Tuesday, March 8, 2011

క్వార్టర్స్‌ పైనల్‌ వెళ్ళే టీమ్స్‌ ఇవే .... ?

క్వార్టర్స్‌ పైనల్‌ వెళ్లే టీమ్స్‌ ఇలా ఉంటాయి ...?
 విషయం : ఎప్పుడు ఏ మ్యాచ్‌ ఏలో అడుతారో ఎవరికి తేలియదు. చిన్న జట్టు అయినా పెద్ద జట్టు అయినా మ్యాచ్‌లో కీలక పాత్ర వహించి జట్టే విజయం సాధిస్తుంది.
గ్రూప్‌ - ఎ
శ్రీలంక, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, పాకిస్థాన్‌, ( జింబాబ్వే )
గ్రూప్‌ - బి
దక్షాణాఫ్రికా, వెస్టిండిస్‌, భారత్‌, ఇంగ్లాండ్‌, ( ఐర్లాండ్‌ )
గ్రూప్‌ -ఎ నుంచి జింబాబ్వే జట్టు కూడా వెళ్లే అవకాశాలు సజీవంగా ఉన్నాయి. జింబాబ్వే ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌లో రెండుంటిలో ఓడిపోయి, ఒక మ్యాచ్‌ గెలిచింది. ఇంకా మూడు మ్యాచ్‌లు ఉన్నాయి. శ్రీలంక , పాకిస్థాన్‌ రెండు బిగ్‌ హిట్‌ మ్యాచ్‌లు కాబట్టి వాటిలో ఒక మ్యాచ్‌ గెలిస్తే చాలు, మిగిలింది కెన్యా మ్యాచ్‌లో తప్పనిసరిగా రన్‌రెట్‌తో గెలిచి క్వార్టర్స్‌ పైనల్‌లో స్థానం వుటుంది.
10-03-2011 జింబాబ్వే × శ్రీలంక
14-03-2011 జింబాబ్వే × పాకిస్థాన్‌
20-03-2011 జింబాబ్వే × కెన్యా

గ్రూప్‌ - బి నుంచి ఐర్లాండ్‌ జట్టు కూడా వెళ్లే అవకాశాలు ఉన్నాయి. మూడు మ్యాచ్‌లో రెండు ఓడిపోయి, ఒక మ్యాచ్‌లో గెలిచి రెండు పాయ్లింటు ఉంది. ఇంకా మూడు మ్యాచ్‌లో మిగిలివున్నాయి. వీటిలో రెండు మ్యాచ్‌లు గెలిస్తే క్వార్టర్స్‌ పైనల్‌ చేరుకుటుంది. వెస్టిండిస్‌ , దక్షణాఫ్రికా రెండు బిగ్‌ హిట్‌ మ్యాచ్‌లు కాబట్టి వాటిలో ఒక మ్యాచ్‌ గెలిస్తే చాలు, మిగిలింది నెదర్లాండ్‌ మ్యాచ్‌లో తప్పనిసరిగా రన్‌రెట్‌తో గెలిచి క్వార్టర్స్‌ పైనల్‌లో స్థానం వుటుంది.
11-03-2011 ఐర్లాండ్‌× వెస్టిండిస్‌
15-03-2011 ఐర్లాండ్‌× దక్షణాఫ్రికా
18-03-2011 ఐర్లాండ్‌ × నెదర్లాండ్‌

ప్రపంచకప్‌లో మ్యాచ్‌ ఫిక్సింగ్‌ జరిగింది....?

ప్రపంచకప్‌లో మ్యాచ్‌ ఫిక్సింగ్‌ పాక్‌ , న్యూజిలాండ్‌ మధ్య జరిగినట్లు పలు అనుమానాలు వ్యక్తం మవుతున్నాయి. పాక్‌ బ్యాట్స్‌మెన్‌లు తక్కువ స్కోరు అవుట్‌ అవడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. న్యూజిలాండ్‌ చివరి ఐదు ఓవర్లలో 100 పరుగులు చేశారు. ముఖ్యంగా న్యూజిలాండ్‌ బ్యాట్స్‌మెన్‌లు నాథన్‌ మెక్‌కల్లమ్‌ 10 బంతులలో రెండు సిక్స్‌లు, ఒక ఫోరు సహయంతో 19 పరుగులు చేశాడు. ఓరమ్‌ 9 బంతులలో మూడు సిక్స్‌లు, ఒక ఫోరుతో ఏకంగా 25 పరుగుల చేశాడు. టేలర్‌ 124 బంతులలో ఏడు సిక్స్‌లు, ఎనిమిది ఫోర్లు సహయంతో 131 పరుగులు చేసి పాక్‌ బౌలింగ్‌లో చిత్తు చేశారు. చివరిలో వీరు ముగ్గురు విజృంబించి స్కోరు బోర్డుని పరుగైతిచారు. ఏది ఏమైన మ్యాచ్‌ మొదట్లో స్లోగా వున్న. చివరికి న్యూజిలాండ్‌ రెచ్చిపోయి ఏకంగా 302 పరుగులు చేసింది.
ప్రపంచకప్‌లో పాక్‌, న్యూజిలాండ్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో పాక్‌ 192 పరుగులకే అలౌట్‌ అయ్యింది. పాక్‌ బ్యాట్స్‌మెన్‌లు హఫీజ్‌ 5, అహ్మద్‌ షెహజాద్‌ 10, అక్మల్‌ 8, యూనిస్‌ఖాన్‌ 0, మిస్బావుల్‌ హక్‌ 7, ఆఫ్రిదీ 17 ఉమర్‌ అక్మల్‌ 38 పరుగులు చేశారు. పాక్‌ 45 పరుగులకి ఐదు వికెట్లు కోల్పోయిన ఉంది. క్రీజులో అఫ్రిదీ , ఉమర్‌ అక్మల్‌ ఇద్దరు బ్యాట్స్‌మెన్‌లు ఉన్నారు. అఫ్రిదీ రెచ్చిపోయి ఏకంగా 9 బంతులలో ఒక సిక్స్‌, రెండు ఫోర్లు సహయంతో 17 పరుగులు చేశాడు. లక్ష్యం 303 పరుగుల ఉన్న సమయంతో అలా అడడం పద్దతి కాదు. కెప్టెన్‌ అన్న ఆలోచన లేకుండా మరి రెచ్చిపోయి అడడం పద్దతి కాదు. అతను అలా అడబటి మ్యాచ్‌ గోవిందా అయ్యింది. అతను కనీసం అర్థ సెంచరీ చేసివుంటే రజాక్‌ సెంచరీ చేసేవాడు..? అప్పుడు మ్యాచ్‌ పాక్‌ దిశగా ఉండేది.

టాప్‌ వన్‌లో స్థానం కోసం తమన్నా ... ?

 తమన్నా బిజీ బిజీ అయిపోయింది. ఇప్పటికే మూడు సినిమాలో నటిస్తున్న తమన్నా మరో సినిమాకు పచ్చ జెండా ఊపింది అని సమాచారం. టాలీవుడ్‌లో ఎన్నడూ లేనంత బిజీ అయిపోయిన తమన్నా అటు తమిళంలో ఇంకా అగ్ర స్థానాన్ని ఎంజారు చేస్తోంది. ఈ ఏడాదిలో విడుదలయ్యే తెలుగు చిత్రాలలో తమన్నా జోరు మీద ఉంది. ఇప్పటికే అల్లు అర్జున్‌తో ' బద్రీనాథ్‌ ' నాగ చైతన్యతో ' ఐయామ్‌ నంబర్‌ వన్‌ ' ఎన్టీఆర్‌తో సురేందర్‌ డైరెక్షన్‌లో ' రచ్చ ' చిత్రాల్లోను నటిస్తోంది. చరణ్‌తో సినిమాకు నటించ అవకాశలున్నాయని సమాచారం.

Monday, March 7, 2011

గాయంతో ప్రపంచకప్‌కు పీటర్సన్‌ దూరం

 ఇంగ్లండ్‌ బ్యాట్‌మెన్‌ పీటర్స్‌న్‌ గాయం ప్రపంచకప్‌కు దూరం కానున్నాడు. హెర్‌నియా ఆపరేషన్‌ చేయించుకోవాడానికి స్వదేశానికి తిరుగుపయనమవుతున్నాడు. ఈ ప్రపంచకప్‌ తర్వాత ఆపరేషన్‌ చేయించుకోవాడాలని అనుకున్నాడు. కాని గాయం మరి ఇబ్బందిగా వుడడం వల్ల స్వదేశానికి వెళ్తున్నాడు. 2011 ప్రపంచకప్‌లో ఇప్పటి వరకు జరిగిన నాలుగు మ్యాచ్‌లో 131 పరుగుల చేశాడు. నెదర్లాండ్‌ 39, భారత్‌ 31, ఐర్లండ్‌ 59, దక్షాణాఫ్రికా 2 పరుగులు చేశాడు. పీటర్సన్‌ స్థానంలో మోర్గాన్‌ తీసుకునే అవకాశం ఉంది.

కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌గా కెప్టెన్‌ గంభీర్‌ ఎంపిక

 కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ జట్టు కెప్డెన్‌గా భారత్‌ క్రికెట్‌ జట్టు సభ్యుడు గౌతమ్‌ గంభీర్‌ని నియమించారు. ఏప్రిల్‌ నెలలో ఆరంభం కానున్న ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ ( ఐపీఎల్‌) లోని కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ జట్టుకు గంభీర్‌ కెప్టెన్‌గా వ్యమహరించనున్నారు. ఐపీఎల్‌-3లో ఢిల్లీ డేర్‌విలర్స్‌ జట్టుకు నాయ్యకత్వం వహించాడు. కోల్‌కతా జట్టు గంభీర్‌గా ఎంపికయ్యాడు. ఐపీఎల్‌ వేలంగా పాటలో గంభీర్‌ 11.04 కోట్ల రూపాయల్ని చెల్లించి కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

Sunday, March 6, 2011

నేడు అల్లు అర్జున్‌ పెళ్లి

 ఈరోజు స్లైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ - స్నేహరెడ్డిల పెళ్లి జరుగనుంది. మాదాపూర్‌ హైటెక్‌ సిటిలో జరిగే ఈ వివాహానికి ఈ రాత్రి 10.30 గంటలుగా ముహూర్తం నిర్ణయించారు. ఈరోజు జరిగే పెళ్లి వేడుకకు బంధుమిత్రులతోపాటు టాలీవుడ్‌, కోలీవుడ్‌, హాలీవుడ్‌ ప్రముఖులుతోపాటు రాజకీయ ప్రముఖలు కూడా హాజరవుతారు.

ప్రపంచకప్‌లో భాగంగా టాప్‌ 5 బ్యాట్స్‌మెన్‌ , టాప్‌ 5 బౌలర్స్‌ , ఎవరికి ఎన్ని పాయింట్లు పట్టిక

ప్రపంచకప్‌లో భాగంగా టాప్‌ 5 బ్యాట్స్‌మెన్‌ , టాప్‌ 5 బౌలర్స్‌ , ఎవరికి ఎన్ని పాయింట్లు పట్టిక  




 

Saturday, March 5, 2011

సౌత్‌సూపర్‌ స్టార్‌ ' విక్టరీ ' విజయం

 సిసిఎల్‌ ( సెలబ్రిటీ క్రికెట్‌ లీగ్‌ ఆధ్వర్యంలో శనివారం డాక్టర్‌ వైఎస్‌. రాజశేఖరరెడ్డి ఏసీఏ- వీడీసీఏ స్టేడియంలో ఆద్వంతం అత్యంత ఆసక్తికరంగా జరిగిన సన్నాహక 20-20 మ్యాచ్‌లో సౌత సూపర్‌ స్టార్స్‌ జట్టు 36 పరుగుల తేడాతో బాలీవుడ్‌ జట్టుపై విజయం సాధించింది. సినీనటుడు మోహన్‌బాబు, రాజ్యసభ్యులు సుబ్బరావి రెడ్డి టాస్‌ వేశారు. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న సౌత్‌సూపర్‌ స్టార్స్‌ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. ఇందుకు సమాధానంగా బాలీవుడ్‌ జట్టు ఆరు వికెట్ల నష్టానికి 156 పరుగులు మాత్రమే చేయగలిగింది. సౌత్‌సూపర్‌స్టార్స్‌ బ్యాట్స్‌మెన్‌ ఆదర్శ 48 పరుగులు చేసి టాప్‌ స్కోర్‌గా నిలిచాడు. అతని తోడుగా చివరిలో కెప్టెన్‌ వెంకటేష్‌ 28 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. తారకరత్న 30, కార్తీక్‌ 10, ద్రువ్‌ 10, తరుణ్‌ 4, సంతన్‌భాగ్యరాజ్‌ 4, శ్యామ్‌ 0 పరుగులు చేశారు.