సూపర్‌స్టార్ మహేష్‌బాబు దత్తత తీసుకున్న గుంటూరు జిల్లా బుర్రిపాలెం గ్రామంలో వైద్య ఆరోగ్య సర్వే నిర్వహించారు. మహేష్ తన సోషల్‌మీడియా ఖాతా ద్వారా ఈ విషయాన్ని తెలుపుతూ... వైద్య విద్యార్థులు గ్రామస్థులను కలిసిన సమయంలో తీసిన ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. ఎంతో శ్రమించి గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి, అనారోగ్య సమస్యల గురించి తెలుసుకున్న యంగ్ ఇండియా వాలంటీర్ ఆర్గనైజేషన్‌కు మహేశ్ ధన్యవాదాలు తెలిపారు. ఆరోగ్యం పట్ల గ్రామస్థులకు అవగాహన కల్పించే కార్యక్రమంలో 150 మంది వైద్య విద్యార్థుల బృందం పాల్గొన్నట్లు మహేష్ తెలిపారు.
No comments:
Post a Comment