డ్వెయిన్ జాన్సన్ అనే కన్నా.. ‘ది రాక్’ అంటేనే అతనెవరో అందరికి బాగా తెలుస్తుంది. ‘హెర్కులస్’.. ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ వంటి చిత్రాలతో మెప్పించి నటుడిగా స్థిరపడినా.. డ్వెయిన్ కెరీర్ మాత్రం రెజ్లింగ్ పోటీలతో ప్రారంభమైంది. ఆరు అడుగులకుపైగా ఎత్తు.. కండలు తిరిగిన దేహంతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న ఈ హీరోకు.. చిన్నతనంలో భారీ శరీరాకృతే ఇబ్బందులు తెచ్చి పెట్టిందట.
‘మా నాన్న బాక్సర్. దీంతో చాలా ప్రదేశాలకు మారాల్సి వచ్చేది. ప్రతిసారి కొత్త ప్రాంతాలు.. కొత్త స్కూళ్లలో చదవాల్సి వచ్చేది. నాకు 14 ఏళ్ల వయస్సు వచ్చినప్పటినుంచి నా దేహాన్ని చూసి.. అందరూ నన్ను అండర్ కవర్ పోలీసు అని భావించేవాళ్లు. ఏ పాఠశాలకు వెళ్లినా అలాగే అనుకునేవారు. అది చాలా ఇబ్బందిగా అనిపించేది. 14 ఏళ్ల వయసులో నాలుగు స్కూళ్లు మారాను. దీంతో నాకు స్నేహితులెవరు లేకుండా పోయారు. కనీసం అమ్మాయిలతో సరదాగా గడిపే అవకాశం కూడా రాలేదు’ అని వాపోయాడు.
No comments:
Post a Comment