన్ స్పందించారు.

‘‘ఒక సినిమా చేసేటప్పుడు హీరో, డెరైక్టర్.. ఇలా అందరితో క్లోజ్‌గా ఉంటాం. అంత మాత్రాన ఏదో ఉన్నట్లేనా? ఏదీ లేకుండా ప్యూర్ ఫ్రెండ్‌షిప్ ఉండదా? సరదాగా మాట్లాడుకున్నంత మాత్రాన లవ్‌లో ఉన్నట్లేనా? ఇక చాలు.. సుశాంత్‌తో నాకేదో ఉందని అల్లిన కట్టుకథలకు అడ్డుకట్ట వేస్తే బెటర్’’ అని ఘాటుగా అన్నారు కృతి.

ఇదిలా ఉంటే..  చాలా రోజులుగా బుల్లితెర తార అంకితా లోఖాండేతో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కి ‘సమ్‌థింగ్’ ఉండేదనే వార్తలు వచ్చేవి. ఇటీవల ఈ ఇద్దరూ విడిపోవడంతో.. ఇప్పుడా ప్లేస్‌ని కృతి రీప్లేస్ చేసిందని చెప్పుకుంటున్నారు. కానీ, కృతి క్లారిఫికేషన్ ఇచ్చేశారు కాబట్టి.. ఇక వీళ్ల గురించిన వదంతులకు ఫుల్‌స్టాప్ పడుతుందని ఊహించవ

No comments:

Post a Comment