తొలిటెస్టులో తమ జట్టు విజయం సాధించడానికి చాలా కారణాలున్నాయని ఆసీస్ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ అన్నాడు. టాపార్టర్ నుంచి టెయిలెండర్ల వరకు అందరూ విజయంలో ఉన్నారన్నాడు. మైక్ హస్సీ, పాంటింగ్ ఒత్తిడిలోనూ విలువైన పరుగులు అందించారన్నాడు. తొలి ఇన్నింగ్స్ లో ఎడ్ కోవాన్‌తో, రెండో ఇన్నింగ్స్ లో హస్సీ తో పాంటింగ్ నెలకొల్పిన భాగస్వామ్యాలు చలా కీలకంగా మారాయని చెప్పాడు. టెయిలెండర్లు కూడా విలువైన పరుగులు రాబట్టడంలో సఫలమయ్యారని చెప్పాడు.
పటిష్టమైన భారత బ్యాటింగ్ లైనప్ ను కుప్పకూల్చడంలో తమ బౌలర్లపాత్ర ఎంతో ఉందన్నాడు. భారత్ ను తొలి ఇన్నింగ్స్ లో 282పరుగులకు రెండో ఇన్నింగ్స్ లో 169పరుగులకు ఆలౌట్ చేయడంలో సక్సెస్ అయ్యారని చెప్పాడు. పాటిన్సన్, హిల్ఫెన్హాస్, పీటర్ సిడిల్ ప్రదర్శన ఆనందకరంగా ఉందని చెప్పాడు. ఇంకా తాము మెరుగుపర్చుకోవాల్సింది చాలా ఉందన్నాడు. టాపార్డర్ ఇంకా పరుగులు రాబడితే భారత్ ను ఓడించడం మరింత సులువౌతుందని క్లార్క్ చెప్పాడు. జనవరి 3 నుంచి జరుగనున్న సిడ్నీ టెస్టులో మంరింత మెరుగైన ప్రదర్శనను అందిస్తామని మైఖేల్ క్లార్క్ తెలిపాడు.